19, నవంబర్ 2012, సోమవారం

నిన్ను నిన్నుగా.....4


ఒకరి గురించి ఒకరికి గొప్ప గా చెప్తున్నాడు విజయ్.

అతనెప్పుడు వెళ్తాడా అని ఒకరికి తెలియకుండా ఒకరు ఎదురు చూశారుఅతను వెళ్ళగానే

"మీరు బాగా మారిపోయారుగొంతు కూడా మారిపోయింది." అంది అనూ

ఆమెకు చిన్ననాటి తగువులు గుర్తొచ్చాయిసిగ్గుతోబాటు చిన్ననవ్వు కూడా వచ్చింది.

"మీరు కూడాఅన్నాడు.

"మరి మీరెలా గుర్తు పట్టారు?" అడిగింది

ఉమన్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డ్ వచ్చినపుడు మేగజైన్ లో చూశానుపేరు చూడగానే మీరే గుర్తొచ్చారుమిగతా వివరాలు కూడా చదివి పోల్చుకున్నాను.”

"మరి ఎప్పుడూ కాంటాక్ట్ చెయ్యలేదేమాష్టారెలా ఉన్నారునేను గుర్తున్నానా మాష్టారికిఅడిగింది

"నాన్న మిమ్మల్ని మర్చిపోవడమామీగురించి ఎన్నో సార్లు అనుకుంటుంటారు.”

చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడున్నారో మాట్లాడుకున్నారు.

"ఆ మధ్యన మన ఊరెళ్ళానుఊరంతా మారిపోయిందిమన వాళ్ళెవరూ లేరు.”

"మనవాళ్ళంటే ..”

"మనతో చదువుకున్నవాళ్ళు"

'వరలక్ష్మికోసం వెళ్ళి ఉంటాడోయ్అంటూ మనసు కోతి నిప్పు అంటించింది.

"వరలక్ష్మి కనిపించలేదా?”

"లేదు.”

అతనికి పెళ్ళయిఉండిఉంటుందా అన్న అనుమానం వచ్చిందిఆ ప్రశ్న ఎలా అడగాలో అని ఆలోచించి ఓ నిముషం తర్వాత

"పిల్లలేం చేస్తున్నారు?"అడిగింది.

ఏ పిల్లలు ?”

మీ పిల్లలే "

"ఇంకా పెళ్ళి చేసుకోలేదు.”

"ఏంవరలక్ష్మి కనిపించలేదని పెళ్ళిమానేశారా? “

ఊరుకోండిప్లీజ్నవ్వాడు.

"మీరేకదా ఊరు వెళ్ళిమరీ వెతికారుపాపం దానికోసం పెళ్ళిమానుకుని కూర్చున్నారేమోనని” కొంచం సేపు ఆగి

దానికి పెళ్ళయిపోయిందిపిల్లలు కూడామా పెదనాన్నగారి అబ్బాయినే చేసుకుంది.” వివరాలు చెప్పి అతని రియాక్షన్ ఎలా ఉందోనని ముఖం లోకి చూసింది..


"మీతో కష్టమేమీరేనా ఇలా మాట్లాడుతోందీ”


తనలా మాట్లాడుతున్నందుకు ఆమెక్కూడా ఆశ్చర్యంగా ఉంది.

మీరు నాతో మాట్లాడతారో లేదోనని పలకరించడానికి భయపడ్డాను.”

ఏం ఎందుకు మాట్లాడను?”

చిన్నప్పటి కోపం ఇంకా ఉంటుందనుకున్నాను.”

"కోపం లేదని ఎవరన్నారు.మీ మీద కోపం ఎప్పటికీ తగ్గదు.”


అతిథులందరూ ఒక్కరొకరే వెళ్ళిపోతున్నారు.

అంత తొందరగా విడిపోవాలని ఇద్దరికీ లేదువెళ్ళక తప్పేట్టూ లేదు.


"అనూచిన్నప్పుడు కొన్ని సార్లు నొప్పించి ఉంటానుఏమైనా నాకు తెలిసి చెయ్యలేదుమనసులో ఉంచుకోవద్దు.”రెండుగంటలనుండీ మాట్లాడుతున్నాగానీఒక్కసారి కూడా ముఖద్వారం లో ఆమెకట్టిన హెచ్చరిక గంటల్ని ముట్టుకోక పోగావెనకవేపునుండి వచ్చి తాకుతున్నాడే ఇతనుఏవో హద్దుల గీతలు చెరుపుతున్నాడుమళ్ళీ ఏ తప్పూ చెయ్యలేదని బుకాయిస్తున్నాడు.

అతని నంబర్ అడిగి అలుసైపోవాలనిపించలేదు.

'అతనడగొచ్చు కదా '

"వెళ్తాను అనూఅని ఆమె జవాబు కోసం చూస్తున్నాడు.

ఆమెకు అతని మీద చిన్నప్పడు మాదిరిగా కోపం వచ్చిందిలోలోపల చికాకు పడుతూ ఉండగా ఆమె మొబైల్ మోగిందితల్లి చేసింది.

"ఏవిటీ లేటయ్యిందీఅంటూ కంగారు పడుతోంది

"అమ్మా వచ్చేస్తున్నానుమురళి వస్తే మాట్లాడుతున్నానుఅని విషయం చెప్పింది.

"మురళిమన మురళేనా అంటూ "ఆవిడ ఒక్క సారిగా ఉక్కిరిబిక్కిరి అయింది.

మాట్లాడతాను ఫోనివ్వమంది.

ఫోన్ అతనికిచ్చి "అమ్మమాట్లాడతానంటోంది.”

ఆవిడ ఇంటికి రమ్మంటుందేమో "ఇంత రాత్రి మీకిబ్బందితర్వాతెప్పుడైనా వస్తానుఅంటూ మొహమాటపడుతున్నాడు

ఫోన్ అనూకివ్వమంది. "మురళిని ఇంటికి తీసుకురా .ఈ వూరొచ్చి మనింటికి రాకుండా ఎలా?” అని "ఇంకో మాటఅబ్బాయిని నీ మాటలతో చిన్నబుచ్చకుఅంది.

ప్రపంచం లోని అబ్బాయిలందర్నీ చిన్నబుచ్చడమేనా తన పని

అమ్మ రమ్మంటుంది. "

 ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తల్లీ తండ్రీ అతన్ని తమిద్దరి మధ్యా కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెప్పారుకొన్నేళ్ళ క్రితం వాళ్ళకుటుంబంతో ఉన్న అనుబంధం గుర్తు తెచ్చుకున్నారుఎన్నో ఏళ్ళ తర్వాత చూసినందుకుమురళీ అంత పెద్దవాడయినందుకు ఆనంద పడ్డారు.

"టెంత్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినపుడు నువ్వేమో దగ్గర లేకపోయావుఫస్ట్ వచ్చిన పిల్లాడికి నాలుగు లడ్డులైనా చేసిపెట్టలేనందుకు మనసంతా పీకిందిదానికి తోడు సెకండ్ వచ్చినందుకు ఇదేమో ఒకటే ఏడుపు.”

అమ్మ నోటికి రిమోట్ చేయించి తన దగ్గరే పెట్టుకోవాలి అనుకుంది అనూ

తనేమేమి వండి విందు చేయాలనుకుందో చెప్పింది., అవన్నీ అంతరాత్రి పూట కుదరవు గనక రవ్వ లడ్డు చేసిందిఅర్ధరాత్రి పూట ఆవిడ అభిమానంతో కలిపిన రవ్వలడ్డు ఒక్కటి కంటే తినలేకపోయాడని వెంట తీసుకెళ్ళమని పేక్ చేసి ఇచ్చింది.

     అనూ అమ్మానాన్నా బయటి వరకూ వచ్చి అతని తల్లి దండ్రులను మరీ మరీ అడిగినట్లు చెప్పమనీవాళ్లను కూడా ఒక సారి తీసుకుని రమ్మన్నారుఇంటి బయట కార్లో అనూ ఎదురుచూస్తూ ఉంది ఎయిర్ పోర్ట్ వద్ద దించడానికి .

"ఎందుకింత శ్రమ నేను ఎలాగో వెళ్ళేవాడిని కదా?”


ఎయిర్ పోర్ట్ కెళ్ళే దారిలోపెద్దగా ఏం మాట్లాడుకోలేదు.

"ఎప్పుడొస్తున్నారు అక్కడికిఅడిగాడు.

తొందర్లోనేకాన్ఫరెన్స్ పనులున్నాయి.”

"నాన్నగారికి నా నంబర్ ఇచ్చానుఅక్కడికి రాగానే ఫోన్ చెయ్యండి.”

వచ్చినపుడు కలుస్తాననోకలవననో ఏమీ అనలేదు.

"మళ్ళీ కలుసుకుంటాననిమాట్లాడతాననీ అనుకోలేదు అనూ. It's a memorable day for me.”

'దగ్గరకొచ్చేస్తున్నాడువార్నింగ్ బెల్స్ బాటరీలు అయిపోయినట్లున్నాయి గట్టిగా మోగకుండా గుసగుసలాడాయి.

"బై" అంటూ వెళ్ళిపోతున్నాడుఆమె అనుమతి లేకుండానే ఆమె చేయి ముందుకొచ్చిందిమురళి ఆశ్చర్యపడి చేయి చాచాడుశీతాకాలపు చలికి వణుకుతున్న ఆమె చెయ్యిఅతని వెచ్చని చేతిలో కాసేపు ఇమిడిందిస్పర్శకు శరీరం వణికింది.
****

ఆ తర్వాత తల్లి పొద్దస్తమానం మురళి గురించే మాట్లాడేది.

"ఎంత చక్కగా ఉన్నాడు మురళిఅప్పటికీఇప్పటికీ అదే నెమ్మదితనంచిన్నప్పుడు చందమామలా ఉండేవాడుఇప్పుడింకా తేలాడుబాగా పొడుగయ్యాడు. ”

"చామన చాయగా ఉన్నవాళ్ళను చందమామ అంటారా?" తల్లినడిగింది.

"నీ వెటకారానికేమిలేచక్కగా ఉన్నాడు .బుద్ధిమంతుడు.”

"నీకు నచ్చని మగపిల్లలెవరన్నా ఉన్నారా?” అంది అనూ

"ఎవరూ నచ్చకపోడానికి నాకేం చదువా పెద్ద ఉద్యోగమా?” చురకంటించింది.

ఆమె ఆలోచనలు ఎటువేపు ప్రయాణిస్తున్నాయో పసిగట్టింది.

ఇద్దరి తల్లి దండ్రులు రెండు మూడు సార్లు కలిశారుఎంతో మామూలుగా పెళ్ళిమాటలు జరిగాయి

"తల్లీనా మాట వినుచిన్నతనంలో జరిగినవేవో మనసులో పెట్టుకుని కాదనకుమురళీ అన్ని విధాలుగా మంచివాడుఎవరిని కాదన్నా నేనేమనలేదుమురళిని కూడా కాదనకు. ”బతిమలాడుతోంది అనూ వాళ్ళ అమ్మ.

ఏదోఒక రోజు ఈ మాటలు తల్లిదగ్గర్నుండి వస్తాయని అనుకుంటూనే ఉంది.

"ఇతన్ని కూడా కాదంటేతల్లిని అడిగింది

"అంటావు అందర్నీ కాదంటావునన్నేడిపించడం తప్ప నీకింకేం తెలుసు.గొప్పదాన్ననుకుంటున్నావు మరి.” అంటూ కళ్ళొత్తుకుంది.

"నేను కాదన్నానాఅన్నీ నువ్వే అనేసుకుని బాధపడతావు." అంది అనూ.

తల్లి నమ్మలేకపోయిందిఆవిడకారోజు పండుగే అయిందిమురళి లాంటి అబ్బాయి మళ్ళీ దొరుకుతాడా?

ఆమె ఆఫీసు పనిమీద వెళ్ళినపుడు ఓ సారి ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చి మాష్టారు వాళ్ళతో పెళ్ళిమాటలు మాట్లాడుకున్నారుమళ్ళీ ఇద్దరి కుటుంబాలు ఇలా వీళ్ళ పెళ్ళి తో కలిసినందుకు చాల సంతోషపడ్డారుమాష్టారు ఆనందంతో అనూ తలమీద చెయ్యి ఉంచి దీవించారు.

సరస్వతీ దేవి ఇంటికోడలుగా రాబోతుందని.

అనూ తన conference అయేంతవరకూ టైం కావాలనడం తో కొన్ని నెలల తర్వాత ముహూర్తాలు పెట్టుకుందామనుకున్నారు.

పెళ్ళి మాటలు జరిగాక రెండు మూడు సార్లు అతని ఊరు వెళ్ళినా ఇద్దరికీ పని వత్తిడి వల్ల మాట్లాడుకునే వీలు దొరక లేదుఒక రోజు మాత్రం ఆమె కాన్ఫరెన్స్ పనులకోసం ఆఫీసులో పనిచేస్తుంటే అతనొచ్చి ఆఫీసు బయటే ఎదురుచూస్తూ ఉన్నాడు.

బయటకొచ్చిందిముదురు నీలం రంగు డ్రెస్ వేసుకుందినీలం రంగు చున్నీ గాలికి సతమతమవుతుంది.

ఎంత సమర్ధురాలు, అయినా తెల్లని బుగ్గలు అంత అమాయకంగా ఉన్నాయేఆ పక్కనే నల్లని రింగుల జుట్టుకన్నార్పకుండా చూస్తున్నానని తెలిసి ఒక నిముషం తర్వాత చూపు మళ్ళించుకున్నాడు.

"ఎంత సేపయ్యింది వచ్చి లోపలికి రాలేదే?” అడిగింది

"పనిలో ఉంటారనిఇవ్వాళ ఇంటికి ఎలా అయినా తీసుకురమ్మని అమ్మానాన్నా గట్టిగా చెప్పారు. “


వాళ్ళింటిలో భోజనమైన తర్వాత ఆమెను గెస్ట్ హౌస్ కి దింపడానికి తీసుకెళ్తుండగా కార్లో పాట వస్తూ ఉంది

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకోసమే కన్నీరు నింపుటకు

ఆమె అసహనంగా కదలిందిఅతను గమనించి "పాట బాలేదాతీసేయనా?” అడిగాడు.

"పాట బాగానే ఉంది కానీ నాకు నచ్చదుఎందుకో పాత కవులకు మరీ ఆశలెక్కువప్రాక్టికాలిటీ తక్కువ అని అనిపిస్తుందిఅందమోఆస్తిపాస్తులోమంచి ఉద్యోగమో లేకపోతే ఎవరైనా ఎందుకిష్టపడతారుపిచ్చిగానీ"

"ఏమీ లేని వాళ్లను ఎవరూ ఇష్టపడరా?”

"నీ సంగతే తీసుకోనేను వికారంగా ఉండిచదువుఉద్యోగం లేని దాన్నైతే నువ్వు పెళ్ళికి ముందుకొచ్చే వాడివా?”

"నువ్వు చెప్పినవన్నీ శాశ్వతం అని గ్యారంటీ లేదుగా అనూఆకర్షించబడటానికి అందం ఒక కారణం కావొచ్చు గానీఅందమొక్కటే అనుబంధాన్ని నిలబెట్టలేదని నమ్ముతాను.”

"సరే మన అభిప్రాయాలు ఎప్పుడు కలిశాయిలే.”

"పర్లేదుఎవరి అభిప్రాయాలు వారివికానీ ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించిన రోజుకలవాల్సిన అవసరం లేదేమో.”

ఆమె కంపెనీ గెస్ట్ హౌస్ కు వచ్చేసరికి చీకటి పడుతోందిచాలా ఎత్తైన చెట్లుపొగడ పువ్వుల వగరు వాసనపారిజాతాల సున్నితమైన పరిమళం తో కలిసి ఒకరకమైన అడివిపూల పరిమళం గాలిలో కలిసి ఉంది.గెస్ట్ హౌస్ బయట చిన్న కొలను లాంటిది కట్టారుతామరాకుల మీద స్థిరం గా లేకుండా దొర్లుతున్న నీటి ముత్యాలుకొలను లోకి చూశాడుకలువకు దగ్గరగా చంద్రుడు.

కొలను గట్టు మీద కూర్చుంటూ పక్కనే ఉన్న సాటిన్ రిబ్బన్ కట్టిన ఒక బాక్స్ చూసి "ఏముంది అందులో"అడిగింది.

"మీకోసమేఅంటూ చేతికిచ్చాడు.

ఆమె రిబ్బన్ విప్పిలోపల చూసిందిబంగారు కాళ్ళ పట్టీలు.

కాళ్ళు కూడా గట్టు మీదే పెట్టుకుని  కూర్చుందిపైకి చూస్తే చందమామకొలను లో కలువకు దగ్గరగా ఉన్నాడు.


పక్కనే కూర్చుని కెన్ ఐకాళ్ళకు అలంకరించడానికి అనుమతి అడిగాడు.

"మురళికొంచం మాట్లాడాల్సిన విషయాలు వున్నాయి.”

పట్టీలున్న బాక్స్ పక్కనే పెట్టి "చెప్పండి."అన్నాడు.

"ఏ చిన్న పని చెయ్యాలన్నా కానీ బాక్ అప్ ప్లాన్ లేకుండా ముందు అడుగెయ్యనుపెళ్ళి అనే లైఫ్ టైం ప్రయాణానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటానుఇలా ఏర్పాటు చేసుకోవడం మీకు ఏమైనా తప్పనిపిస్తోందా?”

సంభాషణ ఎటు వేపు వెళ్తుందా అనుకుంటూ ఆమె మాటలు వింటున్నాడు.

"ఎంతో పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా పెళ్ళి తర్వాత చాలా మొరటుగా ప్రవర్తించడం చూస్తుంటానుఎలాంటి సమస్య అయినా సరైన కమ్యూనికేషన్ తో పరిష్కరించుకోవచ్చని నేను నమ్ముతానుపెద్ద పెద్దగా అరుచుకోవడం తిట్టుకోవడం మన జీవితం లో జరగ కూడదని నా కోరికమీకేమైనా అభ్యంతరం ఉందా?”

ఆమె మాటల్లో కాదనడానికి ఏమీ లేదనిపించింది.

నాకు పెళ్ళి అనేది జీవితం లో ఒక చిన్న భాగమేఅదే జీవితమయినన్నూనాకింకా ముఖ్యమైన వృత్తిని ఓవర్ టేక్ చెయ్యడం నాకిష్టం ఉండదు.

Marriage should not occupy either of our lives nor it should disturb our goals.

మనం మిగతా వారిలా పర్సనల్ లైఫ్ ని మరీ కలిపేసుకుని తరవాత ఆ చిక్కుముళ్ళను విప్పలేక పోట్లాడుకుంటూ వాటి మీద ఎక్కువ టైముఎనర్జీ ఇన్వెస్ట్ చేయడం నాకిష్టం లేని విషయాలురెండో వారి పర్సనల్ విషయాల్లో తల దూర్చకుండా కొంత దూరంలో ఉంటే మంచిదని నా అభిప్రాయం.”

నిశ్చలంగా ఉన్న మబ్బుల వెనకనుండి చంద్రుడు వేగంగా ప్రయాణిస్తున్నాఅక్కడే ఉన్నాడు.

ఆమే కొనసాగించిందిఒకవేళ విడిపోవడం జరిగితే ఒక వేళ విడిపోవాల్సిన అవసరం వొచ్చినపుడు తక్కువ emotional traumaతో దూరమవుదాం. I ensure you that I would not exploit our relationship in anyway. “

" పెళ్ళికి  నా వైపునుండి కొన్ని Terms and Conditions వ్రాశానువీటిలో మీకు నచ్చనివిమార్చాల్సినవి లేదా కలపాల్సిన రూల్స్ ఏవైనా ఉంటే వ్రాయండి

సిస్టం లో Terms and Conditionsవచ్చినపుడు చూసుకోకుండా ప్రతి సారీ agree అనేస్తాముఅలా కాకుండా ఇద్దరం కలిసి వ్రాసుకున్న రూల్స్ నచ్చిన తర్వాతే, agree అనుకున్నపుడే పెళ్ళిలో దిగుదాంఏమంటారుచూడండి."  అంటూ ఒక ఫైల్ అతనికిచ్చిందిఅతను ఆ ఫైల్ తిరగేస్తున్నాడు

"నేను ఓ నాలుగు రోజుల తర్వాత వెళ్తానుఇంతలో చదివి అభిప్రాయం చెప్తే...."

"ఇవన్నీ అవసరమేనా అనూ?" అడిగాడు

"నేను ప్రాక్టికల్ గా ఉండటానికి ఇష్టపడతాను మురళీ. We should add practicability in our life as an essential ingredient, like salt in our food.”

ఉప్పు ఎక్కువైనా బతుకు రుచి బాగోదు అనూ "


వినడానికి అన్ని రూల్స్ గైడ్ లైన్స్ బాగానే ఉన్నట్లనిపించినా,తెలియని వెలితి లాంటిది కమ్మేసిందిపెళ్ళి మీద అకారణమైన విముఖత కలగుతుంటేలేచి నుంచున్నాడు.

"నాకు కొంచం టైమ్ ఇవ్వగలరా?”

"తప్పకుండా.”

*******

రెండు రోజుల తర్వాత అతని మొబైల్ కు ఫోన్ చేసింది

"మురళీ నేను అర్జెంట్ గా ఊరెళ్ళాలి . రేపటికి అక్కడ ఉండాలిఇప్పుడు బయలు దేరితే సాయంత్రానికి చేరుకుంటారాత్రి నిద్రలేదునేను డ్రైవ్ చెయ్యొచ్చు కానీ రిస్క్ తీసుకోవడం ఎందుకనిఎవరైనా డ్రైవర్ కావాలి. మా డ్రైవర్ కు రావడానికి కుదరదు  .

అలాగే అంటూ ఓ పది నిముషాల తర్వాత వచ్చాడు మురళి .

"డ్రైవర్ ఏడీ?" అంది.

"సమయానికి ఎవరూ లేరుమీకు అభ్యంతరం లేకపోతే నేనే వస్తాను."

పొడుగవడం వల్ల ఒక చేయి కారు పైన ఆనించివంగి మాట్లాడుతున్నాడుబలమైన చేతులుఅతను నిల్చున్న తీరుమొహం లోని చిరునవ్వు 'అమ్మకు బాగానే తెలుసే ఎవరు బాగుంటారోఅనుకుంది.


డ్రైవింగ్ సీట్లోనుండి దిగి అటు వేపు సీట్లో కూర్చోడానికి రోడ్డు వేపు వచ్చి డోర్ తీస్తుండగా,  చూసుకోకుండా కార్ డోర్ తీసిందేమో వెనకనుండి వస్తున్న ఒక బైక్ వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది ఆమె పడిపోవడంస్పృహ తప్పడం అతని కళ్ళముందే జరిగింది.
ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్ళాడు.

****ఆమెకు స్పృహ వచ్చి చుట్టూ చూసిందిహాస్పిటల్ వాతావరణం కొత్తగా ఉంది. . పక్కనే మురళిఉన్నాడుఉన్నాడుగా అతను అనుకుంటూ నిద్ర లోకి జారుకోబోతుండగాఛెళ్ మని దెబ్బతగిలినట్లు తనకు జరిగిన ఆక్సిడెంట్ గుర్తొచ్చిందిబైక్ మళ్ళీ చాలా దగ్గరగా.... ఆ సంఘటన రీప్లే అయింది.

"మురళీ" అంటూ వణికి పోతుండగా పక్కకొచ్చి కూర్చుని భుజాలు పట్టుకున్నాడు.

"కంగారు పడకు.సేఫ్ గా ఉన్నావుఅంటూ చేతుల మధ్య పొదుపు కున్నాడుఆమె చేతిలో అతని చొక్కా నలిగిపోతోందిఎప్పుడు ఎరగనంత నిశ్చింత అతని చెంత .  కాసేపటికి ఆమె సెటిల్ అయింది


కొత్త జంట కౌగింట అమృతం పొంగిందిపరిష్వంగపు పాయసపు రుచి తెలిసిందిఎవరితోనూ కౌగలించుకోబడని జీవితమొక జీవితమేనా అనుకుందిఆమెను ఓదారుస్తూ అతను సేద తీరుతున్నాడు.
ఎన్ని భావనలు

మరెన్నో రుచులు

ఇద్దరూ సమానంగా,

ఒకరికంటే మరొకరు ఎక్కువగా

అందిపుచ్చుకుంటూ ఎప్పటికీ గమ్యం దగ్గరవని పల్లకీ ప్రయాణంలా సాగింది.

నా నియమాలులక్ష్యాలునన్ను దాటి వెళ్ళనీ అనుకుంది ఆ క్షణం

ఎండలో పరుగుతీసిన వాడికి తెలిసినంతగా మంచినీళ్ళ రుచి ఇంకెవరికి తెలుస్తుంది.

జీవితంఉద్యోగంరోజు వారీ పోటీ లో అలుపులేని పరుగు తీసిన ఆమెకుఆ క్షణం అలసట రుచి తెలిసింది.
చల్లని వొడి అందుబాటులో ఉంటే అలిసిపోవడం ఎంత అద్తృష్టం?

ధ్యాన సమాధి లో మునిగారు.

వొదలాలనీవొదుల్చుకోవాలనీ ఇద్దరికీ లేదు.తనని ఆపేశారన్న ఉక్రోషం కలిగింది కాలానికి.

******

తను హాస్పిటల్ లో ఉన్నన్నాళ్ళు దగ్గరే ఉండి చూసుకున్నాడు మురళిఅద్దం లో చూసుకుంటే తన రూపం చూసి ఆశ్చర్యపోయిందిపెదిమలు చితికిబుగ్గలు కమిలినుదిటిపై కుట్లు పడి ఆమె ఆమెలా లేదుఇదేమిటి ఇలా ఉన్నాను అని కలవర పడింది

 రెండువారాల్లో అవన్నీ మానిపోతాయిమీరు మళ్ళీ ఇదివరకులానే ఉంటారని డాక్టర్ చెప్పాడు.

బాస్ వచ్చి వచ్చి కొన్నాళ్ళు బలవంతాన సెలవు పెట్టి రెస్ట్ తీసుకునేట్లు ఒప్పించాడుఏమీ తోచక రూమ్ బయట బాల్కనీ లో నిలబడిందిఒంటరిగా నిల్చున్నా ఎవరో తోడున్నట్లు ఆనందంగా ఉందిఎవరో ఆ తోడుఎవరా తోడుమనసు కవ్విస్తూ ఉంది.

పని అమ్మాయి రూం సర్దుతూ ఉందిహాస్పిటల్ నుండి వచ్చిన బేగ్ లోంచి మాసిన బట్టలు తీస్తుంటే మురళి చొక్కా కనిపించిందిఆ రోజు తన చేతుల్లో నలిగిన చొక్కాఅది తెచ్చివ్వమంది పనమ్మాయితోఆమె వింతగా అనూ వంక చూసి తెచ్చి ఇచ్చిందిచొక్కా చేతుల్లోకి తీసుకుంటే ఆ రోజు గుర్తొచ్చింది.

తడుముతుంటే జేబులో ఉన్న కవర్ చేతిలోకొచ్చింది.

ఉత్తరంఏక్సిడెంట్ ముందు రోజు తేదీ వేసి ఉంది.

విచిత్రంగా సంబోధన లేదు.

'భార్యఅనే భావన పట్ల అంతులేని అకారణమైన ప్రేమఆమెతో నేను కలసిపోవాలనినాలో ఆమె అతి ముఖ్యమైన భాగమైనా శ్వాసకు ఆమె మూలం కావాలన్న ఓ తీవ్రమైన తపన నన్ను నిలవనీయదుఆమె పువ్వులా వికసిస్తూ ఉంటే చూస్తూ ఆనందించాలిఆమె ఎదుగుతుంటే నేను తోడుగా ఉండి సంతోషపడాలిఇవన్నీ practicability కు దూరంగా ఉండే ఆలోచనలేకానీ నేనా లోకంలో ఉండేందుకే ఇష్టపడతాను.

మీ పట్ల ఆకర్షణకు మీ అందం ఒక కారణం కానీ అందమొక్కటే ఇద్దరి వ్యక్తుల మధ్యన బంధాన్ని కొనసాగించలేదని నమ్ముతానుఇద్దరం ఒకటైపోవాలన్న తపనలోఎప్పుడో మీకు కష్టం కలిగించేలా ప్రవర్తిస్తానుఅనుక్షణం మనిద్దరం వేర్వేరు మనుషులమని గుర్తు చేసుకుంటూగౌరవిస్తున్నానో లేదో గమనించుకుంటూ అతిజాగ్రత్తగా గడుపుతూ నా భావాలకు అన్యాయం చేయలేనేమోపైపై పూతల గౌరవాభిమానాలు ప్రదర్శించుకుంటూడబ్బు లెక్కలు రాసుకుంటూఇలా ప్రోగ్రామ్ చేయబడిన జీవితంప్రేమలు నేనూహించలేను.

ఇద్దరి మధ్య ఏర్పడే ఉప్పెన లాంటి స్నేహ భావాలను టర్మ్స్ కండిషన్స్ తో కంట్రోల్ చెయ్యడం నేనెంత ఆలోచించినా నాకు సాధ్యం కాదనే అనిపిస్తోంది అనూనేను తోడు కాకపోవడమే మీక్కూడా మంచిదేమోఅందంచదువుఆతవిశ్వాసం అన్నీ కలిసిన మీరుభార్య కావడం ఆ వ్యక్తి అదృష్టమనే చెప్పాలిఆ అదృష్టవంతుణ్ణి నేను కాలేకపోతున్నందుకు నాకు నేనే కారణం.

అంతా చదివి మెల్లగా మడతలు పెట్టికప్ బోర్డ్ తెరిచి ఒక పట్టుచీరకింద పెట్టిందిఒక్క క్షణం మంచం చివర్న కూర్చుందిఏదో తెలియని కంగారు అనిపించి మళ్ళీ బయటకొచ్చిందిసాయం కాలం చల్లని గాలి తాకుతున్నా సరే వడ దెబ్బ తగిలినట్లు నీరసమవుతోందిబాల్కనీ పిట్టగోడ నానుకుని నేల మీద కూర్చుంది.  అంత గుబులు ఎప్పుడూ అనుభవం లేదు.

చీకట్లో ఎంతో సేపు కూర్చుని లేచిఎంత ఘోరం ప్రేమ విఫలమైన వాళ్ళ బ్రతుకులు అనుకుని నిట్టూర్చిందిఇంక అతను మళ్ళీ తనకు కనిపించడనీ అర్ధమైందిగుండె బరువైకంటి నీరుగా మారిందిఎంతటి నిశ్చింత అతని చేతుల మధ్యఆ స్పర్శ ఒక్క క్షణం క్రితమే అనుభవమైనంత తాజాగా అనిపించిందిఅప్రయత్నంగా కళ్ళు మూతలు పడ్డాయిఆలోచనలు ప్రశ్నల్లా దాడి చేస్తున్నాయి.

జీవితానికి ఆ స్పర్శ అవసరమేనాఅది లేకపోతేనేంఆ స్పర్శ అతని వద్దనుండే రావాలాఇంకెవరైనా కూడా ...వెంటనే ఆ ఆలోచనను మళ్ళీ తన దరిచేరనంత దూరం తరిమికొట్టింది,

ఇంకెవరినీ ఊహించలేకపోయిందిఆ స్పర్శానుభవం మలినం కావడానికి వీల్లేదు.

అతనింకెవరినైనా .....మనసు అసంకల్పితంగా భగ్గుమందివిచక్షణ నచ్చ జెప్పిందిరకరకాల భావాలు అన్నీ కలిసి ఆమె మీద దాడి చేస్తుండగాతెల్లవారిందిలోపలికొచ్చి స్నానం చేసి ఆఫీసుకు తయారై వెళ్ళిపోయింది.

..To be continued

7 comments:

రాజ్ కుమార్ చెప్పారు...

ఇలా సస్పెన్స్ లో పెట్టి వదిలేస్తారా..?? అన్యాయః

sndp చెప్పారు...

reaaly awesome continue asap, i visited 4 times from the morning for new post

అజ్ఞాత చెప్పారు...

ఒక్కసారి కూడా ముఖద్వారం లో ఆమెకట్టిన హెచ్చరిక గంటల్ని ముట్టుకోక పోగా, వెనకవేపునుండి వచ్చి తాకుతున్నాడే ఇతను. ఏవో హద్దుల గీతలు చెరుపుతున్నాడు. మళ్ళీ ఏ తప్పూ చెయ్యలేదని బుకాయిస్తున్నాడు.


మనసు లో కదిలే భావాలని ఎంత చక్కగా చెప్పారు. మీ ఉపామానానికి జోహారు.

ఇంత సున్నితం గా కూడా ఉపమానాలు చెప్పొచ్చా......

dee చెప్పారు...

పదాలని ఇంత అందముగా కూడా పేర్చి, వాక్యాలు గా కూర్చి మనసులోని
భావాలు ఇంత అద్భుతంగా తెలియచేయొచ్చునా అని అశ్చర్యంగా అనిపించింది. మీ రచనా శైలి అద్భుతం శైలజ గారు.

-దీరూసి

సంతు (santu) చెప్పారు...

:) =D chaala bagundi.....

"అమ్మ నోటికి రిమోట్ చేయించి తన దగ్గరే పెట్టుకోవాలి అనుకుంది అనూ"
allaanti remote emaina untey ivvandi... :p

Chitajichan చెప్పారు...

meeru cheppali anukunna vishayaalu bhale cheppesaaru Anu aloochanalatho :)

nachindi...

Narsimha చెప్పారు...

waiting ikkada inko bhagam koasam

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి