16, ఫిబ్రవరి 2012, గురువారం

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు     బ్లాగు పెట్టక ముందు నా మేక్ లో ఉన్న ఐ వెబ్ అప్లికేషన్ సహాయం తో నాకు తోచినట్టు ఏదో సొంత వెబ్ తయారు చేసి, బుర్రలో చెత్త దాంట్లో పడేసేదాన్ని. దాన్ని  నేను మాత్రమే చదువుకుంటూ గడిపే రోజుల్లో ఒక కామెంట్ వచ్చింది.
భలేగా వ్రాస్తున్నారు మాష్టారూ. చాలా బాగుంది మీ స్టైల్, వ్రాసే విషయాలు. ప్రతిచోటా హాస్యం తోణికిసలాడుతున్నది.

మీరు కొత్త వ్యాసం వ్రాసినప్పుదల్లా ఆసక్తి గలవారికి మెయిలు వచ్చెట్టుగా చేసే ఏర్పాడు విడ్జెట్ మీ బ్లాగులో ఉంచండి.

Sunday, June 12, 2011 - 07:59 PM

కామెంట్ కొంచెం వుత్సాహం నింపింది. ఒహో మనం రాసినవి ఎవరో ఒకరు చదివారని, చెప్పొద్దూ సంతోషం వేసింది. అంతే కాదు తన బ్లాగులో ఒక పరిచయం కూడా ఇచ్చారు. భలే బ్లాగు  అనే పేరుతో. (తర్వాత ఎప్పుడో చెప్పాను, నేను ఆయన కాదు సార్, ఆవిడను అని.)

తర్వాత నా రచనలను బ్లాగర్ లో పెట్టమని, కూడలిని పరిచయం చేశారు


ఈ రోజు శివరామ ప్రసాదు కప్పగంతు గారి పెద్దబ్బాయి చిరంజీవి శ్రీనివాస ప్రసాదు పెళ్ళి.(16.02.2012 తెల్లవారుఝాము 03.56 (తెల్లవారితే 17 02 2012) 
వివాహ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మరియు  కొత్త జంట వైవాహిక జీవితం ఆనందమయం కావాలని  కోరుకుంటూ

చందు శైలజ


4 comments:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

శ్రీనివాస ప్రసాదు గారికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు :) వారి భావిజీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను.

KumarN చెప్పారు...

I have high respect for Sivaramaprasad Kappagantu gaaru.
Wish his son, a happy married life!

Sravya Vattikuti చెప్పారు...

Congratulations to the groom and best wishes to the bride !

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

శైలజ గారూ. ఇప్పుడే, మీరు విన్నూత్నంగా అందించిన శుభాకాంక్షలు చూశాను. ధన్యవాదాలు.

స్పందించి వారి శుభాకాంక్షలు తెలిపిన వేణూ శ్రీకాంత్, కుమార్, శ్రవ్యలకు ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి