12, జులై 2011, మంగళవారం

చందమామ-5

continued from చందమామ-4
  నేనింకా బతికే ఉన్నానని మీరు అసహ్యించుకున్న దానికన్నావెయ్యి రెట్లు నన్ను నేను అసహ్యించుకున్నానునన్ను మించిన మోసగాడు ఎవరూ ఉండరేమో అనిపించేదిఆమె అంటే అంతిష్టంఇంతిష్టం అని నేను చెప్పిన మాటలు ఒట్టి పై పై మాటలే అంటూ నా లోపల ఇంకెవరో నన్ను చీదరించుకునే వారు.
గుండె ఏడుపు కాలం లాగా ఉందిఆగదుఅంతం లేదు.
ఆమె లేని రోజున నేను బతకి ఉండను అన్న నా నమ్మకాలు ఒట్టి ప్రగల్భాలేనా?
ఎక్కడకెళ్ళినాఏది చూసినా ఆమె ఙాపకాలేఆ ఙాపకాలకు దూరంగా పారిపోవాలిని ఎక్కడెక్కడో తిరిగానునేనే తన ఙాపకాలమయం అని తెలుసుకోలేని కస్తూరి మృగం లాగాఎలాగైనా మర్చిపోవాలనిఎన్నో ప్రయత్నించానుఆల్కహాల్మత్తు మందువేదాంతం, ...అన్నిటినీ జయించి నిలిచింది ఆమెను కోల్పోయిన దుఃఖం.
భౌతికం గా ఆమె లేదు.
భౌతికంగా నేను ఉన్నాచచ్చిపోయాను.
ఆ ఇంటికి రోజూ వెళ్ళి బయట రావిచెట్టు కింద కూర్చుండేవాణ్ణి.
లోపల నన్ను బతికించిన స్నేహం,
బయట నన్ను చిత్రవధ చేసిన ఆమె మరణం.
లోపలికి వెళ్ళే ధైర్యం ఎప్పుడూ చెయ్యలేదు.
ఆ మొదటి రోజుఆ పాదాల స్పర్శనేను నిండు మనిషినైన అమృత గడియలు... అవి తట్టుకోలేని దుర్బలుణ్ణి.
ఆ రావిచెట్టుకి నా తల కొట్టుకునే వాణ్ణి.
ఆ మట్టి లో పడి ఏడిచే వాణ్ణి.
గుప్పెళ్ళతో మట్టి తీసి కళ్ళలో కొట్టుకునేవాణ్ణినేను బతికేఉన్నందుకు నన్ను నేను తీవ్రంగా ఛీత్కరించుకునేవాణ్ణి.
నాన్నానాన్నా అని మనసులో ఎలుగెత్తి అరిచేవాణ్ణి.
ఎన్ని చేసినానాకు స్వాంతన లేదు.
ఈ దేహాన్ని చంపెయ్యాలని నేను ఎన్నో రకాలుగా ఆలోచించేవాణ్ణిఓ నెల రోజుల పాటు అదే ప్రయత్నంలో ఉన్నానుఓ రోజు అర్ధరాత్రిఎలాగైనా ఈ జీవితం అంతం చెయ్యాలిఇదింక కొనసాగించలేను
మా పెరటి బావిలో దూకేసి చచ్చిపోదామని బాగా ఆలోచించించి రాత్రి అందరూ నిద్ర పోయేవరకు ఓపికగా ఎదురు చూశానుఎంతో సంతృప్తిగా ఉంది నా నిర్ణయానికి
ఇంట్లో జనాన్ని తప్పించుకుని వెనకవైపు మెట్లు దిగి ఆమెను పెరట్లో కలుసుకునే వాడిని. ఇవ్వాళ కూడా అదే మెట్లు దిగి ఆమెను కలుసుకోబోతున్నాను. అవునునేను మోసగాణ్ణి కాదునాకన్నా ఆమెనే నా ప్రాణం అనుకున్నాను
ఈ రోజుతో ఈ బాధ అంతం కావాలి.
మెల్లగా అడుగులో అడుగేస్తూ చీకట్లో బయటికి వెళ్తున్నానుకాలికేదో తగిలింది.
మరు క్షణం లైటు వెలిగింది.
వెనకవైపు గుమ్మం ముందు చీర చెంగు పరుచుకుని పడుకున్న అమ్మ.
అది అమ్మ కాలు.
ఇంకొంచం దూరంలో నా బిడ్డలు చెరొక కుర్చీలో కూర్చుని నిద్ర పోతున్నారు.
ముగ్గురూ నాకు కాపలాగా
అమ్మ ముఖం లోకి చూడలేక కాళ్ళ వంక చూశాను.
చామనచాయలోఎండిపోయిపగుళ్ళిచ్చిన పాదాలుఇద్దరం నిశ్శబ్దం గా చాలా సేపు కూర్చున్నాం.
బతకలేక నేను పడుతున్న నరకయాతన అమ్మ అర్ధం చేసుకుంది.
నాన్నని పోగొట్టుకున్న అమ్మ
బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లి దండ్రులు
చిన్న వయసులో అమ్మని పోగొట్టుకున్న పసిపాప
పేదరికం
ఆకలి
ఎన్ని కష్టాలు ఈ లోకంలో
నేనేనా సమస్య తప్ప వేరే ఇంకేదీ పట్టని అతి స్వార్దపరుణ్ణి.
నా బాధ నాతోనే ఉండాలిఇంకెవరినీ బాధించకూడదు "
నాన్న చెప్పిందే ఆమె కూడా చెప్పింది
నీ సమస్య కన్నా బాధ్యత ముఖ్యం.
పనిలో పడినట్లుదుఃఖం మరుస్తున్నట్టు అందరినీ నమ్మించాను.
గుడిసెలు కాలిపోయిన పేదవాళ్ళకు ఇళ్ళు కట్టించానుఇంకేవో పనులు చేస్తూ ..బతుకుతున్నాను
బతకటం తప్ప ఇంకో మార్గం లేదు.
ఆమె తిరిగి రాదని తెలిసి
ఇంకొకరికోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాను.
మృత్యువు కోసం

***

10 comments:

Maddy చెప్పారు...

ఇది ట్రూ స్టొరీ (True Story) ఆ?

Chandu S చెప్పారు...


 కాదు, కథే!

మాలా కుమార్ చెప్పారు...

:((

విరిబోణి చెప్పారు...

Nijamgaa edi true story naa :(

Chandu S చెప్పారు...


 అలా ఉందా? కథే ఇది

శివకుమార్ చెప్పారు...

అలా బ్లాగుళ్లొ విహరిస్తూ చూశానండి మీ బ్లాగ్. మీ చందమామ అసాంతం చదివించి కళ్లల్లొ నీళ్లు తెప్పించింది.

మీరు అతడు కాదు ఆమె అని తెలిసి పెళ్లాం మానేజ్మెంట్ తొ పెద్ద ఝలక్ తిన్నాను.

మీరు గైనెకాలజిస్ట్ అని చూసి మీ కున్న కొద్ది పాటి టైం ని ఇలా ఉపయోగిస్తున్నారంటే (స్వతహాగ గైనెకాలజిస్ట్స్ మంచి ఓర్పు కలవారు కాబట్టె అది ఎంచుకొంటారు) చాల మెచ్చుకొ తగ్గది.

ఈ మద్య కాలంలొ ఇలా మనసును కొన్ని రొజుల పాటు వెంటాడే కథలు చదవ లేదు

మీ రచనలు చాలా బాగున్నాయండి.

శివకుమార్ దిన్నిపాటి

Chandu S చెప్పారు...

@శివకుమార్ గారు,
Thank you.

అజ్ఞాత చెప్పారు...

idi katha aitene baguntundi

anu చెప్పారు...

ఆమె మరణం అతనితోపాటు నేనూ తట్టుకోలేకపోయాను.. ఒక్కసారి గుండె పిండినట్టుగా అనిపించింది. ఇది నిజ జీవిత కథ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

తెరవని పుస్తకం చెప్పారు...

హాయి గా చదువుకుంటూ ఉంటే ఇలా కన్నీళ్ళు తెప్పించటం ఏమీ బాలేదండీ ! తట్టుకోలేకపోతున్నాను..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి