10, జులై 2011, ఆదివారం

చందమామ-2

continued from చందమామ -1

మరణం సహజమని ఎంతమంది మనకి చెప్పినా, మనం ఎంత మందికి చెప్పినా, సొంత వాళ్ళ మరణం తట్టుకోలేం.
నాన్న లేని ప్రపంచం ఒకటి ఉంటుందా!
నాన్న లేని ప్రపంచం లో నేను ఉంటానా!
నాన్న తను శాశ్వతం అన్న భ్రమ కల్పించాడే 
నిజాయితీ నా జీవన మార్గం  చేసి ....
మరి మోసం చేయడం తెలియదే నాన్నకి
కర్మ కాండలు, చుట్టాల పలకరింపులు, నాన్న అస్థికలు అన్ని పుణ్య నదుల్లో కలపడం,..
అన్ని చోట్లకీ రంగడే తోడొచ్చాడు.
ఆఖర్న, విజయవాడ కృష్ణానదిలో కలిపి ఇంటికొచ్చాను.
చుట్టాలందరూ చాలావరకూ వెళ్ళిపోయారు
నాన్న గదిలో కూర్చున్నాను.
తెలియకుండా గుండెంతా నాన్న అనే ప్రశాంతత నిండి పోయింది. నాన్న మంచం మీద పడుకున్నాను
చివరి సారి నాన్న మాటలు గుర్తొచ్చాయి
హఠాత్తుగా ఉలిక్కి పడ్డాను
అవునూ , ఇంతకీ 
ఆమె ఏదీ?

ఏదీ ఆమె?
ఆ  పరిస్థితిలో ఎవర్ని అడగ్గలను?
వాళ్ళ ఊరికి వెళ్ళి పోయి ఉంటుంది.
మనసు సమాధాన పడలేదు.
ఇంకా ఏంటో తెలియాలి తన గురించి.
ఎవర్ని అడగను?
 బయట కొచ్చాను.
రంగడు ఎవర్తోనో మాట్లాడుతున్నాడు.
నన్ను చూడగానే వాళ్ళతో కబుర్లాపి దగ్గరకొచ్చి " ఏంటబ్బాయ్?" 
“.....ఏదీ?”
"ఏది అబ్బాయ్?”
“......నువ్వే చెప్పాలి ?”
“......”
"ఏంటబ్బాయ్? ఏం చెప్పను?”
 " ఆమె ఏదీ?”
రొండు నిముషాల తర్వాత, వాడికి తట్టింది.
" వాళ్ళ పుట్టింటోళ్ళు తీసుకెళ్ళారబ్బాయ్ ,బాబాయి ఏడూరు అయ్యేదాకా మీరిద్దరూ ....."
ఏమనుకోవద్దబ్బాయ్కారణం తనే అయినట్టు.
**************
కొన్ని నెలలు గడిచాయి.
మసక వెన్నెల్లో, చిన్న  చందమామతో పరిచయం.
ఎక్కడుందో, ఎప్పుడు చూస్తానో?
ప్రతి నిముషం మనసులో కదులుతూనే ఉన్న ఙాపకాలు.
పగలంతా పనితో గడిచిపోయినా, రాత్రి వేళ ఆమె ఙాపకాలు నన్ను కాల్చేసేవి
విపరీతంగా పని చేసేవాడిని. బాగా అలిసిపోతే ఎలాగైనా నిద్ర పోవచ్చు అని
ఎంత అలిసిపోయినా, నిద్ర పట్టదు.
ఎలాగైనా ఆమెని చూడాలి.
కలవాలి.
ఒక్క క్షణం పాటుఆమె లేకుండా బతకటం అసాధ్యం అనిపించింది.
గుండె కోసుకు పోతున్నంత బాధ
ఎవరి మీదో తెలియని విసుగు, నా మీద నాకే కోపం. రాత్రి లేచి వేగంగా అడుగులు వేస్తూ , పొలం వైపు బయలు దేరాను. చాలా తొందరగా పొలం చేరుకున్నాను
గట్టు మీద కూర్చున్నాను.
ఆమె కావాల్సిందే. ఇంక నా వల్ల కాదు. లేక పోతే ఎలాగైనా ఆమెని మర్చిపోవాలిపిచ్చెక్కేట్టుంది.
దేవుడా, ఏదైనా మార్గం చెప్పు
తలెత్తి పైకి చూశాను.
పౌర్ణమి నాటి వెన్నెల.
అక్కడా ఓ చందమామ.
భగవంతుడా....
మోకాళ్ళలో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడిచాను.
" నాన్నా, నువ్వైనా ఏదో ఒకటి చెయ్యి.”
మనసులోనే అడిగాను.
నా దుఃఖం తగ్గే సమయానికి
నాన్నే అన్నాడో ? నాకే తోచిందో
'వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ చిన్నవేబాధ్యతే పెద్దది.'
ఆ తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం సమస్య వచ్చినా ముందుండేవాణ్ణి. వాళ్ళ బాధలు మనసంతా పెట్టి విని, అవి తీర్చడానికి, శాయశక్తులా ప్రయత్నించేవాణ్ణి. మనసులో ఆమెతో ఎప్పుడూ మాట్టాడుతూనే  పనులు చేసే వాణ్ణి. మెల్లగా, ఎవరికేం కావాలన్నా, నా దగ్గరకు వచ్చేవాళ్ళు.
ఈ క్రమం లో తీరిక లేనంత పనుల వొత్తిడి లో చిక్కుకు పోయాను. ఎలాంటి పనిలో ఉన్నా, ఆమెని మర్చిపోయిన క్షణం లేదు
ఓ రోజున ఇంటికొచ్చే సరికి, అమ్మ ఎవరితోనో మాట్టాడుతోంది. ఆయన్ని ఎక్కడో చూసినట్టే ఉంది.

ఎక్కడా
 "బాబూ, ఇలారా.” పిలిచింది
నేను దగ్గరకు రాగానే, ఆయన లేచి నిలబడి
 "బాబు, కులాసానా?”
నేను తలూపి, నమస్కారం చేశాను.
 "మీ మామగారు "అమ్మ చెప్పింది.
వొంట్లో రక్తమంతా దిక్కు తెలియనట్టు పరుగులు తీసింది.
నా చందమామకి నాన్నా?
అప్రయత్నంగా ఆయన చేతులందుకుని కూర్చో బెట్టాను.
" నువ్వొస్తావని చాలా సేపటినుండి చూస్తున్నారు బాబు, బస్ కి టైమైయ్యిందని కంగారు పడుతున్నారు.
అలా బస్ స్టాండ్ దగ్గర దించిరా.”
 ఆమె ఎలావుందో ఎలా అడగను. మూగవాడికి దేవుడి ప్రత్యక్ష్యమైనట్టు.
నా బైక్ మీద ఎక్కించుకుని మా వూరి బస్ స్టాండ్ దగ్గర దించాను
అప్పుడు కూడా అడగలేక పోతున్నాను ఆమె గురించి వివరాలు.
ఏదైనా ఆమెకు పంపించాలి. అప్పటికప్పుడు ఏం ఇవ్వను.
బస్ వచ్చింది.
వెళ్ళొస్తా బాబూ. నా చేతులందుకుని సెలవు తీసుకుని ఆయన బస్ లో కూర్చున్నాడు.
పక్కనే ఉన్న కిళ్ళీ షాపులో, పత్రికలు, న్యూస్ పేపర్లు, వేళ్ళాడుతున్నయి.
 'చందమామ' పోయిన్నెలది, ఈ నెలది రెండు సంచికలు 
కిటికీలోంచి ఆయనకి అందించి 
" తనకి ఇవ్వండిమొహమాటం వదిలించుకోవాల్సిందే.
 "నన్ను తీసుకురమ్మంది గాని, మర్చే పోయాను. మీక్కూడా తెలుసా బాబు ,దానికి 'చందమామ' అంటే ఇష్టమని."
నాక్కూడా బాగా ఇష్టం చందమామ.
************
.......to be continued > చందమామ-3

4 comments:

కృష్ణప్రియ చెప్పారు...

hmm.. చందమామ -౩ కోసం ఎదురు చూస్తూ..

Sravya Vattikuti చెప్పారు...

అదేంటి మళ్ళీ అని పార్టులు పబ్లిష్ చేస్తున్నరా , కొత్తగా ????
హ హ కృష్ణప్రియ గారు నీను మొత్తం చదివేసాగా ;))))

కృష్ణప్రియ చెప్పారు...

@ శ్రావ్య,

అవునా? నేను ఇవ్వాళ్ళే ఈ బ్లాగ్ చూడటం. అన్ని పోస్టులూ ఒకేసారి చదివాను.
మీరు ఎలా చదివేశారు అన్నీ?

Chandu S చెప్పారు...

@Krishna priya,

Last week all the parts of chandhamaama were in the blog.

To make all the parts to appear in a row, I removed and publishing them again.

Thanks for the comments.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి