18, మే 2014, ఆదివారం

పెళ్ళి- పెటాకులు
      పెళ్ళి పెటాకులైందివివాహం విచ్ఛిన్నం అయింది. సోఫాలో కూలబడి టీవీ చాన్నెల్స్  అన్నింటినీ , నా ఇష్టమొచ్చినట్టు చూపుడు వేలితో ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నా.

నేను  అందర్లాంటిదాన్ని కాదని,  అందర్లాగే అనుకుంటూ పెరిగాను.

  పెళ్ళి చేసేసుకుని వచ్చేవాడిమీద లోపలి ప్రేమనంతా కురిపించాలని ఏం అనుకోలేదు. అమ్మానాన్నలు లేరుగానీ, వాళ్ళిచ్చి వెళ్ళిన మంచి ఇల్లుంది. ఉద్యోగముంది. పెళ్ళి చేసేందుకు మావయ్యున్నాడు. మంచి సంబంధమన్నాడు. హాయిగా పెళ్ళి షాపింగు చేసుకుని పెళ్ళిపీటలమీదకెక్కాను.

పెళ్ళి తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు.

గోడ ఇవతల కూర్చుని, గోడకవతల ఏవుందంటే ఎవరికి మాత్రం ఏం తెలుసు. మా స్నేహితురాళ్ళంతా తమ మొగుళ్ళు నెత్తిమీద పెట్టుకుంటున్నారనీ, వాళ్ళ అతిప్రేమ తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నామనీ, ఒకటే వాపోతుంటే అదేదో నేనూ పడదామనుకున్నా.


మరి పెళ్ళెందుకు చేసుకున్నావూ అంటే, అదేంటో అలా జరిగిపోయిందంతే

సరే ఇప్పుడు ఆ విషయం మీద విమర్శలు ఆపి, విషయం వినండి


 ఈ మధ్య కొద్దిగా నస పరామర్శలనెదుర్కుంటున్నా. పాత స్నేహితులు పలకరింపులంటూ వస్తున్నారు. 

ఈమధ్యనో ఫ్రెండొచ్చిందిసామాజిక ఎక్స్పోజింగ్ పట్ల  నిబద్ధత కలిగి ఉండడం వల్ల , మా ఫ్రెండ్స్ సర్కిల్ లోని మగవాళ్ళందరికీ ఆరాధ్య దేవతగాపరమపతివ్రతగా వెలుగొందుతోంది.


'పైట, దాని యొక్క లక్షణాలు, బాధ్యతలు' అన్న అంశం పై పరిశోధన చేసి పత్రాన్ని పైట లా ఆమెకు సమర్పించితే మనకు మనశ్శాంతి దక్కవచ్చుననిపించింది. 


ఇంతకూ పెళ్ళి ఎందుకు  పెటాకులైందో నేను చెప్పుకోవడానికి  అవకాశమిచ్చింది.

అసందర్భంగా ఏదో గొణిగాను. ఫలానా కారణాలని చెప్పలేనాయె

“కొడతాడా?”

“ఊహూ.”

“తిడతాడా?”

“ఏబ్బే లేదు”

“మరి అమ్మాయిలల్తో ఎఫెయిర్స్ ఉన్నాయా?”

“ఏమో ?”

“మరేంటే, ఇంకేవిటి హాయిగా మొగుడితో కాపురం చెయ్యక నీకేం పోయేకాలం?” అంటూ నాలుగు పెట్టింది.

అంటే మూడు కారణాలకు తప్ప ఇంక వేటికీ విడాకులు తీసుకోకూడదన్న మాట.

“అదికాదే, ఎంతమందికి సమస్యలు లేవు. అందరూ కాపరాలు వదిలేసుకుని రోడ్ల మీదకెళ్తున్నారా?” అంది

“అదా, నాకు పెళ్ళి పడదే. నా వల్ల కాదు. “

పెళ్ళి, భర్త, కాపురం వాటి ప్రాముఖ్యతల గురించి వివరిస్తూ,  డైవర్షన్ తీసుకుని తన కాపురం ఎంత గొప్పగా సాగుతోందో  చెప్పడం మొదలెట్టింది
గ్రాంధిక భాషలో  పరమ అసయ్యమైన మాటలు మాట్టాడుతోందిగొప్పలు పోతోంది

నఖ క్షతాలుట!

 “గోళ్ళు కూడా తీసుకోనంత మురికివాడితో సరసాలాఛా..”  అంటే ,

“నీ బొంద నీకేం తెలుసుఅంటూ తన మొబైల్ లో,  రొమాంటిక్ అన్జెప్పి, సెన్సారు వాళ్ళు సిగ్గుతో చితికే ఒక పాట పెట్టి  కళ్ళు మూసుకుని, పాముకు మల్లె తలకాయ ఊపుతూ తన్మయత్వాన్ని  అనుభవించింది

ఇదెక్కడిగోల .వాళ్ళింటి సోఫాలో కూర్చుని తీరిగ్గా అనుభవించవచ్చుకదా! 

గబుక్కున కళ్ళు విప్పింది.

“ఏవే నీకు కిలికించితాలు అంటే తెలుసా?”  అంది.

“చెప్పు”  అన్నాను నీరసంగా.


కిలికించితము అంటే అదొక శృంగార చేష్టా విశేషమనీ, అల్లాంటి వాటిల్లో మూర్తిగారొక నిపుణుడనీ చెప్పింది

“మూర్తి గారితో ఇదేనే తంటా. ఎప్పుడూ  వెనకనుండి వచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు.” అంది.

"మూర్తి గారొచ్చి అలాంటి పనులు చేస్తుంటే మరి మీ ఆయన కప్పెట్టడా" అని అడిగాను.

 పగల బడి నవ్వింది.

మూర్తి గారంటే దాని భర్తేనట

మూర్తి గారట్లా , మూర్తిగారిట్లా అంటూ నన్ను చావగొట్టే స్తోంది . బయటికి మాత్రం మూర్తిగారి వార్తలకు మురిసి ముక్కలవుతున్నట్లు మొహం పెట్టాను.

వేరే ఆడవాళ్ళంటే మహా చీదర ప్రదర్శిస్తాడట. పాత సినిమాల్లో జ్యోతిలక్ష్మి కనిపిస్తే ఓం నమశ్శివాయ అంటూ కళ్ళు మూసుకుంటాడట.  ఐటం సాంగ్ అయ్యేవరకూ సిన్మా హాలు బయటే గడుపుతాడట
ఇంతకూ ఏడా అనుమానాస్పదుడు  అంటే మల్లెపూలు కొనడానికి బయటికెళ్ళాడంది. జ్యోతిలక్ష్మిని నిర్లక్ష్యం చేసి, దీని కొంగు పట్టుకుని తిరుగుతాడానా ఫ్రెండు అయితే అయింది గానీ దీనికింత అహంకారం పనికి రాదు.

*******

పెటాకుల పర్వానికి ముందు, లుంగీలు, ఇంకా చండాలపు కొన్ని వస్త్ర విశేషాలు, నా బట్టలతో కలిపి ఉతికి వేర్వేరుగా  ఆరేయాలి. మడతలు పెట్టాలి

నిన్నెవడుతకమన్నాడు, ఉతికానని ఊరంతా ఎవరు చెప్పమన్నారు అనకండి. మరీ మూడు రోజులైనా అవే బట్టలేసుకుంటున్నాడే, ఉతికిన బట్టలేసుకోవాల్సిన అగత్యమున్న మానవుడివి నీవు అని గుర్తు చేద్దామని ఉతికాను

వారం వారం అత్తా మావలొచ్చేవాళ్ళు . శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానం అదీ చేసి చీరకట్టుకుని రైల్వే స్టేషన్ కు వెళ్ళి అత్తమావల్ని రిసీవ్ చేసుకోవాలి

వాళ్ళు ముగ్గురూ,  హాల్లో సన్న గొంతుల్తో  మాట్లాడుకునేవాళ్ళు. 

 నేను హాల్లోకెళ్ళగానే తమ అబ్బాయి గొప్పతనం వివరించేవాళ్ళు. ఎంత తెలివికలవాడో, వాడెంత ఆవేశపరుడో, కోపమొస్తే  ఎలా వాణ్ణి మనం పట్టలేమో చెప్తుండేవాళ్ళు. సినిమాలో సైడు కేరెక్టర్ వచ్చి హీరో గారి కేరెక్టర్ ఎలివేట్ చేసే డైలాగులు చెప్పినట్లు  అత్తమావలు వాళ్ళ అబ్బాయి గురించి వర్ణిస్తుంటే మధ్యలో కూర్చున్న మొనగాడు ముసి ముసిగా నవ్వుతుండేవాడు.

ఆహా, ఇతణ్ణి భర్తగా పొందిన నేను ఎంతటి అదృష్టవంతురాలిని?
 ఆవేశం లో  ఓ సారి పెద్దా చిన్నా చూడకుండా, ఎవరో ఎమ్మెల్యే స్థాయి చుట్టం మీద మీద కెళ్ళి చెయ్యెత్తి కొట్టబోయాడట

వాడు మడతలు తీసిన పేపర్ చదవడు
అన్నం ముద్దగా ఐతే నోట్లోబెట్టుకోడు
పెరుగు పులుపెక్కితే అబ్బాయికి పిచ్చెక్కుతుంది. 
అట్టు మాడితే మొహం మాడ్చుకుంటాడు.
ఇత్యాది వివరాలన్నీ మా అత్త , నాతో చెప్పి, 

‘అబ్బాయికి అది అమర్చావా, ఇది అమర్చావా’ అంటూ అతడేదో ఒక పెద్ద స్థాయి మిలట్రీ ఆఫీసర్ అయినట్లూ, నేను జవాను స్థాయి వినయం చూపించాలన్నట్లూ ఆవిడ ఆశించేది. పాపం ఆమె, ఆమె భర్త కెలా మర్యాదలు చేసేదో నేనూ కూడా అలాగ  చెయ్యాలని ఆశపడేది 


ఇతగాడు కూడా అమ్మానాన్నలొస్తే అదోరకం నాటకం వేస్తుండేవాడుఅమ్మావాళ్ళకు  ఇలా నచ్చదు అలా నచ్చదు అని.
మనిషి చూడబోతే ఎద్దులాగా పెరిగాడా, స్నానానికెళ్ళిఅమ్మా టవల్’ అంటూ రంకె వేసేవాడు.  

“గబ గబా టవలందించకపోతే  అమ్మో వాడిక్కోపమొస్తుంది. కోపమొస్తుందమ్మాయ్”  అంటూ భయపడేది

కోపమొస్తే , ఏట్లో దూకమనండి అని లోపలనుకుని
“ ఏం చేస్తాడూ ?” అనడిగాను.
"మన్నూ మిన్నూ ఏకం చేస్తాడు" అంటూ నెత్తీ నోరూ బాదుకుంది

పెద్దావిడ గబగబా పరుగులెత్తి కాలు విరగ్గొట్టుకుంటుందేమో అని నేనే తీసికెళ్ళి టవలిచ్చాను. బయటికి చాపిన చేతి మీద ఎర్రగా కాల్చిన అట్లకాడతో వాత బెడదామని సర్దా పుట్టింది. తడిచెయ్యి కదా, సుర్రుమంటుందో లేదో కూడా తెలుస్తుంది

స్నానమై రాగానే తల్లి, పక్కనే కూర్చుని తల తుడుస్తోంది. వేడిగా పాలు తాగు నాయనా అంటోంది.  లేకపోతే జలుబు చేస్తుందిట. అమ్మాయ్ సాంబ్రాణి ఉందా అని నన్నడిగింది. లేదన్నాను

సారి వచ్చేప్పుడు తెస్తానని చెప్పింది.

మావగారి గోల ఇంకో రకం. అమ్మాయ్, అమ్మాయ్ అంటూ చుట్టూ తిరుగుతుండేవాడు
నేను చుట్టుపక్కలున్నపుడు మావగారు  మా అత్తగారితో “ఏవిటోయ్ మాంచి మూడ్ లోఉన్నావూ, ఇహ వచ్చేనెల వేవిళ్ళే “ అంటుండేవాడు. ఆయనింకా ఆ విషయం లో సమర్థుడే అని నేననుకోవాలని, తన ప్రయత్నాలు తాను చేస్తుండేవాడు. 

వచ్చే సంవత్సరం ఈ పాటికి ఇంట్లో ఇంకొకరు పాకాలని ఇంగ్లీషులో చావు గీత  గీస్తూ, "ఆ ముచ్చట కూడా తీరితే  రామా కృష్ణా అని బతికేస్తాం. కోడలివి, నేనింతకన్నా చెప్పలేను . కొన్ని గీతలు దాటలేను .” అని గీతోపదేశం చేస్తూ మహోన్నతమైన triple xxx సంస్కారం అనే జబ్బుతో బాధపడుతున్నట్లు మొహం పెట్టాడు.

ఇవన్నీ పక్కనుంచితే బాబయ్యా, నెల నెలా కొత్త గండమొచ్చిపడేది. నేను నెలతప్పడం కోసమని ప్రతినెలా,  తప్పకుండా ముడుపులవీ కట్టేది మా అత్తగారు. తప్పలేదని తెలిస్తే పదో క్లాసు తప్పిన పిల్లవాడిలా డీలా పడిపోయేది. ఇదెక్కడిగోల
నా నెలా నా ఇష్టం. తప్పాలనుకుంటే తప్పుతాను. పాసవ్వాలనుకుంటే పాసవుతాను

వీకెండుకొచ్చిన అత్తమావలు వీకు నిండా వీక్నెస్ నింపి వెళ్ళేవాళ్ళు.


ఇవన్నీ ఒకెత్తు.

ఆడవాళ్ళందరి వంకా ఆబగా చూస్తాడా? అదేంపని అంటే ఆమెలో అమ్మ కనిపించిందనో,  అక్కాయ్ కనిపించిందనో బుకాయించేవాడు. పరమ పవిత్రమైన అతని చూపులలో బూతు అర్థం వెదికినందుకు నన్ను చీడపురుగులా అసయ్యించుకునేవాడు

 నేనొచ్చేసరికి ఎవరితోనో ఫోన్ లో గుసగుసలాడుతుండేవాడు. నవ్వులూ , గొంతులో వగలు ఇవన్నీ అవతల పక్కన ఉన్నది ఆడపిల్లే నని ఎవరికైనా తెలిసిపోతుంది.

“చూడు, చూడు ఉమా గాడితో మాట్లాడుతున్నా” అంటూ ఫోన్ లో  పేర్లు చూపెట్టేవాడు, ఉమా కాంత్, రమాకాంత్, లక్ష్మీ కాంత్. వాళ్ళూ కాంత్ లు కాదనీ, కాంతలూ,  కాంతాలేనని  మనసు కుండ బద్దలయ్యి మరీ చెప్పేది.  


నేనే ఆఫీసులో పనిచేసినా బాసులు నా నిర్ణయాలను తెగమెచ్చుకుని నన్నో గర్విష్టిని చేశారు. అట్టాంటిది ఇంట్లో మాత్రం రోజూ గర్వభంగమే 
నేనేం చేసినా సరే ప్రతి దానికీ వంకపెట్టడమే.  “లక్కీ, అలా ఎలా చేశావు మరీన్నూ”  అని ముందు ఆశ్చర్యపోయి, ఆ తర్వాత సరే అలా చేశావా, ఇలా ఎందుకు చెయ్యలేకపోయావూ అంటూ మెత్తగా చివాట్లు పెట్టే వాడు.
ఆటో ఎక్కి వచ్చానంటే ఆటో ఎందుకూ బస్సెక్కక పోయావూ అంటాడు. బస్సెక్కి వస్తే కాలినడక ప్రయోజనాల గురించి మాట్టాడతాడు.

అంటే నేను చేసిన ప్రతి పనీ పనికిమాలిందేనా?

వెర్రిపీనుగను. మొదట్లో తెలియక సారీలు చెప్పేదాన్ని
తప్పుచేసావు సుమీ  జరిగిందేదో జరిగింది, నిన్ను క్షమించానులెమ్మన్నట్లు మొహం పెట్టేవాడు.

గేంగ్ రేప్ జరిగిన తర్వాత భార్య ఇంటికొస్తే దుఃఖాన్ని గొంతులో అదిమి, గుండెలకు హత్తుకునే గొప్ప మనసున్న భర్తవలె ఎప్పటికప్పుడు క్షమిస్తుండేవాడు. వాడి క్షమాభిక్షలు మొయ్యలేని ముష్టిబతుకైంది.   వీడెవడండీ బాబూ నా ప్రాణానికి


“నీకెందుకోయ్, నీ పని నువ్వు చూసుకోఫోఅని అరిచానా? మెత్తగా పక్కన చేరి, “డార్లింగ్ ఎందుకలా ఆవేశపడతావు, కూల్ గా ఉండు, క్వైట్ గా ఉండు” అంటాడు
అక్కడికి ప్రతిసంవత్సరంనోబెల్ శాంతి పురస్కారం వీడికే దక్కుతున్నట్లు

నేను పడుకుంటే చాలు. చచ్చిన శవంతో సమానంగా నిద్రపోతాను. నిజంగా చచ్చాననుకుని, యమధర్మరాజు కూడా హడావుడిగా దున్నపోతును తోలుకుంటూ వచ్చేయగలడు .  
 నేను నిద్రకు పడ్డానో, వాణ్ణి మోహినీ పిశాచం పూనేదిమెలకువ గా ఉన్నపుడు నా జోలికే రాడు.  చాల మర్యాదస్తుడు.

  చూపుడు వేలిని నుదుటిమీదనుండి ముక్కు మీదుగా దాన్ని ప్రయాణింప జేసి, అప్పుడే పుట్టిన పాము పిల్ల/బాగా దిట్టమైన గొంగళి పురుగు పాకుతున్న ఎఫెక్ట్ తీసుకురావడానికి కృషి చేసేవాడు. పెదవులమీదకు తెచ్చి సున్నాలతో జలదరింపుల సునామీ సృష్టించేవాడు.  

గబుక్కున నిద్రలేచి చూస్తే, విషపు నవ్వుతో, శవాలకు లైనేసే వాడిలా మరింత జలదరింపు కలిగించేవాడు

ఏంటీ పని అంటే 
తానో అత్యుత్తమ రసికుడినన్నట్లూ, తను చేసేది ఓ అద్భుతమైన సరస ప్రక్రియ అనీ  భ్రమ పడమని పేచీ పెట్టేవాడు

  పైత్యం తగ్గేందుకు అధిక ఉష్ణోగ్రతలో సలసలా కాగుతున్న ద్రవాలేమైనా నెత్తిన వొంపితే కాస్త కుదురుగ్గా వుంటాడేమో. నిద్ర పోవాలంటే కడుపులో గుబులుగా ఉండేది


ఒకటని కాదులెండి. ఎన్నని చెప్పను. మనసుకు శాంతిలేదు. బతుకులో నవ్వులేదు. అబద్ధాలు, మోసాలు, లౌక్యం. వీడి తద్దినం. నిద్రపోవాలంటే భయపడే రోజొచ్చినాక నాకు విసుగొచ్చేసింది. ఏదైతే అదయ్యింది. వీడితో వేగడం నావల్లకాదని వాడి సామానంతా రెండు గోతాల్లో తొక్కి మా మావయ్యతో వాడి ఆఫీసుకు పంపించాఇక నాజోలికొస్తే  జైలుకెళ్తావన్న మెసేజ్ పెట్టాను

కాఫీ మగ్గు పట్టుకుని బాల్కనీ లో కూర్చుని పాట వింటుంటే, నేచేసిన మంచి పనేదైనా ఉంటే వాణ్ణి వదిలించుకోవడమే అనిపిస్తోంది

నా ఇల్లు నా సోఫా, నా మొక్కలు, నా కిచెన్,  నా శనాదివారాలు. నా నిద్ర, నా ఆవకాయ, నా కుక్కర్ లో అన్నం. నాకిప్పుడు హాయిగా ఉందిచాలా హాయిగా ఉంది. ఆ  పిడక గాణ్ణి వదిలేస్తే ఇన్ని లాభాలుంటాయని తెలిస్తే పెళ్ళి రోజునే వదిలేద్దును కదా.

*****
ఇంతలో ఒక మహాకాయుడు , మహోన్నతోదరుడూ మరియు నా ఫ్రెండు మొగుడూ అయిన  మూర్తిగారు వచ్చాడు.   అది చెప్పిన కబుర్లకు అతడి అవతారానికి ఏమాత్రం పొంతన కుదరక అయోమయం చెందాను.   అంతటి సరసుడితడేనా అన్న అనుమానం ఎంత తొక్కి పట్టినా తోక తొక్కిన తాచులా లేస్తోంది. సరే భార్యలకు భర్తే మన్మధుడు.  ఇలా అజ్ఞానం పెంపొందించుకుని, భర్తను ఆ మాత్రం అపార్థం చేసుకుంటే తప్ప కాపరాలు సాగవనుకోండీ. 

 ఏదో పేద్ద పొట్లాం తో దయచేశాడు.

వంటింట్లోకొచ్చి  ఇంకా అతని రసికత గురించి మాట్లాడబోతే,  " ఏవే , ఇందాకట్నుండీ నువ్వు చెప్పిన పనులు చేసేది ఇతడేనాఅని అనుమాన పడ్డాను . 


 "నీకేం తెలుసే అతనెంత రసికుడో?" అంటూ టన్నులకొద్దీ సిగ్గొలకబోసిందిరేపెట్టాగూ ఇల్లు కడుక్కుంటాగా, అప్పుడు కాస్త  డెట్టాలెక్కువ ఒలకబోస్తే సరి

బయట పిల్లలు క్రికెట్ ఆడుతుంటే నేను వంటింటి కిటికీలోంచి చూస్తున్నా.

“ఇలా రావే”  అంటూ గావు కేక వినిపించింది. ఏం చేసుకుచస్తున్నారో అంటూ పరిగెత్తుకెళ్ళాను. దాని బుగ్గ పిండినట్లున్నాడు

"చూడవే ఏం చేశాడో!" అంటూ  నాపక్కకొచ్చి దాక్కొంది

“తనేం చేసిందో అడగండి”  అంటూ అతను నవ్వుతున్నాడు

 నా ఫ్రెండ్ మొగుడు  నవ్వకుండా ఉంటే పర్లేదు,  భరించగలం. నవ్వుతుంటే , నాలోపల అణిగి యున్న సూయిసైడల్ టెండెన్సీ ఉవ్వెత్తున లేస్తోంది.

నాకెటూ పెళ్ళి పెటాకులైంది కాబట్టి,  అమ్మమ్మతనాన్ని అంటగట్టారుమొగుడూ పెళ్ళాలిద్దరూ ఒకరి మీద ఒకరు పితూరీలు గుప్పించుకుంటూ తమ అన్యోన్యతను వెళ్ళబోసుకుంటున్నారు తీర్పు చెప్పమని బలవంతపెడుతున్నారువాళ్ళిద్దరి అన్యోన్యత వాంతి కలిగిస్తోంది

   కొత్త జెనెరేషన్ పార్వతీ పరమేశ్వరుల్లాగాశృంగారానికి అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్లకు మల్లే “పాపిష్టిదానా , చూశావా నువ్వేం కోల్పోతున్నావాఇప్పటికైనా తప్పు తెలుసుకుని పతి పాదాల వద్దకు చేరు” అంటూ తమ సరసాలతో హూంకరిస్తున్నారు.


వాళ్ళ సరాగాలకు నా నరాలు తెగేట్టున్నాయినా పరోక్షం లో కూడా వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఉంటారా లేక నన్ను పెటాకులతనాన్ని రెచ్చగొట్టేందుకిలా సరిహద్దులు దాటిన సరసాలతో కవ్వింపు చర్యలకు  పాల్పడుతున్నారా అన్న అనుమానం కలిగింది


పైకి నవ్వాను గానీ , మనసులో 'వాళ్ళిద్దర్నీ ఒకే కత్తికి బలిచేసి, రెండో నిముషంలో పాతి పెట్టి, మూడో నిముషంలో సరెండర్ అయిపోతే ' అన్న ఆలోచన కొద్దిగా రిలీఫ్ నిచ్చింది.  

వస్తూ వస్తూ మల్లెపూల పొట్లాం తెచ్చాడు. అన్ని పూలేం చేసుకుంటారో ?
అమ్మయ్య, మొగుడొచ్చాడుకదా, ఇంక వెళ్ళిపోతుందిలే అనుకుంటే అక్కడే పొట్లాం విప్పదీసింది. పెద్ద బంతిలా చుట్టి ఉన్న మల్లెపూల మాలను విడదీసి రెండు మూరలు కొలిచి , చేత్తో తుంపి పెట్టుకోవే అంటూ ఇచ్చింది
 ఇంకొంచం ఇవ్వూ” అంటూ దాని  మొగుడు సలహా ఇచ్చాడు. అప్రయత్నంగా అతన్ని మొహం మీద కొట్టాలనిపించింది


పాఠకులకో యక్ష ప్రశ్న
లోకంలో అన్నింటికంటే మిక్కిలి భరింపరానిది ఏది ?

జవాబు:

 మన స్వంత సోఫాలో స్నేహితురాలు, దాని స్వంత మొగుడితో చేసే  రొమాన్స్ .

ఆ సాయంత్రమంతా ఆఫర్లు లేని హీరోయిన్, బట్టల షాపు ఓపెనింగ్ కు వచ్చి హల్ చల్ చేసినట్లు, సందడి సృష్టించారు.

వెళ్ళబోతూ, నాఫ్రెండు నన్ను ఇల్లాంటి సమయాల్లోనే మనసూ అదీ రాయి చేసుకోవాలనీ అలా గట్టిగా తయారయేవరకూ వారం వారం తానొచ్చి సహాయం చేస్తాననీ చెప్పింది.. 

“రేపు అమ్మావాళ్ళింటికెళ్తున్నాను.  వచ్చే ఆదివారానికి వచ్చేస్తాను. సరేనా?” అంది నాతో.

అద్భుతమైన అమర సుఖాలను ఎలా కోల్పోతున్నానో మొగుడితో సహా డెమో ఇవ్వడానికి వస్తుందన్నమాట. 

వాళ్ళాయనకు ఆఫీసులో పని ఉందట. తనతో రావడం లేదనీ, దానికిప్పట్నుండే బెంగ పడుతున్నాడనీ అంటోంది. 

దీన్ని ఎలా అయినా వదిలించుకోవాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో 

"నేను కూడా ఓ నాల్రోజుల పాటు హాలిడే కు వెళ్దామనుకుంటున్నాను."

"అలాగా? ఎవరితో?"

"ఎవరనీ ఇంకా అనుకోలేదు.  పోనీ మీరొస్తారా, అదొచ్చేసరికి తిరిగి వచ్చేద్దాం" అన్నాను అతనితో. 

నా ఫ్రెండు అపార్థం చేసుకునే వీలుగా అతని వంక చూసి నవ్వాను. తప్పు గా అనుకోకండి, తెగించక తప్పలేదు.

భయంతో భార్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. 

 వెంటనే అంతటి భారీ కాయుణ్ణీ, బరబరా ఈడ్చుకెళ్ళి కార్లో కూలేసింది

“వెళ్తానే” అంటూ కారు తోలు కెళ్ళిపోయింది.


కొంపదీసి ఘటోత్కచుడు వస్తానని ఉంటే? అదే కదా మీ అనుమానం ?

 ..  మీ పిచ్చి గానీ , భార్య ముందు వస్తాననగల వస్తాదులెవరు46 comments:

సుజాత చెప్పారు...

పంచ్ లు అద్దిరి పోయాఇ శైలజ గారూ! లైన్ లైనుకీ నవ్వులే!
ఆమెకు సమర్పించితే మనకు మనశ్శాంతి దక్కవచ్చుననిపించింది.

మూర్తి గారొచ్చి అలాంటి పనులు చేస్తుంటే మరి మీ ఆయన కప్పెట్టడా

బయటికి చాపిన చేతి మీద ఎర్రగా కాల్చిన అట్లకాడతో వాత బెడదామని సర్దా పుట్టింది. తడిచెయ్యి కదా, సుర్రుమంటుందో లేదో కూడా తెలుస్తుంది.

గేంగ్ రేప్ జరిగిన తర్వాత భార్య ఇంటికొస్తే దుఃఖాన్ని గొంతులో అదిమి, గుండెలకు హత్తుకునే గొప్ప మనసున్న భర్తవలె

శవాలకు లైనేసే వాడిలా మరింత జలదరింపు కలిగించేవాడు.

..తర్వాత? తర్వాతేమైందో దబ్బున చెప్పేయండి

Aruna Bera చెప్పారు...

Oh my God I could'nt stop laughing..
After long time..keep posting more.

teresa చెప్పారు...

:) Hilarious.

రాజ్ కుమార్ చెప్పారు...

Dev......Da.....
Idemi iragadeeta andee....araachakam

Sai Padma Murthy చెప్పారు...

బాబోయ్ ఇలా నవ్విన్చేస్తే ఎలా అండీ.. భలే భలే.. పంచలు వూదగోట్టే పంచ్ లు.. ఎన్ని రోజుల తర్వాత ఇంత ఆరోగ్యకరంగా నవ్వేనో.. చాలా బాగుంది .. ఇంకా రాయండి..!!

Sujata చెప్పారు...

I am your fan ! Thanks sai padma.... thanks. I m speechless.

శ్రీనివాస్ చెప్పారు...

"మూర్తి గారొచ్చి అలాంటి పనులు చేస్తుంటే మరి మీ ఆయన కప్పెట్టడా" అని అడిగాను.

గేంగ్ రేప్ జరిగిన తర్వాత భార్య ఇంటికొస్తే దుఃఖాన్ని గొంతులో అదిమి, గుండెలకు హత్తుకునే గొప్ప మనసున్న భర్తవలె ఎప్పటికప్పుడు క్షమిస్తుండేవాడు.

epic

munjulurikrishna చెప్పారు...

very good humor .romance maro side.

హరే కృష్ణ చెప్పారు...

Hilarious :)

MURALI చెప్పారు...

:)

శశి కళ చెప్పారు...

:))

Y.V.Ramana చెప్పారు...

చాలా రోజుల తరవాత హాయిగా నవ్వుకున్నాను, మొత్తనికి 'రొమేంటిక్' భర్తలకి బాగానే గడ్డి పెట్టారు. :)


శ్రీలలిత చెప్పారు...

శైలజగారూ, అద్భుతంగా వ్రాసారండీ. చదువుతుంటే ఆ పదాల పొందికకి పైకి నవ్వు వచ్చినా ఒక స్త్రీ స్వతంత్రంగా తనంతట తను ఆలోచించుకుంటున్నప్పుడు మనసులో కలిగే జుగుప్సని అంతర్లీనంగా చాలా చక్కగా చెప్పారు.
నిజమే.. యెవరి బ్రతుకు వారిని బ్రతకనివ్వకుండా ఇలా చుట్టాలూ, స్నేహితులూ వాళ్లకేదో ఉపదేశాలు చేసేస్తుంటే వాళ్లకి యెలా వొళ్ళు మండిపోతుందో చాలా బాగా చెప్పారు. నాకు చాలా నచ్చింది. అభినందనలండీ..

నాగరాజ్ చెప్పారు...

పెళ్లి పెటాకులైంది.
వివాహం విచ్ఛిన్నమైంది.
వినోదం విరగబూసింది :-)

స్ఫురిత మైలవరపు చెప్పారు...

నిన్న ఈ పోస్ట్ సగం చదివి నిద్రాపుకోలేక పడుకున్నా. ఎవడో పెద్దాయన మా డైనింగ్ టేబిల్ మీద నేను చేసిన కూర తిని దానికి పేర్లు పెట్టాడు. ఒక నవ్వు నవ్వి ఆ గిన్ని ఎత్తి ఆయన నెత్తిమీదేసినట్టు కలొచ్చిందండీ... ఇంత వయొలెంట్ కల రావడం ఇదే మొదటిసారి :))))

తెరవని పుస్తకం చెప్పారు...

చాలా రోజుల తర్వాత మళ్ళీ బాగా నవ్వించారు.
Thank you

Chandu S చెప్పారు...

సుజాత గారూ, మీ కామెంటు సంతోషాన్నిచ్చింది. థాంక్సండీ.

Chandu S చెప్పారు...

Aruna Bera garu, Thank you.

Chandu S చెప్పారు...

Teresa garu, Thank you

Chandu S చెప్పారు...

రాజ్ కుమార్ , Thank you

Chandu S చెప్పారు...

సాయి పద్మ గారూ, ధన్యవాదాలండీ.

Chandu S చెప్పారు...

సుజాత గారూ, Thank you. మీ బ్లాగ్ ( గడ్డిపూలు) కు నేను కూడా ఫాన్ నే.

Chandu S చెప్పారు...

శ్రీనివాస్ గారూ, Thank you

Chandu S చెప్పారు...

munjulurikrishna garu, Thank you

Chandu S చెప్పారు...

హరే కృష్ణ గారూ, ధన్యవాదాలండీ.

Chandu S చెప్పారు...

Murali garu, Thanks

Chandu S చెప్పారు...

శశి కళ గారూ, Thank you

Chandu S చెప్పారు...

రమణ గారూ, మీ కామెంట్ చూసి చాలా సంతోషంగా ఉంది. thank you

Chandu S చెప్పారు...

శ్రీ లలిత గారూ, పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలండీ. మీకు నచ్చినందుకు సంతోషం

Chandu S చెప్పారు...

నాగ్ రాజ్ గారూ, థాంక్యూ

Chandu S చెప్పారు...

స్ఫురిత గారూ, వయొలెంట్ కలొచ్చిందా, అంటే కథా లక్ష్యం నెరవేరినట్లే. ఇహ కల లక్ష్యం తొందర్లో నెరవారాలని కోరుకుంటాను.

Chandu S చెప్పారు...

@తెరవని పుస్తకం , Thank you for reading.

Jayasree Naidu చెప్పారు...

Superb write up

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హహహహ ఎప్పటిలానే అదరగొట్టేశారండీ... సూపర్బ్... సెటైర్స్ చిచ్చుబుడ్డుల్లా కనిపిస్తూ లక్ష్మీ ఔట్లలా పేలాయి :-))

nalini చెప్పారు...

bhale ga chepparandi!! enta mando cheppalenidi chala subtle ga comedy mix chesi!
fantastic

Ravi Sudhakar చెప్పారు...

Very humorous.

Jyothsna Jaggumantri చెప్పారు...

too good.. comedy baaundi.. chala navvukunna...

Mrithyunjaya Rao చెప్పారు...

అత్యంత సహజంగా, కృత్రిమ ప్రేమల మీద వ్యంగ్యంగా చాలా బాగుంది.

మోహనరాగం చెప్పారు...

మీ రచన మనసుకు ఆరోగ్యమిచ్చు హాస్యపు గులిక అని గంభీరంగానూ చెప్పుకోవచ్చు. కెవ్వు కేక అని తెలుగు సినిమా భాషలో అనేసుకోవచ్చు. మీ బ్లాగ్‌లో ఆలస్యంగా అడుగుపెట్టాను. గంటపాటు హడావుడిగా పర్యటించాను. మనుషులను పరిశీలించడంలో మీకున్న శక్తి గొప్పది. వ్యంగ్యంపై మీకున్న పట్టు దొడ్డది. ఇలాంటి పోస్టులు సరే, ఇతరత్రా రచనల్లో ఎంత సీరియస్‌ సబ్జెక్ట్స్‌ డీల్‌ చేసినా పాత్రల పెయిన్‌ రిఫ్లెక్ట్‌ కాకుండా చూస్తున్నారు. జాగ్రత్తగా అండర్‌ టోన్‌లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మ విశ్వాసం ఉన్నవారిక్కూడా పెయిన్‌ ఉండకపోదు. బాధను వ్యక్తీకరించడం వల్ల ఆ పాత్రల ఆత్మగౌరవానికేమీ భంగం కలగదేమో!. బంధమేదైనా దుక్ఖదాయకమే కాబట్టి మానవసంబంధాల్లో పెయిన్‌ అనివార్యం. అది రిఫ్లెక్ట్‌ కావాల్సినంత అవట్లేదేమో అని అనుమానం.

Umadevi Pemmasani చెప్పారు...

chandu sailaja garu manasu bagonappudalla mee blog gurthukostundi. Its like good medicine for us.Its really works. guntur road meeda velutu rooju hospital boards anni choostuntanu ekkadaina Dr.Sailaja Chandu ani kanapadutundemo ani . lopaliki velli okka sari manasara abinandichalani
umadevi pemmasani

Umadevi Pemmasani చెప్పారు...

thank you doctor
for your good medicine

Pantula gopala krishna rao చెప్పారు...

ఎలాగో ఈ మీ పోస్టు చదవడం ఇన్నాళ్ళూ మిస్సయ్యాను.ఎంత సీరియస్ సబ్జెక్టునయినా ఇంత హాస్యభరితంగా చెప్పడం మీకు చేతనయినట్లు ఇంకెవరికీ చేతకాదని మీ పోస్టులన్నీ చదివాక నాకు అనిపించింది.మన తెలుగు బ్లాగుల్లో ఇంత చక్కని హాస్య రచనలు చేస్తున్న బహు కొద్ది మందిలో మీ స్థానం సుస్థిరం.హృదయ పూర్వక అబినందనలు.
.

anu చెప్పారు...

‘‘భార్య ముందు వస్తాననగల వస్తాదులెవరు?’’ అన్నీ ఒకెత్తయితే.. దీనికి మరీ నవ్వొచ్చింది..

బాగుంది కథ.. పోలికలు మరీనూ..

Ravi Sudhakar చెప్పారు...

చాలా రోజుల తరవాత హాయిగా నవ్వుకున్నాను, మొత్తనికి 'రొమేంటిక్' భర్తలకి బాగానే గడ్డి పెట్టారు. :)
Unknown చెప్పారు...

నేను నిద్రకు పడగానే వాడికి మోహినీపిశాచం పూనేది. మేలుకుంటే నాజోలికి వచ్చేవాడు కాదు - అవును, పడుకుంటే గిట్టదు ఏమిటో. నిద్ర చాలక చాలాకష్టం

Unknown చెప్పారు...

నా అదివారాలు శనివారాలు నావి ఇతె కమ్మగా కవితలు చదూకుంటూ గీతాదత్ పాటలు వింటూ హాయిగా బతికెద్దునుకదా.కాని పిల్లపిశాచాలు కష్టం.ఈ జీవితానికింతే చెసుకున్నవాడికి చెసుకున్నంత మహదేవ

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి