5, ఫిబ్రవరి 2012, ఆదివారం

AIIMS-ఓరియెంటేషన్ ప్రోగ్రాం
AIIMS ( All India Institute of Men's Security )

వారి ఓరియెంటేషన్ ప్రోగ్రాం కు స్వాగతం.


ప్రస్తుత సమాజం లో తీవ్ర వివిక్షకు, నిర్లక్ష్యానికి గురి అవుతున్న ఒక వర్గం గురించి ఎంతో ఆందోళన చెందిన శ్రీమతి ఆదర్శమ్మ గారు ఈ ఇన్ స్టిట్యూట్ ని స్థాపించి పురుష సమాజ సేవకై ఆమె నడుము బిగించారు. దానిలో భాగంగా ఈ ఇన్ స్టిట్యూట్ వారు అందిస్తున్న సేవల గురించి వివరించడానికి  ఈ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ మరియు వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. కీ నోట్ ప్రెజెంటేషన్ అయిన తర్వాత మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ముందు ప్రెజెంటేషన్ చూడండి.


ప్రారంభ ఉపన్యాసం అయిపోగానే కీ నోట్ ప్రెజెంట్ చేసేందుకు ఒకాయన వచ్చాడు. మంచి నీళ్ళ బాటిల్ తీసుకొచ్చి పక్కన బెట్టుకున్నాడు.
స్త్రీ నుండి తమని తాము ఎలా రక్షించుకోవాలి, ఆమెను ఆత్మరక్షణ లో పడేట్టు ఎలా ప్రవర్తించాలి అనే విషయాల మీద చర్చించుకుంటాము ఇవ్వాళ.

ఉదాహరణకు ఈ సీన్ చూడండి.

కీ నోట్ చెప్తున్న అతను ఒక వీడియో చూపించాడు.

భార్య: ఇవ్వాళ ఆదివారం. నేను వంట చెయ్యను.. ఆనంద్ భవన్ లో టిఫిన్ చెయ్యాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది.

భర్త: వారం క్రితమే గా మన పెళ్ళయింది అప్పుడే వేవిళ్ళా? ఆహా నేనెంత మగానుభావుణ్ణి?

భార్య: డబ్బా ఆపి, డబ్బులు తీసుకురా, హోటల్ కు పోదాం.

భర్త: దాందేముంది తప్పకుండా వెళ్దాము. ఆనందభవన్ లో సాంబారు చేసేవాడు మొన్న కనపడ్డాడు. వాడి వేలికి జెట్ట లేచింది. ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు కదోయ్ అన్నాను.

అతగాడు ' మా ఓనరు ఒప్పుకోవడం లేదు సార్ నేను ఈ వేలితోనే సాంబారు కలుపుతాను కదా, ఒరే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సాంబారు రుచి తగ్గి మన హోటల్ కి ఎవరూ రారు అని నన్ను ఆపేస్తున్నాడండీ.'అన్నాడే.

ఏమైనా నువ్వుకూడా ఆ జెట్ట గాడి సాంబారు రుచి చూడాల్సిందేనోయ్, వెళ్దామా మరి, మంచి చీర కట్టుకుని రా! త్వరగా రావాలి అంటూ ఆవిణ్ణి తొందర చేశాడు.

భార్య: ఛీ య్యాక్ , నాకొద్దు, ఉప్మా వండుకుంటా అంటూ లోపలికి పరిగెత్తింది.


ఈ సీన్ బట్టి మీకేం అర్ధమయింది? భార్య కెప్పుడూ డైరెక్ట్ గా 'నో' చెప్పగూడదు. ఆమెతోనే 'నో' చెప్పించాలి. ఇది జస్ట్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మా ట్రెయినింగ్ ప్రోగ్రామ్ సిలబస్ లో ఇలాంటి చిట్కాలు చాలానే ఉంటాయి.

కొత్తగా పెళ్ళయిన పిల్లగాళ్ళకు ఒక ట్రెయినింగ్ ఇస్తాము.

FAQ గురించి అంటే Frequent reasons for Anger & Qualms.

ఆవిడ ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి నువ్వు సుబ్బరంగా, అంట్లు, మొహం కడిగిపారేసి తలా గిలా దువ్వేసి జిడ్డు కారకుండా కూచోవాల.

ఉద్యోగం చేసే లేడీసుకు ఊరికూరికే కోపాలొస్తాయి. కూర మాడినా, పాలు పొంగినా వెంటనే మొగుడి మీద కోపమొస్తుంది. దానికి మీరు ఓవర్ రియాక్ట్ కాకూడదు. 'ఛా అంతా నా వల్లేనే' అని అంటూ సారీ చెప్పాలి. రోజు మొత్తం మీద అవసరమున్నా లేకపోయినా ఓ ప్ఫదో పన్నెండో సారీలు ఆవిడ మొహాన కొడుతూ ఉండాలి.

ఆవిడ బాస్ ఆవిణ్ణి తిడితే ఇంటికొచ్చి నిన్ను తిట్లతో వాయించేస్తది. అది ఎంతో నేచురల్. ఆవిడలా నీకు తలంటుతున్నప్పుడు, మీరేం చేస్తారో చెప్పండి

ఒకాయన: నేనూ అరుస్తాను. ఏడవలేకపోతే ఇంటో కూర్చోవచ్చుగా, ఈ గోలెందుకు అంటాను.

ఇంకొకాయన: వాడెవడో నిన్ను తిడితే నన్ను తిడతావే? నీకు మెంటలా అంటాను.

అదే తప్పు. ఆవిడ తిడుతున్నపుడు, వినయంగా మొహం పెట్టి 'అవునే, అంతా నావల్లే' అనాలి. , తిట్టు తిట్టుకీ 'అంతా నావల్లే' అంటూ ఉండాలి. ఆ మాట తప్పని సరి.

ఒక్కో సారి పెళ్ళానికి అనుమానమొస్తుంది, నువ్వేంటీ అంతా నావల్లే అంటున్నావు, ఎటకారమా అని అడుగుతుంది. అప్పుడు ఇంకా నంగిగా, మహారాణిలా నెత్తిన బెట్టుకుని చూసుకోవాల్సిన వాణ్ణి, నీతో ఉద్యోగం చేయిస్తున్నాను. దౌర్భాగ్యుణ్ణి, దగుల్బాజీని, అంటూ నోటికొచ్చిన తిట్లు తిట్టేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆవిడ చల్లబడి ఊర్కోండి, బంగారం లాంటి మిమ్మల్ని అనవసరం గా తిట్టాను అని లోపలికెళ్ళి టీ తీసుకొస్తుంది.

ఇప్పుడేం చేస్తారు.

''టీ తాగుతాం''

టీ కోసం అలా ఎగబడకూడదు. ఆవిడ టీ తీసుకొచ్చేసరికి మీరింకా సెల్ఫ్ పిటీ ఎక్స్ప్రెషన్ చెదరనివ్వకుండా మెయిన్ టెయిన్ చెయ్యాలి. ఆవిడ బతిమలాడిన తర్వాత,  టీ వేస్ట్ అవుతుందని తాగుతున్నానే, నేనెంత వేస్టుగాడినే అని చివరి సారి తిట్టుకోవాలి.

చేతి వాటం ఉన్న ఒక భార్య ఉందనుకోండీ ఆమె ఎప్పుడో ఓసారి చెయ్యి విసురుతుంది. మీకు కంటి దగ్గరో చెంప మీదో నల్లబడుతుందీ. ఇవ్వన్నీ చాలా సహజం. దెబ్బ తగలగానే ఫ్రెండుకో, కజిన్ కో ఫోన్ చేసి శోకాలు తీయకూడదు. ఈ దెబ్బను మీరు కాష్ చేసుకోవాలి. అసలు ఇలా ఒక దెబ్బ తగిందంటే చాలు , ఆవిడ అడ్డంగా దొరికి పోయినట్లే.

ఆ దెబ్బ ముందు ఎర్ర బడి, తర్వాత పచ్చబడి, నల్లబడి నాల్రోజుల్లో మాయమైపోతుంది.

అది ఎక్కువ రోజులు నిలబడేందుకు క్రీములు రాసుకోవాలి , ఊళ్ళో అందరికీ కనిపించేట్లు మేకప్ చేసుకోవాలి . ఇంట్లో ఉన్నపుడు ఆ దెబ్బకు కాపడం వేసుకుంటూ, ముక్కుతూ మూలుగుతూ ఆమె గిల్టీ ఫీలింగ్ ను పెంచి పెద్ద చేసి ఆవిడను మానసికంగా దెబ్బ దీయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి.

తర్వాత మన పానెల్ లో ఉన్న డాక్టర్ దగ్గరకు ఆవిడతో కలిసి వెళ్లాలి. అక్కడున్న ట్రెయిన్డ్ డాక్టర్

"అబ్బబ్బబ్బ, ఏం దెబ్బ, ఎంత గొప్పగా ఉందీ, నా సర్వీసులో ఇలాంటి దెబ్బ చూట్టం ఇదే ఓం ప్రధమం . ఏవిటయ్యా, ప్రత్యర్ధులు బాంబులేశారా?” అని అతను దెబ్బను కీర్తిస్తాడు.

"ఇది గ్రీవియస్ ఇంజురీ కేటగిరీ కింద వస్తుంది, కొట్టిన వాడికి ఓ పదేళ్ళబాటు జైలు శిక్ష, పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, చూడండమ్మా, మీరెళ్ళి ఆ కొట్టిన వాడి మీద కంప్లైంట్ ఇచ్చిరండి నేనింతలోకి ఈయనకు వైద్యం చేస్తాను. అంటూ ఆవిణ్ణి కార్నర్ చేస్తాడు.”


ఇక మానసిక హింస కొస్తే కొంత మంది భార్యలు చస్తాను, చస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు.

అసలావిడకు కా ఛాన్స్ ఇవ్వకూడదు. అదెలాగో మీరు కోర్స్ లో చేరిన తర్వాత నేర్పుతాము. అలాంటి ఉపద్రవం ఎదురవుతుందీ అని అనుకుంటే చాలు, ఆవిడ కన్నా ముందు మేడ మీదకు, మీరే పరిగెత్తాలి . "సుభద్ర ఆంటీ, వెంకాయమ్మత్తా, పైనుండి దూకడానికెళ్తున్నా, మా ఆవిడ జాగ్రత్త," అని అరుస్తూ మేడ మీదికి పరిగెత్తాలి. అప్పుడు ఆవిడ మీవెంటే పరిగెత్తుకొంటూ వచ్చి మిమ్మల్ని ఆపి కిందకు లాక్కెళ్ళి ఉడుకు అన్నంలో ఇంత చింతకాయ పచ్చడేసి వేడి నెయ్యేసి అన్నం కలిపి పెడుతుంది.

ఒక వేళ ఆపక పోతే

నోర్మూసుకుని కిందకు దిగి రావాలి. నువ్వూ నేనూ కలిసే దూకుదాము రావే అని పేచీ పెట్టాలి.


ఆవిడ చీరల షాపింగ్ కు వెళ్దామంటుంది. మనకు ఇష్టముండదు. పెళ్ళాం చీరల షాపింగ్ కు సంతోషం గా ఒప్పుకుని వెంట బెట్టుకుని షాపింగ్ చేయించే వాడు భూమ్మీద ఇంకా పుట్టలేదు. ఇక ముందు పుట్టడు.

ఆ సమస్యను ఎలా డీల్ చేస్తున్నాడో ఈ గోల్డ్ మెడలిస్ట్ ఒక సారి చూడండి. ఇంకో వీడియో ప్లే చేశాడు.

"చీరలు కొనాలా, అరెరె, సారీనే, ఏవిటింత మూర్ఖుడిలా తయారవుతున్నాను ఈమధ్య, ఛా....”

"ఏమయిందండీ?”

"అదేనే, నువ్వు చీరలు కొనాలని నోరు తెరిచి అడిగేవరకూ తీసుకొచ్చాను, ఏమిటోనే నువ్వు కాబట్టి నాతో వేగుతున్నావు, ఇంకెవరైనా అయితే ... ఈ పాటికి నన్ను చీల్చి చెండాడేది.”

"సర్లే ఓవర్ ఏక్షన్ చాలు గానీ బయల్దేరు..”

"ఒక్క నిముషం, సి సి లు తెస్తాను. నాలుగైదు కార్డులు బయటకు తీసి, అబ్బే దీని లిమిట్ ఒఠ్ఠి యాభైవేలే పనికి రాదు, ఈ కార్డేమో పనికిమాలింది వైట్ మనీ కార్డ్ ఇన్ కమ్ టాక్స్ మొగుడికి లెక్క జెప్పాలి, ఈ కార్డ్ స్వీప్ చేస్తే అప్పుడప్పుడు పని చేసి చావదు. సరే నువ్వు రెడీ అవు, అలాగే నుంచున్నావే?"అని భార్యతో చెప్పాడు.

ఆమె తయారయి వచ్చి పక్కనే నిల్చుంది. అది చూడనట్లు, "ఏమోయ్ మోహన్ అర్జెంటుగా ఓ లక్షో రెండో హేండ్ లోన్ సర్దవోయ్, తొందర్లోనే తీర్చేస్తాను. ఏవిటీ? మొన్న తీసుకున్న అమౌంటా, ఇస్తాలేవోయ్, ఏమైనా ఊరొదిలి పోతున్నానా నీ దుంప తెగా, మనిషన్న తర్వాత నమ్మకముండాలోయ్. ఒకె ఒకె"

"సుబ్బారావూ, ఓ చిన్న ఎమెర్జెన్సీ నువ్వు తప్ప ఇంకెవరూ హెల్ప్ చెయ్యలేరు. ఏంటీ వేరే ఊళ్ళో ఉన్నావా, అరెరె..”

ఇంట్లో హాల్లో చాలా కంగారుగా తిరుగుతూ మాట్లాడుతున్నాడు.

ఇంకో నంబరు ట్రై చేశాడు. "ఛా నో ఆన్సర్" అనుకుంటూ, సోఫాలో కూల బడ్డాడు.

భార్య వచ్చి అతని పక్కనే కూర్చుంది. ఏమయ్యిందండీ

కళ్ళు మూసుకుని, కనుబొమల మధ్య భాగాన్ని రెండు వేళ్ళతో నలుపుతూ ఏమీ లేదన్నట్టు అడ్డంగా తలూపాడు.

"ఒక పని చేస్తానే, మీ అన్న దగ్గర పదిరూపాయల వడ్డీకి ఓ రెండు లక్షలు చేబదులు తీసుకుంటాను. మీ అన్నకు నంబరు కలుపు" అంటూ చావుకు తెగించిన వాడిలా లేచాడు.

"చీర కోసం లక్షలూ కోట్లూ ఎందుకండీ?”

"పదివేల చీరలో తప్ప అణాకానీ చీరల్లో నేను నిన్ను చూడలేనే. అది నా బలహీనత. పదివేల చొప్పున, నాలుగు చీరలు కొన్నా, నలభై వేలు మరి దానికి మేచింగ్ నగలు, బేగులూ, చెప్పులూ, చేంతాడూ అంటే మినిమమ్ ఒక లక్ష. పెళ్ళానికి ముచ్చటగా నాలుగు చీరలు కొనలేని వాణ్ణి అనేగా , నువ్వుకూడా నన్ను చేతకానివాడి కింద కట్టేసినట్టేగా? "  ఆవిడ మీదకు ఎదురు దాడికి తెగబడ్డాడు.

ఇక భార్యకు పూనకం వచ్చింది. "మీకేమైనా మతిపోయిందా, ఇప్పుడు చీరలు కొనకపోతే ఛస్తామా, సరే లెండి, నేనడిగానంటే చాలు బంగారు లేడి కోసం బజారెళ్ళేరకం మీరు.”

అదికాదే, అడక్కడక్క చీర అడిగావు అది కూడా తీర్చలేని సన్నాసిని ..

వీడియో ఆపు చేశాడు ఇన్ స్ట్రక్టర్. అర్ధమయిందికదా ఇక ఇక్కణ్ణుంచి, సెల్ఫ్ పిటీ తిట్లకు లంకించుకోవాలి.

ఇలా ట్రెయినింగ్ ప్రోగ్రామ్ కాకుండా, కష్టమర్ ప్రొటెక్షన్ కార్డులు ప్రవేశ పెట్టాం.

ఇవి ఉపయోగించడానికి వీలుగా 24 గంటలూ మా ఆన్ లైన్ సర్వీస్ టీమ్ అందుబాటులో ఉంటుంది.

బ్లూ కార్డ్ అంటే కొత్తగా పెళ్ళయిన మగ వాళ్ల కోసం. మూడు నెలల ట్రెయినింగ్ తర్వాత ఆరు నెలల కష్టమర్ సర్వీస్ ఫ్రీ

గ్రీన్ కార్డ్ ఒక మాదిరి హింస పడే భర్తల కోసం ( వెర్బల్ తిట్లు, సాధింపు, బెదిరింపు వగైరాలు) ఆరునెలల ట్రెయినింగ్ మరియు సంవత్సరం పాటు కవరేజ్

ఆరెంజ్ కార్డ్ రెటైర్ అయిన సభ్యుల కోసం. సర్వీసెస్ ఫ్రీ , కానీ వీరికున్న అనుభవం దృష్ట్యా, నెలకొకసారి వీరు ట్రెయినింగ్ వాలంటీర్స్ గా పనిచేయాలి.

రెడ్ కార్డ్ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న కార్డు. ఇది పొందాలంటే, ఒక ఎమ్మెల్యే, ఒక డాక్టర్, ఒక పోలీస్ ఆఫీస్ ఆఫీసర్ సంతకాలు తప్పని సరి. కనీసం రెండు సార్లు సీరియస్ దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైన రికార్డ్ కలిగి ఉండాలి.

ఇక ట్రెయినింగ్, కార్డుల ఫీజు వివరాలు మా గౌరవాధ్యక్షుడు శ్రీ సుబ్రహ్మణ్యం గారిని సంప్రదించండి.
ఏ సుబ్రహ్మణ్యం గారంటారా?  ఆయన ఇంటి పేరు చాలా పాపులర్ అండీ బాబూ.

42 comments:

KumarN చెప్పారు...

ఆవిడ చీరల షాపింగ్ కు వెళ్దామంటుంది. మనకు ఇష్టముండదు. పెళ్ళాం చీరల షాపింగ్ కు సంతోషం గా ఒప్పుకుని వెంట బెట్టుకుని షాపింగ్ చేయించే వాడు భూమ్మీద ఇంకా పుట్టలేదు.
____

Your Honor, I object!! There are some.

పోతే పోస్ట్ బాగుంది అనుకోండి. బట్ మీ సిన్మా రివ్యూ పోస్ట్ మాత్రం అల్టిమేట్. I know it's unfair to compare, but just so you know... :-)

అజ్ఞాత చెప్పారు...

Super

Sravya Vattikuti చెప్పారు...

ఉండండి మీకు పోటీ గా AIIWS పెట్టి ఇంతకన్నా గట్టి ట్రైనింగ్ ఇస్తాం (j/k) :)))
Superb post !

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆ సుబ్రహ్మణ్యం ని గౌరవాధ్యక్షుడు అన్నారు. జాగ్రత్త. ఆయన ఫీజులు అవి దొరికినంత నొక్కేయగలడు. ఆయన కూడా పెళ్ళానికి రెండు చీరలు కొనాలి గదా.

టపా బ్రహ్మాండం గా ఉంది. మీ సంఘానికి అభినందనలు.

మధురవాణి చెప్పారు...

:))))))))

Chandu S చెప్పారు...

@ KumarN

'I object' అంటూ అరిస్తే కాదు. ఆ యుగపురుషుడెవరో ఇంటావిడ ఇచ్చిన ధృవీకరణ పత్రంతో వస్తే ఈ వేదిక మీదే సన్మానం మరియూ వీలైతే విగ్రహ ప్రతిష్ట కూడా.

Thanks for reading and for the comment

Chandu S చెప్పారు...

కష్టే ఫలే శర్మగారూ
ధన్యవాదాలు

మనసు పలికే చెప్పారు...

శ్రావ్య గారి AIIWS లోనే నేను చేరి, మీకు ఇంకాస్త గట్టి పోటీ ఇద్దామని డిసైడ్ అయ్యాను :D
ఆ ప్రద్యుమ్నుల వారిని కూడా నేనెరుగుదును ;).. ప్రభావతి గారిని మా సంఘానికి గౌరవాధ్యక్షులుగా నియమించాలని శ్రావ్య గారిని సవినయంగా మనవి చేసుకుంటున్నాను;)

టపా మాత్రం సూపరంతే:):)

Chandu S చెప్పారు...

@ శ్రావ్య
నా మీద పోటీగా పెట్టిన మీ సంస్థ పైకి రావాలని నిజంగానే కోరుకుంటున్నాను., మనిద్దరినీ కూర్చోబెట్టి ఏదో ఒక టివి చానెల్ వాడు చక్కటి పనికిమాలిన చర్చ బెడితే ...

అంతకన్నా కావలిసిందేముందీ?

Thanks

Chandu S చెప్పారు...

@ మాష్టారూ,

మీరొప్పుకున్నారు సంస్థ కదే పదివేలు.

చీరలు రెండేనా మరీనూ, నాలుగన్నా కొనాలి మీరు.
ధన్యవాదాలు

Chandu S చెప్పారు...

@ మధురవాణి

Thanks

sathya murthy చెప్పారు...

టపా చాలా బావుంది- మ ఆవిడ రికమెండ్ చేసి మరి చదివించింది - సత్యమూర్తి

Chandu S చెప్పారు...

అమ్మాయిలూ మిమ్మల్ని చూసి (జాలిగా) నవ్వుకోకుండా ఉండలేక పోతున్నాను. ఏమనుకోకండి. మేము వర్క్ షాపులో రిలీజ్ చ్
చేసినవి జస్ట్ 1 % మాత్రమే. మరి మీకో, ఒక గైడ్ లైన్స్ లేవు, స్ట్రాటజీలు లేవు, ఇన్ఫ్రా స్ట్రక్చర్ లేదు, స్టాఫ్ లేరు. ఏవిటో ఇప్పటికిప్పుడు కూర్చుని గట్టిపోటీ గట్టిపోటీ అనుకుని సంతోష పడుతున్నారు. కానివ్వండి మీ సంతోషం నేనెందుకు కాదనాలి. (J/K)

అపర్ణ గారూ
థాంక్స్

SHANKAR.S చెప్పారు...

"చీరలు రెండేనా మరీనూ, నాలుగన్నా కొనాలి మీరు."

మరే రెండు ఇంట్లోకి, రెండు ఇలియానాకి. గురూజీ లెక్క కరెక్టేనా? :))

SHANKAR.S చెప్పారు...

ఈ ఆదర్శమ్మ గారిని సంప్రదించడానికి ఏమన్నా నంబర్ ఉందాండీ? మా అ.భా.అ.భ.ఐ.కా.స (అఖిల భారత అమాయక భర్తల ఐక్య కార్యాచరణ సమితి) సభ్యులకి గెస్ట్ లెక్చర్లూ గట్రా ఇవ్వడానికి ఆహ్వానిద్దామనుకుంటున్నాం.

సాయి చెప్పారు...

bagundi...

Chandu S చెప్పారు...

సత్యమూర్తిగారూ,

ధన్యవాదాలు.

మేడం గారికి ప్రత్యేకంగా థాంక్స్ అందజేయండి. ఇంతకూ ఎవరో.....

Chandu S చెప్పారు...

@ SHANKAR.S,

ధన్యవాదాలు.


మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఆదర్శమ్మ ప్రస్తుతానికి ఉద్యోగం వెలగబెడుతూ, తోచనప్పుడు బ్లాగు రాసుకుంటుంటారండీ. మరి ఏవంటారో..గెస్ట్ లెక్చర్లంటే..

Chandu S చెప్పారు...

@ సాయి
Thanks

KumarN చెప్పారు...

హ హ మరదే, విగ్రహప్రతిష్టలూ, సన్మానాలూ చేసి మా అ.భా.అ.భ.ఐ.కా.స మెంబర్స్ కి నన్ను పట్టిద్దామనే.. అలాంటివేవి పబ్లిక్ చేయనంటే ప్రొడ్యూస్ చేస్తాను, ధృవీకరణ పత్రాలేం ఖర్మ, లైవ్ విట్నెస్ లతో సహా...:-)

బొందలపాటి చెప్పారు...

ఇంతకుముందు అన్నా వదినా, ఇతర టపాలలో మామూలు దర్శనమిస్తే, ఈ టపా తో విశ్వరూపం చూపించారు. ఇతనొకడు, కామెడీ పానకం లో పుడక అనుకోకపోతే, "సెల్ఫ్ రిప్రోచ్" అనాలనుకొంటా!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇలియానా చీరలు కడితే ఆవిడ వెనకాల నేనెందుకు పడతాను.
ఎలిమెంటరీ మై డియర్ వాట్సన్........... దహా.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గారూ,

గురువుకి పంగనామాలు పెట్టడం అంటే ఇదే............... దహా .

Sravya Vattikuti చెప్పారు...

భలే వారు శైలజ గారు ఇన్స్టాంట్ యుగం లో గైడ్ లైన్స్ , స్ట్రాటజీలు , ఇన్ఫ్రా స్ట్రక్చర్ , స్టాఫ్ ఇయ్యన్నీ కావాలా ఏంటి ? కావాలంటే మీ AIIMS కి ఔట్సొర్సింగ్ కి ఇచ్చి పని నడిపిస్తాం :))

Sravya Vattikuti చెప్పారు...

ha ha :)

Chandu S చెప్పారు...

self-reproach?
ఎంత మాటన్నారండీ. సరే కానీయండి పడ్డ వాళ్ళెప్పుడూ చెడ్డవాళ్ళు కాదన్న సామెత గుర్తు తెచ్చుకొని కుదుట పడుతున్నాను ప్రస్తుతానికి.
కామెడీలు ఇంట్లో వాళ్ళ కోసం. వీటికి పెద్ద టైమ్ పట్టదు. నాకు నచ్చేవి మాత్రం సీరియస్ అండ్ ట్రాజెడీ కథలే. అవి రాయడానికి టైమ్ కుదరడం లేదు.

Chandu S చెప్పారు...

ఆదర్శమ్మ: సెక్రెట్రీ, ఎవరయ్యా ఈ కుమార్ ఎన్. నేను చెప్పిన ఫండమెంటల్స్ నే ప్రశ్నిస్తున్నాడు.లైవ్ విట్నెస్ తీసుకొస్తానంటాడేవిటీ? నాకేం నచ్చలేదయ్యా ఇతగాడి వ్యవహారం.

సెక్రెట్రీ: మీరు పెద్దగా డిస్టర్బ్ అవ్వొద్దమ్మా, ఆయన అ.భా.భా.వి సం. ప్రెసిడెంట్. పొద్దున్న లేస్తే చాలు కుమారమ్మగారిని వెంటేసుకుని, బొందన బ్రదర్స్ చుట్టూ, కనిష్క్ జ్యూయెలర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు.

అ.భా.భా.వి సం.???

SHANKAR.S చెప్పారు...

అఖిల భారత భార్యా విధేయుల సంఘం వాళ్లకి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందండీ. అది మా అ.భా.అ.భా ఐ.కా.స కు అనుబంధ సంస్థ.

KumarN చెప్పారు...

ఆదర్శమ్మ గారూ,
మేం లాల్ సలాం బాచ్ లెండి. ప్రశ్నిస్తూ ఉండమని మార్క్స్ చెప్పాడు మాకు.
మరే, మా మగవాళ్ళందరినీ, మీరు ఒక్క సింగిల్ స్ట్రోక్ తో అలా చీపిరి తో ఊడ్చేస్తే, రోజూ చేసే వెట్టిచాకిరికి కనీసభత్యం ఎలాగూ దొరకట్లేదు, కనీసగుర్తింపు కోసమయినా పోరాడమని, "మాస్ దోపీడీల్" అనే గ్రంధం లో లిఖించబడి యున్నది.ఇలా గోబెల్స్ ప్రచారాలు చేసినప్పుడు, పోరాడితే పోయేదేమీ లేదు, పెళ్ళాం తప్ప అన్నారు పెద్దలు, అంతకన్నానా అని ఆది నుంచి మేం పోరాడుతూనే ఉన్నాం. రిజల్ట్స్ రావడానికి కొంచెం టైమ్ పడుతుందిట :-))

ఇన్క్విలాబ్ జిందాబాద్.

(హబ్బే, జ్యూయెలర్సా అంటే ఏమిటండీ??!!. ఏదో చీరల షాపింగ్ అంటే కాస్త కట్టుకొని చూపించేవాళ్ళుంటారు కాబట్టి, వెళ్ళొచ్చు కానీ, నగల గొడవ మనకెందుకు చెప్పండి :-) షాప్ దగ్గిర దింపేసి ఫ్రెండ్స్ దగ్గిరకెళ్ళిపోవటమే)

రాజ్ కుమార్ చెప్పారు...

కేక.. సూపరో సూపరు.. అదిరిపోయే వీడియోలు చూపించేరు..
ఈ ప్లాన్ లన్నీ ఇంప్లిమెంట్ చెయ్యాలేమో భవిష్యత్ లో.. ;)

నువ్వూ నేనూ కలిసే దూకుదాము రావే అని పేచీ పెట్టాలి... పైకి తీసుకెళ్ళి తోసేసి వచ్చెయ్యాలి ;);)

Zilebi చెప్పారు...

ఇక్కడ ఏదో అదేదో బాధితుల కి ట్రీట్మెంటు డాక్టరు గారు చేస్తున్నట్టు ఉన్నారు.
బాధితులు బాధలు ఇంతింత గాదయా సుబ్రహ్మణ్యా !

అటు నేనే ఇటు నేనే
ఆకు ముళ్ళు పైబడ్డ, ముళ్ళు ఆకు పై బడ్డ
అన్నీ గోవిందా యే నే!!

చీర్స్
జిలేబి.

ఆ.సౌమ్య చెప్పారు...

అబ్బో AIIMS, AIIWS...రెండూ తయ్యారయ్యాయే...వీటి మధ్య గొడవలొస్తే సంధి కుదర్చడానికి ఒక ఐ.రా.స కావలి కదూ. అని నేను పెడతాను. నాలాంటి సౌమ్యులకే అందులో ప్రవేశం. నా అంత సౌమ్యులెవరున్నారో చేతులెత్తండి బాబూ వారికి జనరల్ సెక్రటరీ, కార్యదర్శి లాంటి పదవులు ఉచితం...ఫ్రీ.

As usual hilarious post :)

Chandu S చెప్పారు...

సెక్రెట్రీ, శ్రావ్య ఏంటీ మనకే ఎదో ఔట్స్ సోర్సింగ్ చేస్తానంటుందీ, అంటే ఏంటయ్యా?

సెక్రెట్రీ: అమ్మా మీదో పాతకాలపు గోల. కంప్యూటర్ ఆన్ చెయ్యమంటే గాస్ లైటర్ తెచ్చే రకం. సాఫ్ట్ వేర్ వాళ్ళతో వద్దంటే వినరు, అదీ శ్రావ్య గారితో మీకెందుకు పోటీ. నా మాటిని ఆవిడ కామెంటుకు రిప్లై ఇవ్వకుండా దాక్కోండి.

Chandu S చెప్పారు...

'పైకి తీసుకెళ్ళి తోసేసి వచ్చెయ్యాలి ;);)"

ఇక పిల్ల దొరికినట్టే!

Chandu S చెప్పారు...

జిలేబి గారూ, ఇప్పుడే సెక్రెట్రీని 'ముఫ్ఫై రోజుల్లో జిలేబి భాష' పుస్తకం కొనుక్కు రమ్మని పంపించాను .

అది రాగానే చదివి, ఆ తర్వాత ఇక్కడ రిప్లై రాస్తాను..

ధన్యవాదాలు

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హాయిగా నవ్వించారు :-)

naimisha yenduri చెప్పారు...

sailaja garu chaala baaga navvincharu.mee rachana saili bagundi.meelo inta humor vundani nenu anukoledu sumi.congrats.

అజ్ఞాత చెప్పారు...

పెళ్ళాన్ని ప్రేమగా చీరలు కొనడానికి తీసుకెళ్ళే మగాడు ఇంత వరకూ భూమ్మీద పుట్టలేదా ? అడ్డెడ్డే ఈ ఖటోర సత్యం తెలీక ఇన్నాళ్ళూ " మీరొక్కరే ఇలా " అంటూ ఆయన్ని సాధించు తిన్నానే .....హే భగవాన్ నా పాపానికి నిష్కృతి లేదూ లేదూ లేదు .

Chandu S చెప్పారు...

" ఖటోర సత్యం"
ఈ ఒక్క మాట నన్ను బాగా నవ్వించింది. మీ కామెంట్ మళ్ళీ మళ్ళీ చదివాను.

నవ్వించడానికి వెయ్యి పోస్టులేల? లలిత గారి ఒక్క కామెంటు చాలు
Thanks

Chandu S చెప్పారు...

డా. శైలజ గారూ, బాగున్నారా, మీకు అనుమానం రావడం సహజం.హ్యూమర్ అంతా కాగితం మీదే లెండి. thank you

ఇది చదివే వాళ్ళకు: ఆవిడ పేరు తో ఆవిడే కామెంటు రాసుకుని ఆవిడే రిప్లైలు రాసుకుందేవిటో అనుకోవద్దు. పై కామెంటు వ్రాసినది నా డాక్టర్ ఫ్రెండ్. ఇద్దరివి ఒకే పేర్లు.

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ,
Thank you

Chandu S చెప్పారు...

అ. సౌమ్య అంత సౌమ్యులెవరూ లేరు సౌమ్యా.

మీకేదైనా గౌరవ కార్యదర్శి పదవి మా AIIMS లో నే ఇస్తాము వచ్చేయండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి