25, జులై 2011, సోమవారం

పనిష్మెంట్-5continued from పనిష్మెంట్-4అత్తగారు , మామగారు వచ్చారు. మామగారు కోపంతో

"అల్లారు ముద్దుగా పెంచినందుకు ఇదా నువ్వు చేసే నిర్వాకం.”

అత్తగారు నెమ్మదిగా" తప్పు అమ్మా, నీ కాపురం చెడగొట్టుకుంటున్నావ్, వేరే వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నావ్. "

"నేను సంతోషం ఉన్నానమ్మా ఇప్పుడు, అదే మీ అందరికీ నచ్చడం లేదు.”

"దేవుడు లాంటి మనిషి కి ఎందుకే నరకం చూపెడతావ్.”

తల్లి దండ్రుల మాటలు వింటూ, తలొంచుకుని కూర్చున్న విశ్వనాథాన్ని చూస్తే ఇందుమతి కోపం ఆకాశాన్నంటింది.

"అంతా నీ వల్లే విశ్వనాథం, నువ్వు మంచోడిలా , నంగనాచిగా నాటకాలాడి మార్కులు కొట్టేస్తున్నావు. అందరి ముందూ నన్ను చెడ్డ దానిగా నుంచో బెడుతున్నావ్.”

"నీకసలు సరదాలు తెలుసా? పదిమందిలో కలవగలవా? నీకు ఇన్ ఫీరియారిటి కాంప్లెక్స్. నువ్వు సంతోషంగా ఉండవు, ఇంకోళ్ళని ఉండనివ్వవు. పెళ్ళి చేసుకునే అర్హత ఉందా? నీ అంత చచ్చు భర్తతో నేను కాపురం చెయ్యలేను.”

మామగారు ఇక వినలేక విసురుగా వచ్చి ఇందుమతి చెంప చెళ్ళు మనిపించాడు.

ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది


" తనకిష్టమైనట్టు వెళ్ళనియ్యండి. మీరు పట్టు బట్టొద్దు. ఒక వేళ ఇందు మనసు మారినా....."తర్వాత ఎలా చెప్పాలో,

విశ్వనాథం ఆగిపోయాడు.

ఆయనకే అర్ధం అయ్యి, "దాని బతుకిలా అవుతుందని అనుకోలేదు, ఎలా పెంచుకున్నాను, మూర్ఖపు తల్లి"

అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు.


**********


హాస్పటల్ కి వచ్చారు మావగారు.

ప్రాక్టిస్ మీద శ్రద్ధ తగ్గింది, ప్రాక్టీసు కూడా తగ్గింది.

మునుపటిలా పేషంట్లు లేరు.

" తలంతా ఏదో గజిబిజిగా ఉంది బాబు, గుండెల్లో ఏదో మంటగా ఉంది" అన్నాడు ఆయన


పక్కనే ఉన్న సుబ్బు హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు విశ్వనాథం. సుబ్బు పరీక్షలు చేసి బిపి ఎక్కువగా ఉంది, మందులు వాడితే పర్వాలేదని, అబ్జర్వేషన్ లో ఉంచుతాను అన్నాడు.

ఆయన రూమ్ లో పడుకున్నాడు.

"ఇందు వాళ్ళకు ఫోన్ చెయ్యనా?

"అమ్మాయి వాళ్ళు కంగారు పడతారేమో, మా బంధువుల పిల్లలు ఇక్కడే ఉన్నారు బాబు, కొంచం ఫోన్ చేసి పిలిపిస్తారా?”

ఓ అరగంట తర్వాత...

పాతిక ముప్ఫై వయసున్న కురాళ్ళు ఇద్దరు వచ్చారు, లోపలికొచ్చి

"ఏంటి మావా? వంటో బాగో లేదా? " అంటూ పరామర్శిస్తున్నారు.

"మళ్ళీ వస్తాను" అని విశ్వనాథం బయటికొస్తున్నాడు.

"ఇంకా ఎన్నాళ్ళుంటావురా ?"

" ఎల్లుండే దుబాయ్ ప్రయాణం మావా, .."


************రాత్రంతా నిద్ర పట్టక మెసులుతున్నాడు.

ఎక్కడికీ బయటకు వెళ్ళలేక పోతున్నాడు. ఎవరిని చూసినా తన గురించే మాట్టాడుకుంటున్నట్టు.

పేషంట్ల కళ్ళలో కళ్ళు పెట్టి కౌన్సిలింగ్ చేసే ఆత్మవిశ్వాసం ఎటో పోయింది.

సీటు కదలకుండా, ఫోనుల్లో పంచాయితీలు పెట్టే తోటి డాక్టర్లకు కాలక్షేపమయ్యాడు.

'నేను మొదటి రోజునే చెప్పాను.'

'పెళ్ళాన్ని అదుపు చెయ్యలేని వాడు.'

'కంట్రోల్ చెయ్యలేని చవట'

'ముందు నెత్తి నెక్కించుకున్నాడు. ఇప్పుడనుభవిస్తున్నాడు.'

భార్యలు పతివ్రతలుగా ఉండటం భర్తల గొప్ప తనమేనా?

ఎవరి మనసు మీద వాళ్ళకే సరైన కంట్రోల్ ఉండదే, పక్కనున్న వాళ్ళ మనసు కంట్రోల్ చెయ్య గల మంత్రాలేమైనా ఉంటాయా?

ఇందుకి బుద్ధొచ్చేలా ఏదైనా చెయ్యాలి,

'నా శవం ఇందు ముట్టుకోకూడదు అని చీటీ రాసి, ఆత్మహత్య చేసుకుంటే'

అంతరాత్మ ఆపకుండా నవ్వింది

'ఏమిటోయ్, నీ శవం ఏమైనా కంచిలో బంగారపు బల్లి అనుకున్నావా, అందరూ ఎగబడి తాకడానికి?'

ఏం చేస్తే ఆమెకు పనిష్మెంట్ అవుతుంది?

ఏదైనా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి.

మొగుడికి కుక్కరు వెయిటు వాత పెట్టిన మహిళ గొంతు, గాల్లో నుండి వినిపిస్తూంది.

" ఏం పిచ్చిడాక్టరూ, నాకు నీతులు చెప్పావు గా, ఇప్పుడు తెలుస్తుందా మంట, తన దాకా వస్తే...."


********

ఆరింటికి లేచి, లాన్ లో కూర్చున్నాడు విశ్వనాథం సుబ్బు కోసం ఎదురు చూస్తూ, వాకింగ్ కి తోడు వస్తాడని. పని అమ్మాయి పేపరు తో పాటు టీ కూడా తెచ్చి ఎదురుగా ఉన్న టేబిల్ మీద పెట్టి వెళ్ళింది.

ఒక చేత్తో టీ కప్పు అందుకుని, వేరే చేత్తో పేపరు తిరగేస్తున్నాడు.

వెనక స్పోర్ట్స్ పేజీ, ఎప్పటిలానే 'పోరాడి ఓడిన...'

విసుగ్గా మెయిన్ పేజీ చూశాడు.ఎర్రటి అక్షరాలలో " నగర మేయర్ దారుణ హత్య"

గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ...లోపలికెళ్ళి టివి పెట్టాడు.

"హత్య జరిగిన తీరు చూస్తే కిరాయి హంతకుల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. కారణాల కోసం..”గేటు చప్పుడయింది.పోలీసులు వస్తున్నారు.

వెనకే సుబ్బు వాకింగ్ షూస్ తో...క్షణం లో అలుముకున్న గందర గోళం.

ఇంతలో, వేగంగా మెట్లు దిగి ఇందు వచ్చి విశ్వనాథం చెంప మీద బలంగా కొట్టింది,

" ఇలాంటి పామువనుకోలేదు!”to be ended in the next post

7 comments:

కృష్ణప్రియ చెప్పారు...

*****మిటోయ్, నీ శవం ఏమైనా కంచిలో బంగారపు బల్లి అనుకున్నావా, అందరూ ఎగబడి తాకడానికి?
వెనక స్పోర్ట్స్ పేజీ, ఎప్పటిలానే 'పోరాడి ఓడిన...'

- చాలా బాగుంది. ఆఖరి భాగం రేపే వేసేయండి. :)

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ :(((

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హ్మ్...

Chandu S చెప్పారు...

@Sravya Vattikuti,
@వేణూ శ్రీకాంత్,
హ్మ్ :(((,హ్మ్...లు ఏంటండీ బాబూ, బాగోపోతే అస్సలు మొహమాట పడొద్దు, మీ సొంత బ్లాగే అనుకోండీ.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

కథలు కథలుగానే చదవాలి, ఆనందించాలి. గత కొన్ని సంవత్సరాలుగా కథల్లో పనికిరాని ఇజాలు, పైగా విదేశాలనుంచి అరువు తెచ్చుకున్నవి అక్కడ పనికిరాక వాళ్ళ ఏజెంట్లు ఇక్కడ రుద్దటానికి ఈ రచయితల్ని వాడుకుంటున్నవి, చచ్చు అంతరాత్మ మాటలు, చేతకాని రచయిత తన పెళ్ళానికి కూడ చెప్పుకోలేని తన వెర్రి వాగుడంతా కథల్లో పెట్టటం ఎక్కువైపోయి, కథలంటే చీదర పుట్టేసి ఏ వార పత్రికైన సరే బొమ్మలు చూసి వదిలేస్తున్నాను. మీరు వ్రాస్తున్న కథలు చాలా రిఫ్రెషింగా ఉన్నాయి. ఇలాగే కంటిన్యూ చెయ్యండి.

"అంతరాత్మ ఆపకుండా నవ్వింది" పాపం పాత్ర ఎంత బాధపడుతున్నా అంతరాత్మలు మటుకూ వాళ్ళను వేధించటం మానవు కదా! చివరికి మంచి వాళ్ళను కూడా, మార్క్ ట్వైన్ ఎక్కడో అన్నారు, " ఈ అంతరాత్మ ఉన్నదే, ఇదేమన్నా కుక్కపిల్లో మరింకేదో అయ్యి కనిపిస్తే బాగుండును.....గొంతు నులిమి చంపేద్దును" అని. హాస్యంగానే చక్కటి మాట అన్నాడు మార్క్ ట్వైన్

మేయరు హత్యకూ, "ఎల్లుండే దుబాయ్ ప్రయాణం మావా" డైలాగుకు ఏమన్నా సంబంధం ఉన్నదా అనిపిస్తున్నది. మీరు ఏమి చేయనుంటిరో కదా చూచెదము గాక. కథలో నేను అనుకోని మంచి ట్విస్ట్ తీసుకు వచ్చారు, తరువాయి పోస్టులో ముగింపు అన్నారు. కథకు ప్రాణం ముగింపు, ఆ ముగింపు ఎలా చేస్తారా అని చూడాలని ఉన్నది. ముగింపు పేలవంగా లేకుండా కొంచెం టైం తీసుకుని వ్రాయండి.

Sravya Vattikuti చెప్పారు...

హ హ "హ్మ్" అంటే ఏమి చెప్పలేక మీ కథ ఊ కొడుతున్నాము అని అండి.
పైన శివరామ ప్రసాద్ గారు చెప్పినట్లు మీరు రాసే కథలు చాల రెఫ్రెషింగ్ గా ఉన్నాయి , ఇటువంటి సబ్జెక్టు ఇంతకు ముందు కొంతమంది రాసినా వాటిల్లో అనవసరపు ఎరువు తెచ్చుకున్న ఆకర్షణలు ఉండటం వల్ల అనుకుంటా అంతగా నచ్చలేదు !
ఎలా ముగిస్తారా కథని ఆసక్తి గా ఎదురు చూస్తున్నాను :))

సాయి చెప్పారు...

bagundi waiting for nxt post...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి