20, జులై 2011, బుధవారం

పనిష్మెంట్-1

ఒక రోజు ఇంటికొచ్చేసరికి అలవాటుగా గుమ్మం దగ్గరే విశ్వనాథం నడుము చుట్టు చేతులేసి నడుస్తూ

"ఏంటి శేఖర్ఇవ్వాళ పూలు తెమ్మన్నానా?”

"అరెరెమర్చిపోయానేవెళ్దాం రాతెచ్చుకుందాం“

"ఒద్దులేనాన్న తెచ్చారు, “

అప్పుడు చూశాడు విశ్వనాథం మామగారిని

హాల్లో కూర్చుని పుస్తకమేదో చదువుకుంటున్నారు.

"ఆయన ముందేంటి ఇలా "అని విడిపించుకున్నాడు ఇందుమతిని

"ఏం పర్వాలేదులేనీకంతా మొహమాటం.”

********

సుబ్బు వచ్చాడుగుండె జబ్బుల డాక్టరు.

వంట హాబీఅద్భుతంగా చేస్తాడు వంట .

ఎ ఎన్నార్ అంటే ప్రాణంలంచ్ టైమ్ లో ఇద్దరూ కలిసే భోంచేస్తారుఆ టైమ్ లో కేసులుపేషంట్స్ అంటే అలుగుతాడు.

"ఏమిట్రా ఈ మధ్యన కూరలు ఇంత బాగుంటున్నాయికొత్త వంటావిడా?” విశ్వనాథం అడిగాడు

"కాదునేనే చేస్తున్నా వంటహాస్పిటల్ కు రాబోయే ముందు.”

"మీ ఆవిడ ఊరెళ్ళిందా?”

"తిండివంట రెండూ మానేసిందిరా నువ్వో సారి ఆవిణ్ణి చూడాలి.”

"ఏంఏమయ్యింది?”

"రాత్రుళ్ళు నిద్ర పోదురాఅర్ధరాత్రి లేచిఅరుంధతి లాకంప్యూటర్ మీద పడి చూస్తూ ఉంటుంది.

అదేమంటేగణాంకాలని చూస్తున్నానంటుంది.”

"అంటేఏం భాష అది?”

నా బొంద భాషఈ మధ్య బ్లాగోవల్లకాడో ఏదో పెట్టిందాఊ ఁ రాసేస్తుంది.”

"ఇంకా, “

"నిముషానికో సారి మెయిల్ చెక్ చేసుకుని ఎవడూ కామెంట్లు పెట్టిచావలేదే అని ఎవరినో గాల్లో కి చూసి మెటికలు విరుస్తుందిఅందుకని నేనే ఆవిడ నిద్ర పోయేటప్పుడు, 'అఙాత పేరుతో బోలెడు కామెంట్లు రాసేసి పడుకుంటున్నాడబ్బు పోసిఅమెరికా ఫోన్ లు, గట్రా చేసిమా కజిన్స్ అందరికీ చెప్పానువదిన బ్లాగు మీరందరూ చూడాల్రా అంటూచెడ్డీలు వేసుకుని నా ముందే తిరిగిన వెధవలుఎంత ఫోజు కొట్టారనీ, 'అన్నాయ్వి డోంట్ హావ్ టైమ్ యూ నోఅన్నార్రా.

రోజూ వంట తగలేసేస్తుంది.

ఇహ ఇలా కుదరదని నేనే వంట చేస్తున్నా. “

"కష్టమే"

"మెల్లగా అంటావేరామొన్నోసారికొంచం ఒరిజినల్ గా ఉంటుందనిఇవన్నీ నువ్వే రాస్తున్నావంటే నమ్మలేక పోతున్నానే అన్నానువెంటనేకట్టుకున్న మొగుడే నన్ను నమ్మ నప్పుడునేనూ ఎందుకూ బతికిఅని నాయనా లక్ష్మణా చితి అరేంజ్ చేయి అని లేచింది.”

"ఈ పురాణ భాషేంటి మధ్యలో?”

"చెప్పా గదరాబ్లాగుల్లో పురాణాల బ్లాగులు కూడా ఉంటాయిఏవో పద్యాలు అవ్వీ try చేస్తూ ఉంటుంది.”

"తర్వాతేమయ్యిందో చెప్పు మరి "

మరిది లేడులే మంట బెట్టడానికిమా అమ్మకు నేనొక్కణ్ణేగాబావి లో దూకి ఛస్తానని బయలుదేరిబయమేసి, చస్తే గిస్తే బ్లాగులోనే పడిచస్తానని ఏడుస్తూ కూర్చుందినువ్వే ఏదయినా చెయ్యాల్రా.”

"ఈ రకం కేసు ఎప్పుడూ చూళ్ళేదురాఅయినా చూస్తానులే"


ఇంతలో నర్సు వచ్చి "పేషెంట్ ఒకళ్ళు ఉన్నారు సార్." చెప్పింది

సుబ్బు వెళ్తానని లేచాడు.

ఆవిడొచ్చి ఎదురుగా కూర్చుందిచిన్న పర్సు వెంట తెచ్చుకుందిబాగా ఆందోళనగాఅస్థిరంగా పర్సు జిప్పు వేస్తూతీస్తూ..

"చెప్పండి "

"మా ఆయనకి ఎవరితోనో  సంబంధం ఉందని తెలిసిందండీఒకటే ఫోనుల్లో గుసగుసలురాత్రి పూట కూడా నేను నిద్ర పోయాననుకునిసోఫాలో కూర్చుని దానితో ఒకటే కబుర్లునేను ఎవరు అని నిలదీస్తే వంటింటోకి పరిగెత్తి ఆ నంబరు డిలీట్ చేసాడండీ.”

"మామూలు స్నేహమేమోమీకు భయపడి నంబరు తీసేసాడేమోఆలోచించండి.” విశ్వనాథం సలహా ఇచ్చాడు.

ఆవిడ అనుమానంగా చూసిందివంద రూపాయల కన్సల్టేషన్ బూడిదలో పోసినట్టేనా అన్నట్టు.

"మామూలు స్నేహమావాడి బొందా,” మాతృభాషలోకి దిగింది. "తిరుగుబోతు సచ్చినోడువాడికి నా ఉసురు తగిలి పురుగులుపట్టి పోతాడు.

మొన్న వాడూఅదిన్నూ కలిపి ఆటోలో పోతుంటే చూశానుచూస్తే అదేమంత రంగుగానూ లేదు.

వళ్ళు మండి పోయిందిమళ్ళా నేను ఇంటికెళ్ళేసరికి ఏం ఎరగనట్టు బోర్లా పడుకుని ఉట్టుట్టి  గురకలు తీస్తున్నాడువీడి పని ఇట్టా ఉందా అనుకునిప్రెషర్ కుక్కర్ లో అన్నం వండికుక్కర్ మీద వెయిట్ పట్టకారతో పట్టుకుని వాడి మెడ మీద అదిమి పెట్టి ఓ రొండు నిముషాలు ఉంచాను.”

విశ్వనాథం ఉలికి పడ్డాడుపోలీసులకే థర్డ్ డిగ్రీచిట్కాలు చెప్పగల ఉగ్ర వనిత.

ఆ తర్వాత? " ఆదుర్దాగా అడిగాడు విశ్వనాథం.

ఏమవుతుందిఆ మేరకు తోలు ఊడొచ్చింది!”

దెబ్బ తిన్న పులి లాగాఉంది ఆవిడ వాలకం.

"వీడికెట్టా నచ్చి చచ్చిందోపొరుగింటి పుల్లకూరన్నట్టుఅందం లో నా కాలి గోటికి పనికి రాదు.” అవిడకావిడే కిరీటం తగిలించుకుంది.

ఆమె ఆత్మ విశ్వాసంపాజిటివ్ దృక్పథం చూసి విశ్వనాథం ముచ్చట పడ బోతూ ఉండగా ...

నేను పడ్డ బాధ వాడికీ తెలియాలి సార్తెలియాలంటే...."ఆమె ఉద్దేశం చెప్పింది.

ఆవిడ నిర్ణయానికి మద్దతు కోసం వచ్చిందివిశ్వనాథం తప్పు లేదని చెప్తేఆవిడ తప్పు చేయడానికి తయారు.

పావు గంట పాటు విశ్వనాథం ఆవిడ ఒకే విషయం చుట్టూ తిరుగుతున్నారు.

విశ్వనాథం పిజి డిగ్రీ సరిపోవడం లేదు ఆమెను కన్విన్స్ చేయడానికి.

ఆవిడ పట్టుదల చూస్తే ఆమె లక్ష్యసాధనకు తనని సహాయం చేయమంటుందేమో నన్న అనుమానమొచ్చింది

అలిసిపోయి 'లాభం లేదుకొత్తగా ఏదైనా ట్రైనింగ్ కోవర్క్ షాపుకోమాల్ కో వెళ్ళాలి అని నిశ్చయించుకుని,

ఆఖరి ప్రయత్నంగా

"చూడండమ్మా..”

మొహం చిట్లిచ్చింది.

అయినా సరే అమ్మా అన్న పిలుపు వొదలదలచుకోలేదు విశ్వనాథం.

"చూడమ్మామీకు విలువల మీద నమ్మకం ఉందా?” ఆవిడ ఎక్స్ప్రెషన్ చూసి, "అదేనమ్మా నైతిక విలువల మీద.”

"బాగా నమ్మకం అండీఅసలు వీడే అంటాడండీనువ్వు నిప్పులాంటి మనిషివే అనిఏడో క్లాసులోమురళీ గాడు లవ్ లెటర్ ఇచ్చాడనివాణ్ణి చెంప మీద చెప్పుతో కొట్టాను స్కూలు అసెంబ్లీ జరిగేటపుడుఇంటర్లో ఎవడో "నా కళ్ళు చెబుతున్నాయి "అంటూ వెంటబడితేవాణ్ణి మా ఇంటి దాకా రానిచ్చివాడి కళ్ళల్లో కారం కొట్టివాడి కాళ్ళు విరక్కొట్టి....”


"అవి కాదమ్మామీరు నా మాట సరిగా..”

ఆవిడ సునామీ ఫ్లో లో విశ్వనాథం మాటలు ఎటో కొట్టుకు పోయాయి.

"ఆయన చేసింది తప్పేననుకోండీమీరు కూడా ఎందుకు అలాటి తప్పే చేయడం.”
"అంటేఏంటి డాక్టరు గారూవాడు చెడిపోవచ్చు గాని....”
"చెడిపోయింది ఆయన కానీ మీరు కాదుగావిలువలంటే నగలోచీరలో కాదమ్మాపక్కన వాళ్ళకున్నవని మనం తెచ్చుకునేవి కాదుభర్త కున్నవని మనమూ ఆచరించడంఅతనికి లేవని మానేసేవి కావుమనకు మనమే ఏర్పరుచుకునే నియమాలు. “"ప్రతీకారంగా మీరు తీసుకునే నిర్ణయానికి చాలా చిక్కులొస్తాయమ్మానా మాట వినండి"**********ఒక ఆదివారం పొద్దున్నే పది మంది కుటుంబాలు అందరూ కూడబలుక్కునిసముద్రపు వొడ్డున రోజంతా సరదాగా గడిపిసాయంత్రానికి తిరిగిరావాలని ప్లాన్ చేశారుమొదట ఇందుమతి కే వొచ్చింది ఆ ఆలోచనమంచి కండిషన్ లో ఉన్న ఎయిర్ కండిషన్ వ్యాన్ మాట్టాడుకుని అందరూ బయలు దేరారుదారిపొడుగునాఒకటే నవ్వులుజోకులువ్యానంతా తుళ్ళి తుళ్ళి పడుతుంది.

సముద్రపు ఒడ్డుకు చేరిఅక్కడేదో తినిఓ అరగంట తర్వాత బీచిలోకి పరుగు తీశారుపిల్లలుముసలి వాళ్ళు ఇసకలో నే.

నడివయసు జంటలుటీనేజి పిల్లలుపడుచు భార్యా భర్తలు నీళ్ళలో పెద్దగా కేరింతలు కొడుతూ.

సముద్రాన్ని చూస్తే విశ్వనాథానికి ఎప్పుడూ వింతే.

చదువు పూర్తయ్యే లోపలమూడు సముద్రాలని చూశాడుఅన్ని చోట్లా సముద్రపు స్వభావం ఒకే రకంగా ఉండేది కాదుఒక చోటనెమ్మది గా అమ్మ లాగాఇంకో చోట చాలా వయొలెంట్ గామరో చోటచిన్న నాటి స్నేహితుళ్ళా పలకరిస్తూ,

ఆరోజు సముద్రం మధ్యతరగతి ఇంటాయన లాగాసంసార పక్షంగా ఉంది.

చిన్న పిల్లలు గుండ్రంగా తిరుగుతూ పాట పాడుతూ ఆడుతున్నారు.

"ఆమిన తకధిన

sing a song
ding a dong”

గులాబి పూల డిజైన్ ఉన్న తెల్ల షిఫాన్ చీర కట్టుకుంది ఇందుమతిఅందరి మతులు పోగొడుతూవిశ్వనాథానికి కొంచం గర్వంగా అనిపించింది భార్య అందానికి.

ఇసకలో నుంచుని దూరం గా చూస్తున్నాడు.

పక్కనే ఓ పాప కష్టపడి కాలి మీద గూడు కట్టుకుంటోంది.

"నేను కట్టనా? "అడిగాడు.

"నువెల్లవా నీల్లలోకిఅడిగింది పాప

"ఊహూ"

"బయమా?”

"ఊఁ "

"మా డాడీకసలేం బయం లేదుఎవరినో చూపెడుతూ.

ఇందుమతి పరిగెడుతూ ఇటే వస్తూంది.

"శేఖర్రా శేఖర్నీళ్ళలోకి ఎంత సరదాగా వుందో "

"వొద్దు ఇందూనాకు బట్టలు తడిస్తే నచ్చదు. “

"తొందరగా ఆరిపోతాయిలే సముద్రపు గాలికిరా.. ప్లీజ్అక్కడందరూ జంటలుగా ఉన్నారునేనొక్కదాన్నేరా.."అంటూ లాక్కెళ్ళింది.

లోతు తక్కువ నీళ్ళలోమగవాళ్ళు కొందరు చొక్కాలు తీసి మంగళగిరి గుట్టలాంటి పొట్టలతో కాళ్ళు బార చాపుకుని సేద తీరుతున్నారుభార్యలువాళ్ళ భుజాలు వేళ్ళాడుతూ..,భర్త నిండు కడుపు నిమురుతూ...

హద్దులు మీరిన దగ్గరితనం

వాళ్ళ కాలేజి చదువుల పిల్లలు ఏదో మాట్లాడటానికి దగ్గరకొచ్చినా

ఏ మాత్రం సంకోచం లేకుండాఅలాగే.....

అది చూడలేక మొహం పక్కకు తిప్పాడు.

కెమిస్ట్రీ లెక్చరర్ మహాలక్ష్మి గారుపేరుకు తగ్గట్టే నిండుగా పట్టుచీరలో పెద్ద బొట్టుతో కళకళలాడుతూ ఉండేది.

అశ్లీల సినిమా పోస్టర్లు పీకెయ్యాలని రోడ్లెక్కిరైళ్ళెక్కిఆ పై  టివికెక్కి పోరాటం చేసింది.

సన్నని చీరలో భర్త తో కలిసినీళ్ళలో పడి

ఇద్దరి ఊబకాయం శరీరాలుతడిసి పోయిన బట్టల్లో......

బ్రహ్మం గారి చరిత్ర  సినిమాలో, ఎన్ టి ఆర్ వదిన గారి ముక్కు పుడక తెచ్చే సీను గుర్తొచ్చివైరాగ్యం ఆవరించింది

ఒక్క అడుగు ముందేమరో జంటమనుషులు ఇద్దరా ఒకరా అన్న అనుమానమొచ్చేంతగా ...

విశ్వనాథం కి సిగ్గు తో వొళ్ళు చచ్చి పోయి..నించున్నాడు.

"ఇందు మతి గారూమీరే లీడ్ తీసుకోవాలిమీ ఆయన రాతి కాలం లో పుట్టాడు !”

ఇందు మతి దగ్గరగా వొచ్చింది.

అందరూ చూస్తుండగాతడిసిననునుపైనఅతి మెత్తటి, ...

కొండచిలువలాగా పెనవేసుకుంది.

విశ్వనాథం వళ్ళు జలదరించింది.

"నా వల్ల కాదు ఇందుఈ పబ్లిక్ రొమాన్స్"

*******

బాగా చీకటి పడింది బయలుదేరే సమయానికితిరిగి వచ్చే దారిలో ఇందుమతి ముభావంగా ఉందివిశ్వనాథం పలరించబోతే విసిరికొట్టింది.

ఇంటికొచ్చిన తర్వాత బతిమలాడబోయాడు.

బెడ్ రూమ్ లో వస్తువుల్ని చెల్లా చెదురు చేసిపింగాళీ ఫ్లవర్ వేజుల్ని నేల కేసి బద్దలు కొట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ మంచం మీద పడిపోయింది.

2 comments:

అజ్ఞాత చెప్పారు...

nice narration...:)

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

"....పోలీసులకే థర్డ్ డిగ్రీ. చిట్కాలు చెప్పగల ఉగ్ర వనిత..."

నిజం చెప్పండి కుక్కర్ వైయిటు ఐడియా మీకే వచ్చిందా, ఎక్కడన్నా చదివారా. ఆ ఉగ్రవనిత చేసినపని, ఆ చేసిన పని చెప్పిన విధానం ఆఫీసు నుంచి ఇంటికి డ్రైవ్ చేస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. నేను సామాన్యంగా నాకు చీదర పుట్టించిన వాళ్ళకు (ఊహలో) వేసే శిక్ష, వాళ్ళ చంకల్లో ఐస్ గడ్డలు పెట్టి కట్టేయటం. ఇది వినే మా వాళ్ళు (నన్ను ఉబ్బేయటానికి) నవ్వుతో విరగబడుతుంటారు. మీరు వ్రాసిన కథ మొత్తం, వ్రాసిన విధానం, చక్కగా సరిపోయిన పోలికలు (మంగళగిరి గుట్టల్లాంటి పొట్టలతో) అద్భుతమైన హాస్యం పండించారు. మూడో పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. నాతోబాటే ఎంతోమందికూడా.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి