20, జనవరి 2012, శుక్రవారం

సిన్మా రివ్యూ వ్రాస్తున్నా
ఈ మధ్యన అందరూ సినిమా చూసి రివ్యూలు వ్రాస్తున్నారు. నేనూ రాద్దామనుకునే సరికి అందరూ రాసి పడేస్తున్నారు. ఇహిలా కాదు, నేనే సినిమా తీస్తే దానికి రివ్యూ అందరికన్నా ముందు రాయొచ్చుగా అనే ఆలోచనతో, మాకు బంధువైన ఓ సినిమాజీవి తో నా ఆలోచన చెప్పాను. అతని మీద బాధ్యతంతా పెట్టి నేను కూడా సినిమా డిస్కషన్స్, సిట్టింగ్స్ లో కూర్చున్నాను. డైరెక్టర్, హీరో, కెమెరా ఆయన, హీరో గారి బామ్మర్ది, ఫాన్స్, ఇంకా అప్పుడప్పుడూ నేనూ పాల్గొన్న ఈ చర్చలలో ఎవరు ఏమంటున్నారు అని నన్ను అడక్కుండా చదవండి. అసలే మతి బోయి ఉన్నాను....

********డ్రీమ్ సాంగ్ లన్నీ ఇంతకు మునుపు ఏ హీరో టచ్ చెయ్యని లొకేషన్ లో తీస్తన్నాం. నిన్న రోజంతా కూసోని గూగుల్ ఎర్త్ మొత్తం కుళ్ళగించా. అద్భుతమైన లొకేషన్లు దొరికినాయి. ఆఫ్రికాలో కాంగో రివర్ పక్కన ఒక రెయిన్ ఫారెస్ట్ దొరికింది. ఎవర్తోనూ అనబాకండి. ఎదవలు రేపే ప్రయాణం కడతారు. రెయిన్ సాంగ్ లో హీరో హీరోయిన్లు దుమ్ము రేపాల.

వాన పాటలో, దుమ్ము? ఏడిసినట్టుంది. ఈ రెయిన్ సాంగ్ అన్నగారి నాటి కాలం నుండీ వస్తోందా, ఆయన గారి పాటని కొట్టేసే పాట ఇంతవరకూ ఎవడూ తియ్యలేక చతికిల బడతన్నారు.

మనపాట డెఫినిట్ గా అన్న గారి పాటను టచ్ చేసి తీరతదండీ.

ఏవిటో నీ బోడి కాన్ఫిడెన్స్?

ఏవిటంటే, హీరో హీరోయిన్ లు ఆఫ్రికా అడివిలో ఉంటారు, కాబట్టి బట్టలేసుకునే స్కోపు లేదు. కొండచిలవలే గతి. అదికూడా ఒక్క కొండ చిలవతోనే సరిపెట్టుకోవాలి. ఇహ జూస్కో ఆడియెన్స్, రిపీట్ ఆడియెన్స్..

మరి సెన్సారోళ్ళు.

భయం లేదు, బడ్జెట్ లో కొంత పర్సెంటేజీ వాళ్ళక్కూడా అని వేరే బెట్టాలే.

డైలాగులు?

ముందే చెప్తన్నా...బూతులు మస్ట్


పోనీ పూరీ నడిగితే?

వాడొట్టి సెల్ఫిష్, వాడి సిన్మాలకు తప్ప వేరే వాళ్ళకు రాయడు.

మరెలాగా, బూతులు లేపోతే పని జరగదే, పెద్ద చిక్కొచ్చి పడిందే?

పరుచూరి బ్రదర్స్ ని అడిగితే?

ఆళ్ళయి ఓల్డ్ ఫాషన్. అందులోనూ పెద్ద ఫామ్ లో కూడా లేరు!

సిన్మాలో మన సినిమాలో హీరోయిన్ గాంగ్ స్టర్ చెల్లెలు కాబట్టి, చిన్నతనం నుండీ ఇబ్బడి ముబ్బడి గా బూతులు మాట్లాడాలి. ఇప్పుడు పూరీకి పోటీ గా ఎవడు రాస్తాడబ్బా?

ఓ పని చేద్దాం సెన్సారోళ్ళకన్నా ముందు మనవే, బీప్ లు పెడదాం. హీరో కొద్దిగా పోష్ కాబట్టి, రొండో మూడో బీప్ లు . హీరోయిన్ నాటు కాబట్టి డైలాగు మొత్తం మ్యూట్ కొడదాం. ఇక నా సామి రంగా. ప్రేక్షకులు గుమ్మెత్తిపోవాల, ఆ బీప్ లకు హీరోయిన్ ఏం మాట్టాడి ఉంటదో తెల్సుకోడానికి లిప్ రీడింగ్ కోసవని రెండు మూడు సార్లు సూస్తారు.

అన్నిచోట్లా బీప్ లు పెడితే అనుమానమొస్తదేమో, కొన్ని బూతులు తప్పని సరి.

ఆ ఫేస్ బుక్కో ఎక్కడో ఎతకండయ్యా, బొచ్చెడుంటాయి, ప్రతిదీ చెప్పాలా?

మరి కామెడీ?


మన సినిమాలో కమెడియన్ లే కాదు. హీరో, హీరోయిన్, విలన్, హీరో పేరెంట్స్, హీరోయిన్ పేరెంట్స్, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్, విలన్, చుట్టూ రవుడీలు, ఇట్టా అందరూ కామెడీ సేస్తారు.

ఈళ్ళందరూ కాక, సెపరేట్ కామెడీ ట్రాక్ పెడతన్నాం. సినిమాకు సంబంధం లేకండా.

ఏంటయ్యా,పాత అవిడియాలు. సంబంధం లేకండా కామెడీ నడవటం కామనే గందా.

అయితే ఓ పన్జేద్దాం. సినిమాతో సంబంధం ఉండేట్టు కామెడీ పెడదాం, వెరైటీ గా ఉంటది.

లెంగ్త్ ఎక్కువవుద్దేమో?

ఎడిటింగ్ సన్నాసి క్కూడా పనుండాలిగదా, ఆడు జూసుకుంటాళ్ళే!

కామెడీ కీ పంచ డైలాగులెవర్రాస్తారు.

పంచ , లుంగీ డైలాగులు, అన్నీ చుట్టబెట్టే ఓ కొత్త కుర్రాణ్ణి చూశాను, అండర్ గ్రౌండ్ లో దాసి వచ్చా, ఎవుడికన్నా తెలిస్తే ఎత్తుకుపోయి ఆళ్ళ సిన్మాకు రాయించుకుంటారనీ.

ఇంతకూ డైలాగులు?

హీరో గారికోసం స్పెషల్ డైలాగులు బాగా టన్ను పొగరుతో, అరటన్ను మదంతో కూరాము.

ఎట్టాగంటే..

ఓ సారి, ఓ రవుడీ వాడు హీరోగార్ని చూసి "ఎవడివిరా నువ్వు?” అంటాడు.

అప్పుడు హీరో, "నాకు పురుడు పోసిన మంత్ర సాని దగ్గర్నుండీ, కాళ్ళు కడిగిన బామ్మర్ది వరకూ ఈ స్టేట్ లో ఎవర్నడిగినా నా రికార్డులు చెప్తారు. అవి తెలియని వాడు బతికుండటం వేస్ట్ తంబీ" అని వాడి భుజం మీద చెయ్యేస్తాడు. రవుడీ మెలికలు తిరుగుతూ, రక్తం కక్కుకుని చస్తాడు.

ఈలతో ఈస్ట్ గోదావరి

వేలితో వెస్ట్ గోదావరిని దున్నేశాను రా

గొంతెత్తితే గుంటూరు జిల్లా,

కాలెత్తితే కృష్ణా జిల్లా వణికి పోవాలిరా

మా తాత వాయిస్ కి వోల్ ఆంధ్రానే కదిలి వచ్చిందిరా

ఇండియానంతా ఇరగదీసిన జాతిరా మాది.

ఇట్టా ఇంకా శానా ఉన్నాయిలే అన్నా.

ఇంకోమాట, కుమ్ముడు, అనే మాట కనీసం పాతిక సార్లు వాడాలి.

హీరోయిన్లు

ఆ మాటకే వస్తన్నా,

అయిదుగురు హీరోయిన్లు. బాల్య స్నేహితురాలు ఈడు పెళ్ళి చేసుకోటానికి వొస్తాడని పల్లెటూళ్ళో జనాలముందు వోణీలు ఇసిరేసుకుంటా, తిరుగుతా ఉంటది. రెండో పిల్ల కాలేజీలో గర్ల ఫ్రెండ్, ఎక్స్ పోజింగ్ తోనూ, పోష్ బూతులతోనూ జనాల్ని పిచ్చెక్కిస్తా ఉంటది. మూడో పిల్ల ఈడి సెక్రటెరీ, ఎప్పుడు జూడూ, మిని స్కర్ట్లు, బికినీలు ఏసుకుని డ్రీమ్ సాంగుల్లో బతుకుతా ఉంటది. అయిదో పిల్ల ఆళ్ళ అమ్మ దగ్గర నర్సు. మెడికల్ ప్రొఫెషన్ కాబట్టి, సిగ్గు లేకండా ఆ పిల్లతో ఏది కావాలంటే అది మాట్టాడించొచ్చు.

నాలుగో పిల్లను మర్చిపోయావా?

లేదు, కొంచం ముక్యమని, చివర్లో చెప్దావనీ, ఆ పిల్లే కీలకం సినిమాకు. విలన్ డెన్ లో ఉంటది. హీరోకి సైలెంట్ లవర్.

ఈ అయిదుగుర్నీ హీరో ఏమే, ఒసే అంటూ సరసాలు ఆడతంటాడు.

మరి ఆడోళ్ళకు నచ్చుతుందా? అసలే ఈ మధ్యన ఫెమినిస్టులతో, పెద్ద తలకాయనెప్పి లేస్తందబ్బా.

ఆళ్ళను సల్లబరిచే ఓ గొప్ప డైలాగు రాయించా. హీరో ఓ చోట డైలాగు చెప్తాడు "అసలు ఆడదంటే ఎవరు, ఆడదంటే అమ్మ, ఆడదంటే గర్ల ఫ్రెండు, ఆడదంటే మన పక్కింటి ఆడదిరా,ఈ బూమి కూడా ఆడదేరా, మనం ఎప్పుడు నేర్చుకుంటాం రా, దాన్ని గౌరవించడం?” అంటూ ఏడుస్తూ దుమ్ములో పడి దొర్లుతాడు.

సరి ఈ డైలాగుతో ఆడోళ్ళంతా ఖుషీ.

మన సినిమాలో ఆరు పాటలూ ఐటెం సాంగ్సే

అట్లా ఎట్టా నయ్యో?

పెతి హీరోయిన్ తో ఐటెమ్ సాంగేస్తన్నాం. అదెటూ కంపల్సరీ అనుకో!

హీరోయిన్లు అయిదుగురు. మరి ఆరోపాట?

ఎవరితోనూ అనొద్దు, హీరో తల్లి కొడుకుకోసం పాడే పాట కూడా ఐటెమ్ సాంగే?

అదెట్టానయ్యా?

హీరో చిన్నప్పుడే తప్పి పోతాడు, ఆడికోసం పిచ్చెక్కి తల్లి రోడ్లెంట, 'బాబొస్తాడొస్తాడా' అంటూ ఎతుక్కుంటా పబ్ లోకెళ్తది. అక్కడ అదే పల్లవితో, హీరోయిన్ రెయిన్ డాన్సేస్తా పాడతా ఉంటది. సరి పోయె

మ్యూజిక్ ఎవరితో చేయిద్దాము. ఈ మధ్య ఎవరో స్వర పాణీనో, దుబ్బన్ నో బాగా చేశాడంటయ్యా, అందరూ ఒకటే గగ్గోలు పెడుతున్నారు.

వాడెందుకయ్యా, మ్యూజిక్ తో బాగా టచ్ ఉన్నకుర్రాడున్నాడయ్యా .

బాగా కొడతాడా? ఆడియో ఫంక్షన్ లో స్టేజి విరగ్గొట్టాల!

డ్రమ్స్ అవ్వీ తెచ్చుకోమని చెప్తాలే!

స్టేజి విరగ్గొట్టేది డ్రమ్స్ తో కాదయ్యా. వెయిట్ తో అదరగొట్టాలి, ఇంతకీ కుర్రోడి బరువెంతా, నూరు కేజీ లకు తక్కువలేపోతే నాకు గిట్టదు, ముందే చెప్తన్నా.

వంద కేజీలు ఉండడనుకుంటా, లేపోతే ఏం, ఇప్పట్నుండే బాగా మేపుదాం. కోళ్ళూ, మేకలూ తినవో వేణూ.

మరి పాటలో..


దాందేవుందీ.

హీరోగారు పిచ్చాపాటీ మాట్టాడేప్పుడు నువ్వో చెవి అటేసి వినబ్బా, హీరో గారు పెళ్ళాం బిడ్డల్తో ఫోన్ లో మాట్టాడతన్నా అయ్యన్నీ రాసుకో. అదంతా ముక్కలకింద ఇడగొట్టి పాట రాసేద్దాం.

హీరో గారికి హెడ్ ఫోనెట్టేసి ప్రోమోలు తీద్దాం. హీరోగారు, ఆయన పెళ్ళాం గారూ పాట రాశారని, పాట పాడారనీ పబ్లిసిటీ ఇస్తే...జనాలు వెర్రెత్తిపోవాల!


ఫైట్స్ మాత్రం వెరైటీగా నేనే కంపోజ్ చేస్తా.

కంపు జేస్తావా? ఎవడో రవుడీ కిస్తే సరిపోయే దానికి.

ఒక సీక్వెన్స్ వినండి. హీరో సిగరెట్ తాగుతూ కుర్చీలో కూర్చొని ఉంటాడు. ఇంతలో ఇద్దరు రవుడీలు వచ్చి నిప్పడుగుతారు. అందులో ఒకడు సిగరెట్ నిప్పంటించుకుంటుంటే, రెండో వాడుకొట్ట బోతాడు. హీరో సిగరెట్ పొగ వదుల్తాడు. ఆ పవర్ కే వాళ్ళిద్దరూ గాలిలో కొంత సేపుండిపోతారు.

ఎంత సేపు?

ఆ టైములో గాలిలో ఉన్న రౌడీల్లో ఒకడు, రెండో వాడినుండి సిగరెట్ అంటించుకుంటాడు. కింద హీరోగారు మొత్తం సిగరెట్ తాగేస్తాడు. సిగరెట్ ఒక చేత్తో తాగుతూనే ఓ గుంపెడు మందిని మట్టి కరిపిస్తాడు. ఇక పడతారు కింద.

ఎవరూ సిన్మా చూసే వాళ్ళా?

కాదయ్యా, ఇందాక పైకెగిరిన రవుడీలు.

వాళ్ళతో, హీరో ఓ డైలాగు చెప్పాలి. బాగా పొగరుఫుల్ డైలాగు రాయించు.

అదే సూస్తన్నా,

అన్నా అన్నా అంటూ ఫాన్స్ వచ్చారు.

నిన్న ఫస్ట్ డే రిపోర్ట్ వచ్చిందన్నా, టికెట్ల కోసం కొట్టుకు చచ్చినోళ్ళ రికార్డు మనదే అన్నా ఈ సారి కూడా. ఇంత వరకూ వేరే హీరో ఎవరూ అది టచ్ చెయ్యలేక పోయారు.

బాగుందయ్యా, మన రికార్డు మనమే కొట్టుకోవాలి ప్రతిసారీ, ఫాన్స్ అందరికీ చెప్పండి. మరి... ఆరోజుల్లో...., నాన్నగారు...

అలాగే అన్నా, వెళ్ళొస్తాం అన్నా,

అన్నా....సి ఎం, అన్నా... సి ఎం.. .


వాళ్ళు చెప్పిన డైలాగు రాయండయ్యా.. రవుడీలతో నేను అన్నట్టు..

" ఈ కింద పడ్డవాళ్ళు నా ఫస్ట్ డే టికెట్ల కోసం తన్నులాటలో చచ్చినంత మందిలేరు. నా ఇమేజ్ తగ్గట్టు చావండ్రా.”

అన్నా, ఈ మధ్యన కొత్త కుర్రాళ్ళు కాళ్ళూ, కీళ్ళూ ఇరగదీసుకుంటా డేన్సేస్తన్నారు.

ఫాన్స్ హర్ట్ అవుతున్నారయ్యా, ఆ కెనెడానో, జపానో తగలడి గ్రాఫిక్స్ తో మేనేజ్ చెయ్యండి కీళ్ళ డేన్సులూ, మోకాళ్ళ డేన్సులూ!

అలాగే బాబూ.

ఎక్స్ ప్రెషన్లతో మేనేజ్ చెయ్యండి బాబూ, డేన్స్ రాకపోయినా పర్లేదు.

అవి కూడా గ్రాఫిక్స్ తో పని జరుగుతుందేమో చూడండి.

ఎందుకు బాబూ పాటల పోటీల ప్రోగ్రాం జూస్తే, పిల్లకాయలు భలేగా పెడతారు ఎక్స్ ప్రెషన్లు. ఏడుపు పాటలకు ఏడుత్తారు, మొన్నో మూడేళ్ళ పిల్ల మొగుడూ పెళ్ళాల రొమాన్స్ పాట ఇరగదీసింది బాబూ, అబ్బో పిల్లకాయ టేలెంట్ చెప్పలేం. నాలుగు ఎపిసోడ్లు చూడండి తవరు.

సరే, సినిమా రిలీజు కు ముందే రెండో మూడో డైలాగులు లీక్ చెయ్యడం, ఎదుటి హీరో ఫాన్స్ తో రికార్డుల గోల చేయించడం ఆ ఫార్మాలిటీస్ జాగ్రత్తగా జూసుకోండి. ఇంకో మాట, మీరు రిలీజ్ రోజు సెంటిమెంట్ గా మీ ఊరు పునాది పాడు హాల్లోనే చూడండి.

*****

81 comments:

కృష్ణప్రియ చెప్పారు...

:)))

ఆరో ఐటం సాంగు ఐడియా బాగుంది.
హీరో పాట రాయటం,
ఐదు హీరోయిన్లు .. నైస్ నైస్.

జ్యోతిర్మయి చెప్పారు...

మీరిలా౦టయిడియాలిచ్చేత్తే రేప్పొద్దున ఇలాంటి సినిమా ఒచ్చేయగల్దు.
:))))
అన్నట్టు డయిలాగ్ రైటర్ ని మూజిక్ డైరక్టర్ ని దాచిపెట్టి మంచి పని చేశారు.

రసజ్ఞ చెప్పారు...

సినిమా అయిదొందల రోజులు ఆడుతుందనమాట! మరి మన పంచు, లుంగీ డైలాగ్ రైటరంటే మాటలా? ఇహ సంగీతం చెప్పనే అక్కర్లేదు! మొత్తానికి మీ సినెమా సూపరని టాక్ వచ్చేసింది.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

"పొగరుఫుల్ డైలాగు" Excellent coining of word to suit the present day cinema dialogues.

Super parody on the cinemas.

రాజ్ కుమార్ చెప్పారు...

konta kalam kritAm sri yesukreestu chadivaanandi. aa post ni tala dannettu undi. racha racha ante. sooooparoo soooparu.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పటికే సినిమా అంటే దడుస్కుంటున్నాం. వెయ్యిరోజులాడాలి మీసినిమా!!! THOUSAND DAYS GUARANTEE

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హహహహహ భలే రాశారు శైలజ గారు :-))) కొన్ని ఐడియాలు కేక అండ్ ’పొగరుఫుల్ డైలాగ్’ అన్న పదం ఐతే సూపర్ అసలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

పొగరుఫుల్ డైలాగులు ఆదిరాయి. చాలా బాగుందండీ మీ సినిమా కధ. సూపర్ డూపర్ హిట్ అంతే తిరుగులేదు. ఆ డైలాగు రైటర్ ని ముజిక్ మాష్టారు ని వదలకండి. ... దహా

అజ్ఞాత చెప్పారు...

హ..హ..భలేవుంది సెటైర్ .
అయిటెం సాంగ్ అయిడియా సూపర్ . డైలాగ్ రైటర్ ని మంచివాడినే పట్టారు . అర్జెంటుగా రాజ్బాబూకీ, వేణూ కీ ప్రొటెక్షన్ కల్పించండి .

Bhaskar చెప్పారు...

మాంచి సినిమా కథ చెప్పారు. ఇంక ఇప్పటి నుండి తెలుగు నిర్మాతలు అంతా మీ చుట్టూ తిరుగుతారు.

Shiva Bandaru చెప్పారు...

:)

Chandu S చెప్పారు...

నైస్ అని తప్పించుకుంటారేమో. సినిమా వెండి తెరపై చూడాలి

Chandu S చెప్పారు...

@జ్యోతిర్మయి
అందుకే, ఎవరైనా తీస్తారేమోనని మేమే తీసేస్తున్నాము.
Thanks for reading

Chandu S చెప్పారు...

@ రసఙ్ఞ గారు, చాల సంతోషం , మీ నోటి చలవ వల్ల అన్నిరోజుల ఆడితే ఇంకేం కావాలి, నూరు రోజుల పండక్కి మీరు కూడా రావాలి మరి.

Chandu S చెప్పారు...

Thank you sir for reading

Chandu S చెప్పారు...

కష్టే ఫలే గారు,

"THOUSAND DAYS GUARANTEE"

మీరు ఇలా అనడమే నవ్విస్తోంది.
ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@ వేణూ శ్రీకాంత్.

మీ మీద' బరువైన' బాధ్యత ఉంది. జాగ్రత్త
ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

బులుసు సుబ్రహ్మణ్యం గారు,
మీరు మెచ్చుకుంటే ఒక సర్టిఫికేట్ దొరికినట్లే.
ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@ లలిత గారు,
తప్పకుండా, మీరు చెప్పడం నేను కాదనడమా? ఆ ప్లస్ లో పెట్టిన తినుబండారాలు ఇటు పంపిస్తే కొంచం పిల్లలిద్దరూ తింటారు.

ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@భాస్కర్ గారూ,

ఏదో మీరు మొహమాటం కొద్దీ అంటున్నారు గానీ , కథ చెప్పానా?

ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@ రాజ్ కుమార్,

'soooparu, racha"

ఇవ్వన్నీ తర్వాత, డైలాగులెంతవరకు వచ్చాయి?

Thanks for reading.

Chandu S చెప్పారు...

Shiva Bandaru గారూ,

ధన్యవాదాలు

Sravya Vattikuti చెప్పారు...

హ హ సూపర్ ఉందండి :-)
డైలాగ్ రైటర్ ని , మ్యూజిక్ డైరెక్టర్ ని ఒక కంట కనిపెడుతుందండి :P

Zilebi చెప్పారు...

చందు ఎస్ గారు,

మొత్తం మీద మాంచి 'ప్రేవ్యు' చూపించారండీ !

వెంటనే ధనాధన్ మహర్షి ని పట్టి మరో సినిమా తీసేయ్యాల్సిందే!

నెనర్లు.

రెండు, మీరు ఇచ్చిన ఆ లింకులో వేణూ శ్రీకాంత్ వారి దేవస్థానం పాటలు రివ్యు చూసి అక్కణ్ణించి ఆ దర్శకుడు ఎవరా అని చూసి ఓస్ ఈ బుడతడు 'మనూరి'(మా చిత్తూరి) వాడే సుమా అని చూసి, వార్నీ వీడేనా, చాలా గోప్పోడయ్యాడే సుమా అని ముక్కున వేలేసుకుని జిలేబీ హాశ్చర్య పోవటం వరకు వచ్చింది.

సో, మీ రివ్యు ఇంతటి ప్రేవ్యు ని చూపించడం గొప్పే కదా ! అందుకే,

డబల్ చీర్స్ తో
జిలేబి.

అజ్ఞాత చెప్పారు...

పంచ్ డైలాగులు అదిరాయి. ముఖ్యంగా పొగరుఫుల్.
ఏదో ఒక దర్శకుడి నుండి మీకూ పిలుపు రావచ్చు.

KumarN చెప్పారు...

మీ బ్లాగు చదవటం ఇదే మొదటిసారి నేను.
వామ్మో కుమ్మేసారుగా మెత్తటి చెప్పుతో:-)

"హీరో గారికోసం స్పెషల్ డైలాగులు బాగా టన్ను పొగరుతో, అరటన్ను మదంతో కూరాము"

Thanks for summing the entire telugu cinema 'దరిద్రం' in one sentence.

అసలిలాంటి డైలాగులు హీరోలని జోకర్లుగా మారుస్తున్నాయి. బాలయ్య బాబు చివరికి ఓ పేద్ద లాఫింగ్ స్టాక్ అవటమే ఒక ఉదాహరణ.

Keep writing. Will read'em more.

Chandu S చెప్పారు...

శ్రావ్య, అన్నీ నేనెక్కడ చూసుకుంటాను. ఆ పని మీకే అప్పగించేద్దాం అనుకుంటుంటే

Chandu S చెప్పారు...

బోనగిరి గారు,

ఎందుకండీ భయపెడతారు?

Thanks for reading

Chandu S చెప్పారు...

కుమార్ గారు,
welcome to my blog. Thanks for reading

ప్లస్ లో మీ కామెంట్స్ చాలా బాగుంటాయి

Chandu S చెప్పారు...

అయ్యోరామ, జిలేబి గారు,
మాకెందుకండీ మీ చిత్తూరి బుడతడు,
మా మ్యూజిక్ డైరెక్టర్ పల్నాటి పిల్లోడు, సరిగమల వేణూ.
ధన్యవాదాలు

రాజ్ కుమార్ చెప్పారు...

మళ్ళీ చదువానండీ... జర్నీ లో ఉండటం వల్లా మనస్పూర్తిగా పెట్టలేకపోయాను కమెంటు.
అసల్ మీకు డైలాగ్ రైటర్ అవసరమా? కుమ్మేశారు అసలు.
ఈ పోస్ట్ సూపరు,డూపర్, బంపర్, కత్తి, గునపం, రచ్చ, సెగలు, మంటలు..

ఆ లింక్ లో నా బ్లాగ్ చూసుకొన్నప్పటి నుండీ బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నా. కమెంట్ బాక్స్ లో కిందనుండే నన్ను, మీ పోస్ట్ లోకి తీసుకొచ్చారా? పాక్కుంటూ పాదాల దగ్గరకొచ్చిన పసిపిల్లోణ్ణి,పైకెత్తి ఆడించినట్టు..
థాంక్యూ సో మచ్ అండీ..!

మధురవాణి చెప్పారు...

సినిమా సూపర్ హిట్.. కేక.. అరుపులు.. హండ్రెడ్ డేస్ పక్కా.. మ్యూజిక్ కేక.. పంచ డైలాగ్స్ రచ్చ.. సూపర్ హిట్ అంతే.. :D :D

మనసు పలికే చెప్పారు...

200 డేస్.. 300 సెంటర్స్.. సూపర్ సినిమా....మీ సినిమాకి రివ్యూ రాయాలని ఉంది;)

ఆ.సౌమ్య చెప్పారు...

యాండీ యాండీ యండీ మీ సినిమాకి నేనే రివ్యు రాత్తానండీ....మనకి మనకి డీలింగ్స్...బయట ఎవ్వరితోనూ అనకండి. మనకి "నీడిల్‌ట్రైన్‌" అని ఒక వెబ్సైట్ ఉంది. అందులో మీకు 5 కి 4.5 రేటింగ్ ఇస్తాను. నీడిల్‌ట్రైన్‌టీవీ అంటే ఎంత ఫేమస్సో సినిమావోళ్ళకందరికీ తెలుసు...కాబట్టి మీకు రాస్తా...మనం మనం తెర వెనుక సూసుకుందాం....ఏటంటారు?

పొగర్ఫుల్ అదిరింది!

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

<>
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ డైలాగ్ రాజ్ :-))

SHANKAR.S చెప్పారు...

బాబు సిన్వా సూపరిట్. అద్దిరిపోయిందంతే. యాక్షన్ ఇరగదీశ్శేడు.త్రీ హండ్రెడ్డేస్ హౌసుఫుల్లు పక్కా కన్ఫరం.రికార్డ్లు బ్రేకు. కొత్త రైటరు డైలాగులు కుమ్మేశాడు. మూజిక్కు ఇరగ,రచ్చ. "బాబొత్తాడా" సాంగు ఈ పిక్చర్కి హైలెటంతే.డైరట్రు నెక్స్ట్ పిక్చర్ కూడా బాబుతోనే ప్లానింగ్ చేయాలని ఫ్యాన్స్ గా డిమాండింగ్ చేత్తన్నాం.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

365, శంకరాభరణం రికార్డ్ తిరగ రాస్తుంది; ఈ రేంజ్లో సినిమా తీస్తే!

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

వామ్మో కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వున్నరకెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ పోస్ట్ అండీ అద్దరగొట్టేహారంతే

చాణక్య చెప్పారు...

కత్తి.. కేక.. మెరుపులు.. అరుపులు...

సినిమా సూపర్‌హిట్. మీ డైలాగ్‌రైటర్‌ని మించిపోయి పంచులేశారే. నేను డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలోకి దిగిపోతా. ఆంధ్రా రైట్స్ మొత్తం నావే చెప్తున్నా.

sivaprasad చెప్పారు...

sooper

రాజేష్ మారం... చెప్పారు...

MOvie HIt :)

RatIng 4/5

250 Days. ..

:)

Chandu S చెప్పారు...

@ మధురవాణి గారు,

ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@ మనసు పలికే,
నేను రివ్యూ రాద్దామనే సినిమా తీస్తున్నామండి. ఇలా మొహమాట పెట్టేస్తున్నారు.
ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

ఏటంటాను?

మన అ. సౌమ్య రికమండేషన్,

చేతులు కట్టేసినావే, కానీయ్ మరి

4.75 ఇచ్చుకో, మీ వెబ్ సైట్ లో ఒవర్సీస్ అంతా ఫ్రీగా పబ్లిసిటీ చేసుకో ఫో, మొత్తానికి సూది బండీ, ఛాన్స్ కొట్టేశావో.

నిషిగంధ చెప్పారు...

బాబొస్తాడొస్తాడా... ఈ ఐటెమ్ సాంగ్ సూపరసలు :))))))))))

ఈ పోస్ట్ కి కేక, దూకుడు, కత్తి, సూపర్, రచ్చ, కెవ్వ్, అదుర్స్.. ఏదీ సరిపోదండీ :)))

మీరిలా పోస్ట్ పోస్ట్‌కీ కామెడీ పెంచేసుకుంటూ వెళ్ళడం ఇంకా బాగా నచ్చేస్తోంది :-)

Chandu S చెప్పారు...

@ SHANKAR.S,

Welcome to my blog. Thanks for the comment

కొత్త పిల్లలు ( డైలాగు రైటరు, సంగీతం పిల్లాడు) శంకర్ డైరెక్షన్ లోనే చేస్తామని మొండికేసి కూర్చున్నారు. మీరు రావాలి మరి

Chandu S చెప్పారు...

భాస్కర్ గారూ.

ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

పప్పు శ్రీనివాస్ గారు,

మీ ఇంటి పేరు కెవ్వు గా మార్చడమైంది.

చదివినందుకు, కెవ్వినందుకు

ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

చాణక్య గారు,
Welcome to the blog. Thanks for reading.

ఇలా కత్తులతోనూ, అరుపులతోనూ బెదిరిస్తే వస్తాయా ఆంధ్రా రైట్స్? డిస్ట్రిబ్యూషర్ అంటే పెట్టుబడి కూడా పెట్టాలి.

Chandu S చెప్పారు...

@ sivaprasad
Thanks

Chandu S చెప్పారు...

@ రాజేష్ మారం...
Thank you

Chandu S చెప్పారు...

నిషిగంధ గారు,

ధన్యవాదాలు. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు.

kiran చెప్పారు...

ఏంటండి..బ్లాకు లో కూడా టికెట్ లు లేవంటా..
పొద్దున్న నుండి తిరుగుతున్నా.. :(........
kevvvvvvvvvvvvvvvvvvvvvv ....మామూలు కెవ్వ్ కాదు...
బాబోయ్ సూపరు :D

అజ్ఞాత చెప్పారు...

అన్ని సినిమాల్లాగే, మా ఊళ్ళో (పూణె) కూడా రిలీజ్ చేస్తే తప్పకుండా చూసి, రివ్యూ వ్రాయడం తథ్యం......

అజ్ఞాత చెప్పారు...

బాగుంది. Nice take-off on సారొస్తారొస్తారే.

yaramana చెప్పారు...

'చాలా బాగుంది.'

'కడుపుబ్బ నవ్వుకున్నా.'

'అద్దరగొట్టేశారు.'

లాంటి కామెంటు రాద్దామనుకున్నా.

ఇక్కడ కామెంట్లు చూసి..

'పాడిందే పాట.. ' లాంటి పాత చింతకాయ కామెంట్ రాయడానికి ఇబ్బందిగా ఉంది.

అయినా సరే! నా కామెంట్ నాదే! వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.

"చాలా బాగుంది!"

shanky చెప్పారు...

బాల్కనీ యాభై..ఐదొందలు. బాల్కనీ యాభై..ఐదొందలు. బాబూ కిరణ్ టికెట్ కావాలా? :)

SHANKAR.S చెప్పారు...

మీరు మరీనండీ. వాళ్ళు చెప్తోంది రోబో, శివాజీ సినిమాల డైరక్టర్ శంకర్ గురించి :)

SHANKAR.S చెప్పారు...

వామ్మో ఏంటి నా పేరు మళ్ళీ పాత స్టైల్ లో పడింది?? SHANKAR.S గా మార్చి కూడా ఏడాది అవుతోంది. వామ్మో!!!వాయ్యో!!! గూగులోడా ఏంటీ ఆటలు :(((

Chandu S చెప్పారు...

harephala గారు,

ధన్యవాదాలు సర్

Chandu S చెప్పారు...

Tetageeti gaaru,

thank you

Chandu S చెప్పారు...

yaramana gaaru,

Thank you

మనోజ్ఞ చెప్పారు...

అబ్బబ్బబ్బబ్బ అద్భుతం, అమోఘం అండీ. మీ సినిమాలో నాకూ వాటా కావాలి అంతే. ఇప్పటికే అందరూ అన్నీ పంచేసుకున్నారు కాబట్టి మీడియా హక్కులన్నీ నావే. ప్రతీ ఛానెల్ లోనూ నిమిషానికి ఐదుసార్లు ప్రకటన వచ్చేస్తుంది. మా ఛానెల్ లో అందరినీ కూర్చోబెట్టేసి చర్చ పెట్టేద్దాం. మరి మీరు ఇంకేమీ అనకండి, అలా కానిచ్చేయండి.

Chandu S చెప్పారు...

మనోఙ్ఞ గారికి,

మీ బ్లాగులో తరచూ వ్రాస్తుండమని అభిమాని గా కోరుతుతున్నాను.

పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు.

ఇక మీరడిన మీడియా హక్కుల విషయానికొస్తే

అవన్నీ మా పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ మరియు 'నీడిల్ ట్రైన్' అధినేత అయిన అ. సౌమ్య గారే చూసుకుంటున్నారు. మీరో సారి ఆవిణ్ణి కలవండి. ఆవిడ చా...లా...స్ట్రిక్ట్.

కిటుకు: అక్కా అని పిలుస్తూ, సీకాకుళం యాస లో మాట్లాడితే పని జరుగుతుంది.

SHANKAR.S చెప్పారు...

"అక్కా అని పిలుస్తూ, సీకాకుళం యాస లో మాట్లాడితే పని జరుగుతుంది."

సీకాకుళం కాదండీ ఇజీనారం.

@ మనోజ్ఞ గారు
మీరేమీ తనని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదండీ ఓ సారి మెల్లిగా ఇజీనారం అనండి. వెంటనే మీ పక్కనుంటారు. ఇజీనారం గురించి ఒకటి రెండు ముక్కలు మాట్లాడారా ఇంకా మీ పంట పండినట్టే. ఈ సినిమా ఏంటి వచ్చే పది పన్నెండు సినిమాల వరకూ మీడియా హక్కులు మీవే :)

SHANKAR.S చెప్పారు...

హమ్మయ్య ఈటీవీలో సీరియల్ ఎలా వేయించుకోవాలో సుమన్ బాబుకి చెప్పిన ఫీలింగ్ వచ్చేసింది :)

ఆ.సౌమ్య చెప్పారు...

ఎవరిక్కడ ఇజీనారం అన్నారు...బాబూ...అమ్మా...చిట్టీ

ఆ.సౌమ్య చెప్పారు...

ఎవరిక్కడ ఇజీనారం అన్నారు...బాబూ...అమ్మా...చిట్టీ

సుజాత చెప్పారు...

శంకర్, అండ్ శైలజ గార్లూ,
మనోజ్ఞ, సౌమ్య ఇద్దరూ అక్క చెల్లెళ్ళు స్వయానా! తెలుసనుకున్నా మీకు

Chandu S చెప్పారు...

సుజాత గారు,
తెలుసండీ. అందుకే సౌమ్య ను కొంచం ఆట పట్టిస్తున్నాను.

Chandu S చెప్పారు...

సౌమ్యా,
'ఇజీనారం?"
ఎవరూ అనలేదు,
మీరే కలవరిస్తూ ఇటొచ్చారు.

సుజాత చెప్పారు...

అవునా? అయితే వాకే :-))

RK Kuppãla చెప్పారు...

Dude, you are very funny! :)

SHANKAR.S చెప్పారు...

సుజాత గారూ అందుకే ఈటీవీ, మా సుమన్ బాబు పోలిక తెచ్చా :)

మనోజ్ఞ చెప్పారు...

ఓస్ మాయప్ప ఐతే యేరే సెప్పాలేటి, నానూ, అదీ ఒకటే కాదేటి. హన్నా మా యప్పని, ఇజిరాన్ని ఆటపట్టిస్తారా. ఇక్కడ కూడా ఇజిరానికి అవివీర భయంకర ఏసీనే, ఏటనుకున్నారో యేటో. అయ్ బాబోయ్ మీరేటండీ శంకర్ గారు మమ్మల్ని సుమన్ తో పోల్చేశారు. దారుణం అంటే దారుణం, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా. చందుగారు టపాలు వ్రాస్తానండీ, కొంచెం చదువులో పడి లేటు చేసాను. వెంటనే వేసేస్తానుగా.

Srikanth చెప్పారు...

6 వ ఐటం సొంగ్ కొంచం మోతాదు దాటిందేమో నండి!! మిగతాది అంతా బాగుంది!

Chandu S చెప్పారు...

@ Srikanth,

చదివినందుకు ధన్యవాదాలు.

మీరు చెప్పింది నిజమే. మా ఇంట్లో కూడా అదే అన్నారు. ఒప్పుకుంటున్నాను.

. నాక్కూడా అదే అనిపించి తీసేశాను.

naimisha yenduri చెప్పారు...

chaala bagundi sailajagaru

Sudha చెప్పారు...

ఇప్పుడేనండీ మొదటిసారి మీ బ్లాగింటికి రావడం...అదిరిందమ్మా చందూ.

ఇకపోతే...హీరో హీరోయిన్లకి బీపులు మ్యూట్లు పెట్టి అక్కడ ఏం డైలాగ్ చెప్పి ఉంటారో అని ప్రేక్షకులకి యమ సస్పెన్స్ పెట్టినట్టు..ఆఖరి కామెంట్లో ...ఆరవ ఐటం సాంగుకి కొంచెం ఎక్కువయిందని తీసేసాను అంటే...ఇంకా ఏం రాసి ఉంటారో అక్కడ అని గోళ్ళు కొరికేసుకుంటున్నా. బాబొస్తాడొస్తాడా..అక్కడున్న ఐదు లైన్లూ నేను కిం.ప.దొ.న అసలు.

Pantula gopala krishna rao చెప్పారు...

మీ ఈ పాత పోస్టు ఇవాళ చూడడం జరిగింది.ఎప్పుడు చూసినా ఫరవాలేదు.ఇది ఎప్పటికీ వాడని పువ్వు.తెలుగు సినిమా బతికున్నంత కాలం వాడదు.సినిమాలు లేకుండా తెలుగు వాడు బతకలేడు కనుక తెలుగు జాతి ఉన్నంతా కాలం ఇది పరిమళిస్తూనే ఉంటుంది.ముళ్లపూడి వారు వి.మా.సిం. లో వేసిన బీజం మీ ఈ పోస్టులో వటవృక్షంలా ఎదిగిందని నాకనిపించింది.(మీ పాత రచనలన్నీ చదవాలి).

Saradhi Motamarri చెప్పారు...

ఇప్పుడే గురవారెడ్డి గారి తరంగ కార్యక్రమంలో మీ మాట విని, మీ బ్లాగ్ చదివానండి. బాగా రాశారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి