24, నవంబర్ 2011, గురువారం

దేవుడన్నయ్య"చక్కగా 'మటన్-గోబి-పులిహోర' చేశాను. బాగా కుదిరింది. అది తింటూ ఇవి చదువుతూ ఎంజాయ్ చెయ్యండి.”

' నా తలపుల వనంలో

ఎదురు చూపుల రహదారిలో

వలపుల పూలు పరిచాను, నీ పాదాలు కందుతాయని

నిదుర లేని రాతిరి, నీ ప్రేయసి లా నిలిచాను'


"ఓలమ్మో , ఏంటిదీ?”


"పెళ్ళి కుదిరిన తర్వాత, మీ గురించే రాశాను.”


"నాకు గుండె దడ తల్లో,ఈ పైత్యాలు నాకు అర్ధం కావు.”


"సరే ఇది చూడండి. చదివి అర్ధం చెప్పాలి మీరు"


'నీకోసం చూస్తున్నాను

క్షణం యుగమైంది

గంట రెండైంది.

మంచులో తడిసిన, జడలో మల్లెలు

నా చెంపల కన్నీరుని తుడిచి మొగ్గలయ్యాయి.

వెండి వెన్నెల జలతారు...'


జలతారు..అంటే?

పదో తరగతిలో తెలుగు మాస్టార్ని అల్లరి చేసినందుకు అప్పుడు శపించాడు.

చేసిన పాపం, ఆయన శాపం ఊరికే పోతుందా?

ఇంతకీ 'జలతారు' అంటే ఏమిటీ?

జల అంటే నీళ్ళు, తారు అంటే.... సింపుల్, రోడ్లేస్తారు, నల్లగా ఉంటుందీ. అబ్బో.. అబ్బో... శాపం లేదు, గీపం లేదు, బ్రహ్మాండం గా వొస్తుందీ ప్రతి పదార్ధం.

"అది సరే గాని, రెండొంటిదాకా నేనేడకి పోవాల?”

"ఛీ ఏమిటండి, ఆ భాష? చదువురాని వాడిలా?”

"మరి నీ పొయెట్రీ జూస్తే బుర్రలో సదివిన సదువంతా మర్సి పోయానమ్మో, నాగేస్సర్రావు కాళిదాసు సిన్మా రివర్సు అయినట్టు. మనకెందుకు కయిత్యాలు, సెప్పు. సుబ్బరంగా అన్నంలో పచ్చిపులుసేసుకుని తిందాం దా, కూకో.”

"ఛీ, నీకసలు డెలికేట్ ఫీలింగ్స్ లేవు"

ఏడుస్తూ పడుకుంది. తిండి తినమంటే,

"తినను, చచ్చిపోతాను. "అంది

"చచ్చిపోయే బాధ ఏమొచ్చింది?”

'ప్రేమ ప్రాణమివ్వగలదు, ప్రాణం తీసుకోగలదు ' ఏంటో చెప్పింది.

( ఆటో వాళ్ళూ, కేప్షన్ కావాలా, అలా ఎగబడకండయ్యా, ఇది మా పర్సనల్ సంభాషణ)


*******


"నీ వయసెంత? “

"ఆడవాళ్ళ.....మగవాళ్ళ...”

"అబ్బో, ఆ చింత కాయ సామెతలొద్దు, వయసు చెప్పు.”

"ఇరవై నాలుగు"

" 'గజనీ' మాదిరిగా ఏదైనా తలకు దెబ్బ తగిలిందా చిన్నపుడు? లేపోతే ఆ భాషేంటి, పెరుగుదల నాలుగేళ్ళ దగ్గరే ఆగిపోయినట్టూ..”

" మీరు మరీనూ..నేను మాట్లాడితే ముద్దు ముద్దుగా ఉంటుందని అన్నయ్య ఎప్పుడూ అంటుంటాడు.”

"మీ అమ్మా నాన్నలకు నువ్వొక్కదానివేగా? ఈ బామ్మర్దెవరూ..... కజినా?”

"కాదు, దేవుడిచ్చిన అన్నయ్య, నేనంటే ఎంతో ప్రేమ."

దేవుడికేం పనిలేదా, ఈ సైడు బిజినెస్ ఏంటీ?, అన్నయ్యల్నివ్వడం, సిన్మా హీరోలకు, తమ్ముళ్ళనివ్వడం!

"ఇవ్వాళ వస్తానన్నాడు. నీదగ్గర ఓ గంట కూచోవాలనుందమ్మా అన్నాడు"


"వస్తా వస్తా బ్లూ లేబుల్ పట్రమ్మను. నీదగ్గరెందుకూ, నాదగ్గరే కూచోబెట్టుకుంటా.”

వొచ్చాడు అన్నయ్య.

"ఏరా తల్లీ? ఇలా చిక్కిపోయావూ ” అంటూ... వచ్చీ రాగానే, ఆమె తల మీద చెయ్యివేసి నిమురుతూ..

"అన్నయ్యా? నాకు ఐస్ క్రీమ్ కావాలి.”


"ఏంట్రా ఇవ్వాళ ఐస్ క్రీమ్ తిన లేదా?” 

ఏవిటా కంగారూ

 "బావగారూ" కేక.

ఏం కొంప మునిగింది. ఒజోన్ లేయర్ కంత పెద్దదయిందా?


" చెల్లిని ఇలాగేనా చూసుకునేది?" విసుక్కున్నాడు.


"కసాటా, బిసాటా, వెనిల్లా, స్ట్రా బెర్రీ, పిస్తా, చస్తా,' చెప్పరా నీకేం కావాలో?"


'ఐస్ క్రీమ్ బండేస్తాడా అన్నయ్య ?'


"కొత్తగా అడుగుతావేం అన్నయ్యా, నాకేం ఇష్టమో నీకు తెలియదూ?”


"తెలుసురా, నీకు పిస్తా ఇష్టమని, పెళ్ళైన తర్వాత, బంగారు తల్లి టేస్ట్ మారిందేమోనని.”


"నేనేం మారను. అన్నయ్య అన్నా, పిస్తా ఐస్ క్రీమ్ అన్నా ప్రాణం.”


"బావగారు, మా చెల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి, ఆమెకు చిన్న ముల్లు గుచ్చుకున్నా, నేను భరించలేను, జాగ్రత్త."


మళ్ళీ ఇంకో రౌండ్ తల నిమిరాడు.


"థాంక్స్ అన్నయ్యా" కొంచం వాడి భుజం కిందకు చేరింది, అతనికి సౌకర్యంగా ఉండేట్టు .


ఏ ఎన్నార్-గీతాంజలి, ఎన్ టీ ఆర్-చంద్ర కళా,


ఓరి నాయనోయ్, ఇదేం సినిమా?


నయం, వాలెంటైన్స్ డే కాదు, కొంత మంది తాళి బొట్లు జేబు నిండా పెట్టుకుని తిరుగుతారట ఆ రోజు. ఆ ఎర్ర బట్టలోళ్ళు వీళీద్దర్నీ చూస్తే డేంజరే!


అతనెళ్ళిపోయిన తర్వాత అడిగాడు.


"నీలాంటి తమ్ముళ్ళు లేరా, ఈ అన్నయ్యకు?”


"అన్నాతమ్ముళ్ళ మధ్య సెంటిమెంట్ ఏముంటుంది? చెల్లెలైతే ముద్దుగా అప్యాయంగా..”

" పెళ్ళి అయిందా?”

"సర్లెండి, ఆ మాటెందుకు అడుగుతారు?అన్నయ్యకు మనశ్శాంతి లేదు జీవితం లో. అన్నయ్యెంత దేవుడో, ఆవిడంత రాకాసి, ఆవిడలో మార్పు రావాలని నేను తిరగని గుడి లేదు, చేయించని పూజ లేదు.”

"ఏం చేస్తుందో ?”

"నా పేరెత్తితే చాలు భగ్గుమంటుందట, పవిత్రమైన అన్నా చెల్లెళ్ళ బంధాన్ని కూడా అనుమానించే నీచురాలు. చాలా బాధపడతాడు అన్నయ్య.”

"నాక్కూడా కొంచం కడుపులో తిప్పుతుంది.”


******


"ఒఠ్ఠి పాత కాలం మనిషి నాన్నా!

ఏది వండినా, డోకొస్తుంది, తిననంటాడు. నేను హర్ట్ అవుతానని కూడా చూసుకోడు.

ప్రతిదీ వెటకారం, సున్నిత భావాలు లేవు, మొరటు గా ఉంటాడు.”


"అదేమిటమ్మా, పెళ్ళి చూపుల్లో, చాలా మోడర్న్ గా ఉన్నాడు, పెళ్ళంటూ చేస్తే ఈయన్నే ఇచ్చి చేయండి అన్నావు?”


"బయటికి బాగానే ఉంటాడు నాన్నా, లోపల భావాలన్నీ మోటు.”


***********


"ఏవిటల్లుడూ, అమ్మాయి ఎంచక్కా కవిత్వం రాస్తే వెక్కిరిస్తావట? చక్కగా వండితే తినవట.”


"ఏం చెయ్యనండీ, అవి చదివి ఆఫీసు కెళ్ళానా,తేడాగా మాట్టాడుతూ, కంగారుగా తిరుగుతున్నానని మా వాళ్ళు డాక్టరు దగ్గరికి పంపించారు. టెస్టులన్నీ చేసి ఏమీ లేదని చెప్పటానికి, యాభై వేలు తీసుకున్నాడు. రోజూ చదివితే, నేను చిప్ప పట్టుకోవాలి.”


"అన్నా చెల్లెళ్ళ అనురాగాన్ని అపార్ధం చేసుకుంటావట!”


"వాడా, దేవుడన్నయ్య, మీ అమ్మాయి తల మీద చెయ్యేసి...నాకు పిచ్చికోపమొస్తుందండీ!”


"ఏవిటల్లుడూ, నీకూ చెల్లెలుందిగా, ప్రేమగా చూడవూ ఆమెను? నువ్వు కూడా ఆమె తల మీద ఎప్పుడైనా చెయ్యివేసి... గుర్తుతెచ్చుకో..”


"అవును, ఒకసారి, నేనూ దాని జుట్టు..”


"చూశావా? అన్నా చెల్లెళ్ళు అలా ఆప్యాయంగా ఉండటం సహజం.”


"అబ్బా ఆగండి మాంగారూ, మూడో క్లాసులో ఉండగా, నామీద చాడీలు చెప్పి నన్ను మా నాన్తో తన్నించిందని, అది పెరట్లో బాదం కాయలేరుకుంటుంటే, దాని జుట్టు పీకి, నెత్తిన మొట్టికాయ వేశాను. ఆప్యాయతా?వల్లకాడా, అలాంటి వికారాల్లేవు"


"నిజమే, సొంత చెల్లెళ్ళ మీద అలా ప్రదర్శించలేం. పోనీ, నువ్వు కూడా చెల్లెమ్మ, చెల్లెమ్మా, అంటూ ఎవరితోనైనా తో ఆప్యాయంగా ఉండు, అప్పుడు అర్ధమవుతుంది వీళ్ళ బంధం.”


"వామ్మో, నాకు కంపరం. మా చెల్లెల్నే, నేను పేరు పెట్టి పిలుస్తాను.”


" చిన్నప్పుడు అంతేలే, ఇప్పుడు చెల్లెమ్మా అంటావేమో.”


"ఇప్పుడే జానకీ అని పిలుస్తా. చిన్నప్పుడైతే ఏయ్ జాన్కీ, డాన్కీ అనే వాణ్ణి.”


"ఎలాగయ్యా మరి, మొండికేస్తావూ? ఇలాగైతే అమ్మాయి విడాకులిచ్చేస్తానంటుంది మరి. ”


"మాంగారూ, ఆ కవిత్వం చదవమంటే సరే, చదువుతాను. ఆ మటన్ దరిద్రాలు తినమన్నా సరే, తిని కాసేపటికి కక్కుంటాను. తల నిమిరాడంటే మాత్రం వాణ్ణి, ఏ కీలు కాకీలు విరిచేసి మనశ్శాంతిగా జైల్లో కూచుంటా. పట్రండి, ఆ విడాకుల కాగితాలేవో..సంతకాలు పెట్టేస్తా. వాణ్ణి మాత్రం తట్టుకోలేను.”

31 comments:

జ్యోతిర్మయి చెప్పారు...

"దేవుడికేం పనిలేదా, ఈ సైడు బిజినెస్ ఏంటీ?, అన్నయ్యల్నివ్వడం,".
:):):)

Sravya Vattikuti చెప్పారు...

Too good :)

రసజ్ఞ చెప్పారు...

hahaha:)

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అబ్బే లాభం లేదండీ.. మీ హీరో టూ ప్రాక్టికల్, ఓవర్ పొసెసివ్.. పైగా బొత్తిగా విశాల హృదయం లేదు... ఇలా ఐతే కష్టం :-D
Hilarious post శైలజ గారు :-D :-D :-D :-D
'మటన్-గోబి-పులిహోర',
జల తారు,
’ప్రేమ ప్రాణమివ్వగలదు, ప్రాణం తీసుకోగలదు’ ఏంటో చెప్పింది.

(ఆటో వాళ్ళూ, కేప్షన్ కావాలా, అలా ఎగబడకండయ్యా, ఇది మా పర్సనల్ సంభాషణ)
దేవుడి సైడు బిజినెస్సు..
ఐస్క్రీం బండి..
తెగ నవ్వించేశాయి :-)))))

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

మీకు అభ్యంతరముండదనే ధైర్యంతో నా బజ్ లో పెట్టేశాను. అభ్యంతరమైతే చెప్పండి తీసేస్తాను. https://plus.google.com/117385813833830611794/posts/bhGZKqBdaZ5?authuser=0

kiran చెప్పారు...

:))))))))..sooooper

ఆప్యాయతా?వల్లకాడా, అలాంటి వికారాల్లేవు -- kevvvvvvvvvvvvv :)

సిరిసిరిమువ్వ చెప్పారు...

:)..

మీ రచనలు బాగుంటాయి.అన్నీ చదువుతాను కానీ వ్యాఖ్య వ్రాయటానికి బద్దకం!

కృష్ణప్రియ చెప్పారు...

:))) మొన్నీ మధ్య ఇలాగే దేవుడిచ్చిన అన్నయ్య గురించి చదివి మీ హీరో లాగే అనుకున్నా ..

నాదీ వేణూ శ్రీకాంత్ గారి మాటే.. మళ్లీ మాట్లాడితే ఇంకా ఎక్ష్ట్రా కూడా..

తెలుసురా, నీకు పిస్తా ఇష్టమని, పెళ్ళైన తర్వాత, బంగారు తల్లి టేస్ట్ మారిందేమోనని.”>>>>>>>

LOL.

నయం, వాలెంటైన్స్ డే కాదు, కొంత మంది తాళి బొట్లు జేబు నిండా పెట్టుకుని తిరుగుతారట ఆ రోజు. ఆ ఎర్ర బట్టలోళ్ళు వీళీద్దర్నీ చూస్తే డేంజరే!

>>>>> ఇది అల్టిమేట్..

sunita చెప్పారు...

Hahaha!Too good!!

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

Very hilarious.

అజ్ఞాత చెప్పారు...

ఇలాటి శాల్తీలు నాకు కనీసం రెండైనా తెలుసు. అలా తల నిమరాటాలు, భుజం పైన చెయి వేయటాలు అంటే నాకుండే కంపరం వల్ల తప్పించుకుని తిరుగుతాను!
భలే హ్యూమరస్ గా రాసారు.
"రివర్స్ కాళిదాసు" హి-హి-హి-హి-హీ
శారద

Chandu S చెప్పారు...

జ్యోతిర్మయి గారూ,

Thanks

Sravya Vattikuti గారూ

Thank you

రసజ్ఞ గారూ,

Thanks

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ,
Thanks for reading. పర్లేదు ఉంచండి. మనలో మాట, నాకా బజ్ సంగతులు పెద్దగా తెలియవు.

Chandu S చెప్పారు...

kiran గారూ,
Thanks for reading.

Chandu S చెప్పారు...

సిరిసిరిమువ్వ గారూ,
నేనూ బ్లాగులు చదువుతాను కానీ, కామెంట్లు రాయడం లో మీకు తోడున్నాను.

కృష్ణప్రియ గారూ,
Thank you.

sunita గారూ,

Thanks

Chandu S చెప్పారు...

శివరామప్రసాదు కప్పగంతు గారూ,
Thank you

శారద గారూ,
థాంక్స్

Mauli చెప్పారు...

>>>
"అబ్బా ఆగండి మాంగారూ, మూడో క్లాసులో ఉండగా, నామీద చాడీలు చెప్పి నన్ను మా నాన్తో తన్నించిందని, అది పెరట్లో బాదం కాయలేరుకుంటుంటే, దాని జుట్టు పీకి, నెత్తిన మొట్టికాయ వేశాను. ఆప్యాయతా?వల్లకాడా, అలాంటి వికారాల్లేవు">>>>>


బాగా నవ్వించారు

మధురవాణి చెప్పారు...

హహ్హహ్హ్హా... అయ్యా బాబోయ్... తెగ నవ్వించేసారండీ... too good! :))))))))))

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

Now your Blog picture is very good and very symbolic.

Chitajichan చెప్పారు...

Mee kotha post chusanu ippude.. Devudayyana..
baaboi peru lo ne inta sentiment undi.. story entha heavy ga untundo ani ( Beware of seniments ) ani anukuntu.. chadivaanu... mood ni baaha lighten chesaru.. thank you.. appudappu ilanti panchadhaara palukulani raayandi... chala bavundi..

anna chellella chinnappati kotlata gurinchi baaga raasaru.. memu chinnappudu ela kottukune vallamo ela illu peeki pandiri vese vallamo gurtu vachindi ... hahaha... really meeru raasindi chala correct... ilanti devudu annayyale ekku va overaction chestaru..

nirmal చెప్పారు...

chandu s garu,
chala bavundi.enjoyed a lot. waiting for next post. meerachanalu pavlov pouch laga addictions.veyi kallatho eduruchoostunnanu mee next post kosam.

అజ్ఞాత చెప్పారు...

చాలా సరదాగా ఉన్నా అలోచించాల్సిన విషయం వుంది .
మొన్నట్నుండీ మీ బ్లాగులో తిండీ తిప్పలూ లేకుండా పడుంటే ( ఈ పోస్టులన్నీ చదివి మూర్చిల్లాను ) ఇప్పుడు చేసిపెడతారా మటన్ గోబీ పులిహోర

బొందలపాటి చెప్పారు...

గమ్మత్తు గా రాశారు. ఇంతకు ముందే ఎవరో రాసినట్లు మీ రచనలలో బీనా దేవి శైలి (వ్యంగ్యం లో)కనబడుతుంది.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

అదిరింది. అసలు ఒక్కటనేమీటి పోస్టు నిండా హైలైట్లే...

"సంబంధం లేని సంబంధాలకి ఇచ్చిన, పుచ్చిన లాంటి పదాలు తగిలించినప్పుడు చచ్చినట్టూ బుజ్జి బంగారు సంధి ఆదేశంబగును." ఉదా: దేవుడిచ్చిన + అన్నయ్య = దేవుడన్నయ్య

Chandu S చెప్పారు...

మౌళి గారూ, మధురవాణి గారూ,
Thanks

@ Chitajichan

Thank you

@ Nirmal,

pavlov pouch? Thanks.

Chandu S చెప్పారు...

లలిత గారూ,

మీకోసం దేవుడా క్షమించు చివర్లో ఏం వొండిపెట్టానో చూడండి, ఆవిడెవరో వాళ్ళాయనకు వండింది మటన్ గోబి పులిహోర, తిన్నారా కొంపదీసి?

Chandu S చెప్పారు...

బొందలపాటి గారూ,
Thanks

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) గారూ,
Thanks

నేస్తం చెప్పారు...

ఈ మధ్య కాలం లో మీ పోస్ట్లు తెగ చదివాను..చాలా విభిన్నంగా రాస్తున్నారు..చాలా బాగుంది అండి

naimisha చెప్పారు...

mee rachanalu lo haasyam chaala bagundi.

సుజాత చెప్పారు...

వరూధిని గారి లాగే నేనూనూ! మీ రచనలు చదువుతాను కానీ వ్యాఖ్య రాయాలంటే అది కాస్త లో అవక, బద్ధకించి వెళ్ళిపోతుంటా! మొత్తానికి కేక పెట్టించారు. ఏం దేవుడో...పక్షపాతం కాకపోతే నాకూ ఓ మంచి దేవుడి లాంటి అన్నయ్యనివ్వొచ్చుగా! బుజ్జీ బంగారం అని గారాబం చేయడానికి! ఉన్న అన్నయ్యలే నెలకోసారి ఫోన్లు కూడా చెయ్యరు. అదృష్టముండాలి..:-(((

Sai Veena చెప్పారు...

"ఇప్పుడే జానకీ అని పిలుస్తా. చిన్నప్పుడైతే ఏయ్ జాన్కీ, డాన్కీ అనే వాణ్ణి.”

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి