16, నవంబర్ 2011, బుధవారం

ఆమె నిర్ణయం


"ఈ వేసవిలో నీ పెళ్ళయితే బాగుండనుకున్నాను. నా సెలవలు కూడా అయిపోయాయి." కొడుకుతో అంది మాలతి. ఆమె ఆడ పిల్లల కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేస్తుంది.

"తొందరేముందిలే అమ్మా"

"నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, వెళ్ళి మాట్లాడతాను.”

" ఎవరూ లేరు.”

" పోనీ నాకు నచ్చిన ఒక అమ్మాయి ఉంది. చూస్తావా?” అడిగింది మాలతి.

"చూద్దాంలే" అంటూ తల్లిని కాలేజీ దగ్గర దింపి, అతను వెళ్ళిపోయాడు


*******


విద్య కెమిస్ట్రీ లాబ్ లో పిల్లలతో ప్రాక్టికల్స్ చేయిస్తోంది.

చివరి టేబిల్ దగ్గరున్న ఒక స్టూడెంట్ చీటికి మాటికి పక్కకెళ్ళి మళ్ళీ వస్తోంది.

ముక్కు కు చున్నీ అడ్డు పెట్టుకుని అవస్థ పడుతోంది.

ఆ అమ్మాయిని ఇదివరకు చూసిన ఙ్ఞాపకం రాలేదు విద్యకు. ఆ అమ్మాయి ఇబ్బంది ఏమిటా అని గమనిస్తూ చూస్తోంది.

బాత్ రూమ్ కి వెళ్ళొచ్చినట్లుంది, స్టూల్ మీద కూర్చుంది నీరసంగా. బర్నర్ మీద పెట్టిన బీకర్ పట్టకారతో దాన్ని పట్టుకుని కిందకు దింపింది. దాని అడుగు వూడిపోయి వేడినీళ్ళు టేబిల్ మొత్తం వొలికాయి.

అటెండరొచ్చి "ఏంటమ్మాయ్, చూసుకోవద్దూ?”

రిజిస్టర్లో రాయి బ్రేకేజి అంటూ ఆ పిల్లతో సంతకం పెట్టిస్తున్నాడు.

ఈ లోకం లో లేనట్టు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతోంది.

అటెండర్ రిజిస్టర్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, విద్య పలకరించింది

"వంట్లో బాగో లేదా?”


ఆ ఒక్క మాటకే, ఆ అమ్మాయి కళ్ళు నీళ్ళతో నిండి, జల జలా...

విద్య ఆ స్టూడెంట్ ను తన రూమ్ కు తీసుకెళ్ళి కూర్చో బెట్టి అడిగింది.

"ఏమయ్యింది? మంచి నీళ్ళు తాగుతావా? ”

వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది.

వాసన భరించలేకపోవడం, ఆ నీరసం, ఏడుపు....

ఏడుపు తర్వాత " మొన్న సెలవలకు ఇంటికెళ్ళినపుడు..”

"మీ అమ్మకు తెలుసా?”

తెలుసన్నట్టు తలూపింది..

విద్య ఆ అమ్మాయిని తన రూమ్ లోనే కూర్చో బెట్టి, ప్రిన్సిపాల్ రూమ్ కు వెళ్ళింది.

విషయం చెప్పి" పాపం అనిపిస్తుంది మేడమ్.. చచ్చి పోతానంటుంది.”

"ఎక్కడుంటుంది?” అడిగింది మాలతి.

"కాలేజి హాస్టల్లో..”

"కాలేజీ వాళ్ళెవరైనా?”

"హాలిడేస్ కు ఇంటికెళ్ళినపుడు ..... వాళ్ళ అమ్మకు కూడా తెలుసంది.”

"నా స్నేహితురాలు డాక్టరే. అడుగుతాను.”

మాలతి ఎవరికో ఫోన్ చేసింది.

"ఊళ్ళో లేదు తను. అమెరికా వెళ్ళింది వాళ్ళ అమ్మాయి దగ్గరకు. ఒక పని చేస్తాను, ఇంగ్లీష్ లెక్చరర్ మురళి వాళ్ళ అక్క కూడా డాక్టరే.”

"ఎలా రియాక్ట్ అవుతాడో?” విద్య అనుమానంగా.

"నాకు బాగా తెలుసు అతను. మురళి తో నేను మాట్లాడతాను.ఇంకో విషయం. హాస్టల్లో మిగతా పిల్లలకు అనుమానం రాకుండా ఆ అమ్మాయిని మా ఇంటిలో ఉంచుతాను కొన్నాళ్ళు. వాళ్ళ అమ్మను పిలిపించు.” చెప్పింది మాలతి.
***********

మురళి వాళ్ళ అక్క హాస్పిటల్ నగరం లో ఒక ఖరీదైన హాస్పిటల్. ఉదయం తొమ్మిదింటికి ,స్టూడెంట్ నూ, ఆమె తల్లినీ వెంట బెట్టుకొచ్చింది ప్రిన్సిపాల్ మాలతి.

అప్పటికింకా డాక్టరు రాలేదు. మురళి ఆ కబురూ ఈ కబురూ చెపుతూ కూర్చున్నాడు ప్రిన్సిపాల్ తో. ఓ అరగంట గడిచింది.

"ఇవ్వాళ కాలేజ్ మేనేజ్ మెంట్ వాళ్ళు వస్తానన్నారు మురళి, నేను లేకపోతే బాగోదు.” మాలతి లేచింది.

"మీరెళ్ళండి మేడమ్, నేను చూసుకొంటాను. అక్క లేటుగా వొస్తుంది శ్రావణ శుక్రవారం .”

"ఏం భయం లేదు. డాక్టరమ్మ మాస్టారి అక్కగారే, ఏ అవసరమొచ్చినా వెంటనే వస్తాను" అని మాలతి, పిల్ల తల్లికి చెప్పి వెళ్ళిన పావు గంట తర్వాత మురళి వాళ్ళ అక్క వచ్చింది.


నుదుటి మీద మూడు రకాల బొట్లు, పాపట్లోనూ, కుంకుమ,మెడ కు గంధం, చేతికి కంకణాల గాజులు, ఎర్రటి పట్టుచీర, బంగారు గొలుసులు, నల్లపూసలు, లక్ష్మీ రూపులు, మెడ చుట్టూ ట్రాఫిక్ జామ్.


"ఏరా, కాలేజ్ లేదూ?” డాక్టరమ్మ అడిగింది మురళిని ఆ టైం లో చూసి.

వచ్చిన కారణం చెప్పాడు.

"పెళ్ళి కాని కేసులు తీసుకోన్రా.”

"పెళ్ళి తో ఏం సంబంధం అక్కా?”

"అదేమిట్రా, పెళ్ళంటే ఒక పవిత్ర బంధం. ఆ బంధం లేకుండా, ఒళ్ళు కొవ్విన వాళ్ళకు నేను హెల్ప్ చెయ్యను.”

"పెళ్ళైన వాళ్ళకన్నా, ఈ అమ్మాయికే అవసరం అక్కా, ప్లీజ్. పెళ్ళి కాకుండా ప్రెగ్నన్సీ . ఏమైపోతుంది పాపం.”

సర్లే కూర్చో చూస్తానంటూ లోపలికి వెళ్ళింది

"ఎవరూ ఈ పిల్లా?”

లోపలికి తీసుకెళ్ళి పరీక్ష చేసి,

"ఏవేఁ, వేలెడంత లేవు, అప్పుడే ఏవిటే ఈ వేషాలూ? సిగ్గు లేదూ ?”

.....

"ఇంతకీ ఎవడే వాడూ?”

.....

ఆ అమ్మాయి తలొంచుకుని కూర్చుంది. కళ్ళలో నీరు ముక్కు మీదుగా జారి చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి.

"చదువుకోండే తల్లుల్లారా అని పంపిస్తే ఇవా మీరు చేసే పనులు?”


"ఏవమ్మా, నీకు తెలుసా వాడెవడో? పెళ్ళి చేసుకుంటాడేమో కనుక్కోకపోయారా?” తల్లినడిగింది.


"పెళ్ళి...కుదరదమ్మా" ఆ అమ్మాయి తల్లి పొడి పొడి గా అంది.

"అయినా నిన్ననాలి, పిల్లల్ని కనగానే సరా? దార్లో పెంచొద్దూ?”

మురళి కు లోపలి మాటలు కొద్దికొద్దిగా వినపడుతున్నాయి.

లోపలికెళ్ళాడు.

"చెప్పవే, ఎవడో వాడు?”

వాడెవడో తెలిస్తే కానీ వైద్యం మొదలెట్టేట్టు లేదు.

పేషంట్ నూ, ఆమె తల్లినీ బయట కూర్చోమని

"అక్కా, ప్లీజ్ ఎవరైతే ఎందుకు, జరగాలింది చూడు.” అన్నాడు మురళి.

"నీకేమిట్రా అంత విసుగు దాన్నేదో అంటే, కొంపతీసి.. "అతని వంక అనుమానంగా చూసింది.

"అక్కా... "కంగారు పడ్డాడు.

"సర్లే, పెళ్ళి చేసుకుని తగలడు, ఇక ముందు ఇలాటి కేసులు తీసుకు రావొద్దు.”


**********


కాలేజ్ గార్డెన్ లో కనిపించిన మురళి తో

"థాంక్సండీ. మీ సిస్టర్ చాలా సహాయం చేశారు మా స్టూడెంట్ కు. ” చెప్పింది విద్య.

"పర్లేదు. ఎలా ఉంది అమ్మాయి?” అడిగాడు మురళి.

"రికవర్ అయ్యింది, బాగానే ఉంది.”

మురళి, విద్య మాట్లాడుకుంటూ వస్తుంటే,

ప్రిన్సిపాల్ బయటికి వచ్చి ఇంటికి వెళ్ళబోతూ, కొడుకు కార్లో కూర్చుని విద్యని చూపించింది అతనికి.

"ఈ అమ్మాయి గురించే నీకు చెప్పింది. మంచి అమ్మాయి, బాగా హెల్పింగ్ నేచర్, సిన్సియర్.”

అతను కూడా చూశాడు.

ఆ పక్కనున్నదెవరూ? అడిగి వివరాలు కనుక్కుని

"సరే కనుక్కో. ఆమెకు ఇంకేమైనా ఆలోచనలున్నాయేమో?” అన్నాడు తల్లితో.


తర్వాతి రోజు, విద్య తల్లి దండ్రుల్ని కలిసింది ప్రిన్సిపాల్. విద్యను కోడలుగా చేసుకోవాలన్న తన ఆలోచన చెపుతూ.

"టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. మా అబ్బాయని చెప్పటం కాదుగానీ, చాలా సైలెంట్, కోపమనేది తెలియదు. నెమ్మది. విద్య మా వాడి భార్య అయితే బాగుంటుందని అనిపిస్తుంది.”పెళ్ళి అయిన తర్వాత, ప్రిన్సిపాల్, లెక్చరర్ ఇద్దరూ ఒకే కార్లో వచ్చే వారు. కలిసి వెళ్ళేవాళ్ళు.


ఓ రోజు సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత కార్లో వెళ్తూ ఉండగా..

"చెప్పడం మర్చిపోయాను మేడమ్..” ఏదో చెప్పబోయింది విద్య

"ఇంకా మేడం ఏంటి విద్యా ? అత్తా, అత్తమ్మా ఏదో ఒకటి ట్రై చెయ్య రాదూ.”


"'మేడమ్' అలవాటయింది. అయినా చూస్తాను.”

"ఏదో చెప్పబోయావు?” అడిగింది మాలతి.

"ఇవాళ టెస్ట్, పాజిటివ్ వచ్చింది.”

"ఇంత గుడ్ న్యూస్ మామూలుగా చెప్తావే?

కారు వేరే దారిలో వెళ్ళడం చూసి.

"ఇటెక్కడికీ?” విద్య అడిగింది,

"వాడి ఆఫీసు ఇటేగా, వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. నిన్ను దించి నేను ఇంటికెళ్తాను.”

"మేమెక్కడికి వెళ్ళాలి?”

"సెలబ్రేట్ చేసుకోరూ?”

"ఏ సెలెబ్రేషన్ అయినా మీతోనే.” చెప్పింది విద్య.

ఆఫీసు ముందు గార్డెన్ మధ్య ఉన్న రోడ్ మీద కారాపింది మాలతి.

విద్య దిగిన తర్వాత,

"నువ్వెళ్ళి అబ్బాయిని తీసుకురా, నేను కారు రివర్స్ చేసి ఉంచుతాను" అంది.

విద్య గబ గబా మెట్లెక్కి వెళ్తుంటే

"విద్యా" అని పిలిచి, "నెమ్మది" అని చెప్పింది.

"అలాగే.... అత్తమ్మా.. " నవ్వింది.

ఆఫీసంతా ఖాళీగా ఉంది. ఎవరూ లేరు.

అతని రూమ్ లోనుండి మాటలు వినిపిస్తున్నాయి.

తలుపు తట్టి, ఎక్కువ సేపు ఆగకుండా లోపలికి వెళ్ళింది.

అతను, సెక్రెటరీ ఎదురెదురుగా కూర్చుని, టీ తాగుతూ కబుర్లాడుకుంటున్నారు.

ఆఫీసు చైర్ లో అతను,

అతని ఎదురుగా ఉన్న టేబిల్ మీద కూర్చుని సెక్రెటరీ,

ఆమె చీర కుచ్చీళ్ళు అతని కుర్చీ తాకుతూ..


భార్యాభర్తలు శుభవార్త తాలూకు ఆనందం పంచుకోవడానికి టైం పడుతుందని, అంతలో,


గార్డెన్ చూద్దామని మాలతి కారు దిగబోతుండగా, విద్య వచ్చి కారు దగ్గర నిలబడింది.

"అప్పుడే వచ్చేశావే? అబ్బాయి లేడా?” అంది మాలతి ఆశ్చర్యంగా

.......

"అలా ఉన్నావే? ఏమయ్యింది?”*************


"దానికీ, నీకు పోలికేంటి? అది జస్ట్ టైం పాస్. నువ్వు భార్యవు.”


"అదీ, ఇదీ అనొద్దు.”


"నిన్ను చూస్తే నవ్వొస్తుంది. సెక్రటరీని నా పక్కన చూసి తట్టుకోలేవు గానీ, మళ్ళీ దాని మీద గౌరవమున్నట్టు సూడో నిజాయితీ.”

ఊపిరాడనట్టు అనిపించి, 'వెళ్ళిపోవాలి.' అనుకుంది.


"ఒక వేళ చూడకపోయి ఉంటే నాతో బాగానే ఉండేదానివి కదా?”

'మాట్లాడటం దండగ.'

"నేను చాలా నయం. నా ఫ్రెండ్స్ సంగతులు వింటే ఏమవుతావో? వాళ్ళ భార్యలందరూ కాపురాలొదిలేసుకుని పరిగెత్తుతున్నారా? “


"వాళ్ళ సంగతి నాకెందుకు? ”

"నీకూ, మురళి కూ మధ్య ఏమిటని అడిగానా?”

"ఏం మాట్లాడుతున్నావ్?" లేచి నిల్చుంది

"కూర్చో, ఎందుకూ కోపం? కూల్, కూల్. కాలేజ్ లో ఎన్నో సార్లు మీరిద్దరూ క్లోజ్ గా ఉండటం చూశాను. నేనేం నిన్ను నిలదీయ లేదే.”

"నిలదీయడానికి నేనేం చేశాను?”

"నేను మాత్రం ఏం చేశాను?”


**************


"ఇంత చిన్న విషయానికి కాపురమొదులుకుంటారా? చూసీ చూడనట్టు ఉండాలి.”

"నా వల్ల కాదు అమ్మా.”

"రేపు పిల్ల పుడితే ఎట్లా చెప్పు. మనసు సరి చేసుకోవాలి. మగాణ్ణి ఆకట్టుకోవాలి, అతడి ధ్యాస నీ మీదే ఉండేట్టు చేసుకోవాలి, చాతకాని దానిలా వెళ్ళనంటావ్?”

"అబ్బ ఛీ, ఏం మాటలమ్మా అసహ్యంగా? ” చిరాకు గా అంది విద్య.

"మరెలాగే, పోనీ అవేవో మందులు మింగు. ఎందుకొచ్చిన లంపటం . పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు, రేపేదైనా సంబంధం వస్తే వీడు శాడిస్ట్ అని చెప్తే సరిపోతుందిలే.”

"ఇప్పుడు ఆ సంగతెందుకు?”

" బిడ్డ మాత్రం ఎందుకూ? కాళ్ళ కడ్డం.”*********"ఏవిట్రా ఎప్పుడు చూసినా లింగు లింగు మంటూ ఒక్కతే ఒస్తుందీ, మీ ప్రిన్సి పాల్ కొడుకు రాడే, తోడు?” మురళితో అంది వాళ్ళ అక్క.

"అతనెందుకు?” అడిగాడు మురళి.

"అతనెందుకేవిట్రా, వూళ్ళో మొగుడుండి, పెళ్ళామొక్కతే చెక్ అప్ కు రావడం నేనెప్పుడూ చూడలేదు . కనీసం కాన్పు టైమ్ కన్నా వొస్తాడంటావా?”

"వాళ్ళు కలిసి ఉండటం లేదక్కా.”


"ఏం మాయరోగం ? అయినా ఆ పిల్లకు కాపురం చేసే గుణాలు లేవని అప్పుడే అనుకున్నాన్రా?”

" ఎప్పుడు?”

"అప్పుడో దిక్కుమాలినదాన్ని తీసుకొచ్చావే, దాని అబార్షన్ బిల్లు ఈవిడే వొచ్చి కట్టింది.”

" ఆ అమ్మాయికి బిల్లేశావా? ఫ్రీ గా చేస్తావనుకున్నా..” నొచ్చుకున్నట్లు అన్నాడు మురళి

"ఫ్రీ ప్రాక్టీసు చేసి, ప్రొఫెషన్ ని అవమానించలేన్రా. బావగారి చుట్టాలైనా నేను ఫీజు తీసుకోకుండా చూడను. అది సరేరా, ఇంతకీ ఏవిటీ గొడవ మీ పంతులమ్మకూ..”

"వివరాలు తెలియవు.”

"ఏముందిరా, దీనికి ఎవడితోనో కడుపొచ్చింది. అది దాచిపెట్టి, పెళ్ళి చేసుకుంది. దీని నాటకం తెలిసి , బయటికి తరిమి ఉంటాడు.”

"అక్కా, ప్లీజ్. నీకు దణ్ణం పెడతా.....”


"ఏవిట్రోయ్, ఈగ వాలనియ్యటం లేదు. కొంప దీసి, దాన్ని చేసుకుంటానంటావా ఏం ఖర్మ, అమ్మా నాన్న, నేను విషం పుచ్చుకోవాలి.”


'అప్పుడప్పుడు నువ్వూ మంచి విషయాలే చెప్తావక్కా.'***********

వేరే కాలేజికి బదిలీ చేయించుకుంది విద్య.

మాలతి, విద్య పనిచేస్తున్న కాలేజి కి ఎగ్జామినర్ గా వచ్చిన సందర్భం లో, ఆమెను ఇంటికి పిలిచింది విద్య.

"బాగున్నారా మేడమ్? కాలేజ్ ఎలా ఉంది?.” విద్య మాలతికి కాఫీ ఇస్తూ,

" స్టూడెంట్స్ నీకోసం అడుగుతున్నారు. నీకెలా ఉంది ఇక్కడ?”

"మొదట్లో కొత్త గా ఉండేది. ఇప్పుడు అడ్ జస్ట్ అయ్యాను.”

పాప నిద్ర లేచింది.

మాలతి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది.

" ...మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు.”

"అలాగా..”

"నువ్విలా ఎన్నాళ్ళు?”

“.........”

"వంటరిగా లేదూ..”

"పాప ఉందిగా...”

"ఏమనుకోనంటే ఒక మాట ..”

".......”

"నా వల్లే నీకు అన్యాయం జరిగింది విద్యా. నేనే నిన్ను పెళ్ళికొప్పించాను”

"అలా అనుకోవద్దు మేడమ్. ఇలా జరుగుతుందని మీరు అనుకోలేరుగా?”

"నిజమే కానీ.....మురళి తెలుసుగా, నువ్వంటే మంచి అభిప్రాయం. ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు... ఆలోచించు.”

"వద్దు మేడమ్.”

"మంచి వాడు విద్యా..”

"జరిగింది మర్చిపోయినట్లు రోజూ నటించాలి. త్యాగం భరించడం కష్టం.”

మాలతి చేతుల్లో నుండి బిడ్డను తీసుకుని,

"నాకిలాగే బాగుంది మేడమ్.”
36 comments:

కృష్ణప్రియ చెప్పారు...

హ్మ్...

మెడ చుట్టూ ట్రాఫిక్ జామ్ :)

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హ్మ్...

sunita చెప్పారు...

KRshNa gaari comment copy paste!!

రాజేష్ మారం... చెప్పారు...

Nice. . .

Sravya Vattikuti చెప్పారు...

ఏంటో ఏమి చెప్పాలో తెలియటం లేదు :((

మీ నేస్తం చెప్పారు...

గజిబిజి గా అనిపించింది కధ...

మధురవాణి చెప్పారు...

హుమ్మ్... నాదీ శ్రావ్య కామెంటే! :(

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) చెప్పారు...

బావుంది.

"జరిగింది మర్చిపోయినట్లు రోజూ నటించాలి. త్యాగం భరించడం కష్టం.”

ఆమె నిర్ణయం నాకు నచ్చింది. మామూలుగా అమే జీవితం ముందుకి సాగిపోతూ త్యాగాలూ గట్రా లేకుండా ఆమెని ఆమెగానే నచ్చేవాళ్ళలో అమెకి ఎవరోకరు నచ్చొచ్చని ఆశించొచ్చు. She should moveon..

only thing that matters is .. she should be happy with her choices and her happiness should not be at the cost of the values she beleives in..

I liked the characterization of her :)

Chandu S చెప్పారు...

కృష్ణప్రియ గారూ,

Thanks for reading

రాజేష్ మారం... గారూ,

Thanks

శ్రావ్య గారూ,

Thank you.

Chandu S చెప్పారు...

నేస్తం గారూ,
గజిబిజి గా ఉందా? సారీ అండీ

Chandu S చెప్పారు...

మధురవాణి గారూ,

స్వాగతం.

Thanks

Chandu S చెప్పారు...

సునీత గారూ,
Thank you

Chandu S చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ,

Thanks for reading

Chandu S చెప్పారు...

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) గారూ,

'ఆమె నిర్ణయం' మీకు నచ్చినందుకు సంతోషం

yaramana చెప్పారు...

Chandu S గారు..
మీ కొత్త టెంప్లేట్ బాగుంది.
నిమ్మకాయ బద్దలు పొయ్యి.. టమేటో ముక్కలోచ్చాయ్!
మీ కథ అర్ధం చేసుకోటానికి కష్ట పడ వలసి వచ్చింది.
విద్య, లత, మాలతి.. too many names.. తికమకగా అనిపించింది.
లత బ్రేకేజ్ కి విద్య ఎందుకు సైన్ చేస్తుంది?
స్టూడెంట్ సంతకాలు తీసుకుని తరవాత ఫీజుల్లో వసూలు చేస్తారనుకుంటా!
మీ సబ్జక్ట్ కాబట్టి obstetricians గూర్చి నేను రాయ కూడదు.
కానీ.. నాకు incongruent గా అనిపించింది ఏమనగా..
మురళి అక్క లాంటి డబ్బు జబ్బు డాక్టర్లు నైతిక విలువల గూర్చి మాట్లాడరు.
ఇంకా ఎక్కువ డబ్బులు గుంజే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తారు.
డబ్బు జబ్బు డాక్టర్లు చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు.
నాకెందుకో చాలా పెద్ద కథ nutshell లో చదివినట్లు అనిపించింది.
మంచి కథ రాశారు. అభినందనలు.

Chandu S చెప్పారు...

విద్య సైన్ చెయ్య లేదు. విద్య టేబిల్ మీద లత తో సైన్ చేయించాడు.

నిజమే, బ్రేకేజ్ కు డబ్బులు కట్టించుకుంటారు కదా. కానీ, నేను చాలా సార్లు సంతకాలు పెట్టానే, కెమిస్ట్రీ లాబ్ రిజిస్టర్ లో. ఎక్కువ పగల గొట్టి ఉంటాను.

పెళ్ళికాని వాళ్ళకు చెయ్యనని ముందు అలా రంకెలెయ్యడం మామూలు. తర్వాత, నెలకింత అని పెళ్ళి అయితే ఒక రేటు. కాక పోతే డబుల్. ( ఈ వివరాలు ఎడిటింగ్ లో పోయాయి)

పెద్దకథలు రాస్తే ఎవరు చదువుతారు, కాఫీ అయిపోయే లోపల కథ అవ్వాలి అని ఒక కండిషన్ ( ఇంట్లో)

నిజానికి ఇది పెద్ద కథే, రెండు పార్ట్ లాగా రాశాను. మొదలెట్టిందిరా, జెమిని డైలీ సీరియల్ అనుకుంటారని, మొహమాటానికి పోయి కట్ చేస్తే...

ఇలా తిక్కగా తయారయింది.

Sorry for the confusion. Thanks for reading and the comment

రసజ్ఞ చెప్పారు...

నాకు కూడా కొంచెం గజిబిజిగానే అనిపించింది. రెండు సార్లు చదవినా ఎందుకో క్లారిటీ రాలేదు! మీరు తీసుకున్న అంశం బాగుంది!

Chandu S చెప్పారు...

రసఙ్ఞ గారూ,

Welcome to the blog,

Sorry for the inconvenience and it's 'coz of too much of editing.

Thanks for reading.

nirmal చెప్పారు...

chandu s garu,
katha chaala speedga unnantlumdi.ending confusion. next part unndaa ledo arthamkavatamledu.any way good going.

Mauli చెప్పారు...

Nicely written,

ఆమె నిర్ణయం పైనే కొన్ని స౦దేహాలు. యద్దన పూడి నాయికలు కి ఏ మాత్రం తగ్గారు మీ కధానాయికలు :)

అదే తప్పుని ఆమె చేసినా, ఆమె నే వెళ్లిపోవాలి పిల్లలతో సహా . ఇదే అర్ధం కాదు నాకు . అతనికి ఒక అవకాసం ఇచ్చి ఉండాల్సింది అని అనడానికి వీల్లేకుండా అతని సమాధానాలు వ్రాసారు :)

@"మరెలాగే, పోనీ అవేవో మందులు మింగు. ఎందుకొచ్చిన లంపటం . పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు, రేపేదైనా సంబంధం వస్తే వీడు శాడిస్ట్ అని చెప్తే సరిపోతుందిలే.”

కెవ్వ్..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ :)

Chandu S చెప్పారు...

మౌళి గారూ,

స్వాగతం.

చదివినందుకు, కామెంట్ కు ధన్యవాదాలు.

Thanks for visiting the blog.

nirmal చెప్పారు...

mouli garu chakkati comment raasaru.wonderful.good thought process.mouli garu hatsoff to u.

Zilebi చెప్పారు...

బాగుందండీ కథ, ఆ గజిబిజి నాకు మాత్రమె అనుకున్నాను, కామెంటులు చదివాక కాదని తేలి పోయిందిఅనుకుంటాను. . గజిబిజి ఆ ఒకేలా ఉన్న పేర్ల వల్ల వుండవచ్చు, కాక విరుపులు సరిగ్గా లేక ఉంది వచ్చు అనుకుంటాను. మంచి ప్రయత్నం. ఆఖరి పార్ట్ మునుపు పెట్టి మొదటి పార్ట్ ఆఖరున పెట్టి ఉంటె, మల్లాది స్టైల్ అబ్బేది. మంచి ప్రయత్నం.

అజ్ఞాత చెప్పారు...

ఆమె నిర్ణయం బాగుంది.

ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థమయ్యేలా మళ్ళీ తిరిగి వ్రాస్తే బాగుంటుందేమో. ఆలోచించండి.

Chandu S చెప్పారు...

జిలేబి గారూ,

Welcome to the blog.

కొద్ది కొద్దిగా మార్పు చేసి రాశాను.

Thanks for the comment

Chandu S చెప్పారు...

బోన గిరిగారు,

welcome to the blog.

సలహాకు కృతఙ్ఞతలు.

వీలైనంత వరకూ రిపైర్ చేసి, గజిబిజి తగ్గించే ప్రయత్నం చేశాను.

బొందలపాటి చెప్పారు...

మీరేమీ అనుకోక పోతే, ఒక చిన్న ఉచిత సలహా, రాసేటప్పుడు "ఇతరులని మెప్పించాలి" అని రాయకండి. (ఇతరులని మెప్పించటం లో నే మీకు ఆనందం ఉంటే..అది వేరే విషయం అనుకోండి..మీరు పేద్ద పేరు డబ్బు వంటి వాటిని ఆశించే అమాయకపు ఆలోచనలు చేయటంలేదనే అనుకొంటున్నాను.) మీకు నచ్చింది మీరు రాయండి. అది ఇతరులకి నచ్చితే మంచిదే! లేక పోతే ఆత్మ తృప్తి అన్నా మిగులుతుంది. అలానే నిడివి.... ఇవాళ కాఫీ తాగే టైం అంటారు, రేపు బెల్ట్ పెట్టుకొనే టైం అంటారు..వీటిని పట్టించుకోకుండా మీకు నచ్చిన మంచి కధ రాయండి. జనాలకు టైం లేక పోతే వాళ్ళకోసం customized package ఇవ్వటానికి ఇది mobile plan కాదు కదా..! జనాలు mobile plan ని కొంటే కంపెనీ కి డబ్బు ఐనా వస్తుంది. నెట్లో ఉబుసుపోక ఉచితం గా చదివే నా బోటి వాళ్ళని మెప్పించటం వలన మీకేమొస్తుంది? :-)

అజ్ఞాత చెప్పారు...

యద్దనపూడి లా వంటింటి పేరక్క రచనలు కాక బీనా దేవి లా పదునైన రచనలు చేస్తున్నారు. అభినందనలు.

Chandu S చెప్పారు...

andhrudu గారు,

Thanks for the comment.

బీనా దేవి రచయిత్రి కాదనుకుంటా, నాకు తెలిసి,

ప్రముఖ రచయిత బి..నర్సింగరావు కలం పేరు బీనా దేవి.

మీ నేస్తం చెప్పారు...

ఇప్పుడు బాగుంది అండి కధ నాలాంటి మందమతులకి కూడా అర్దం అయ్యెటట్టు

అజ్ఞాత చెప్పారు...

Beenadevi is the common pen name of both Narasinga Rao and his wife bala tripura sundari

ఆ.సౌమ్య చెప్పారు...

very well written!

I appreciate her decision!
Ditto Weekend Politician comment!

జ్యోతిర్మయి చెప్పారు...

శైలజ గారూ మురళిది త్యాగం అని ఎందుకనుకోవాలి? అతని మనస్తత్వం పట్టి చూస్తే నాకలా అనిపించలేదు. పైగా విద్య అంటే ఏమిటో అతనికి పూర్తిగా తెలుసు.

Chandu S చెప్పారు...

జ్యోతిర్మయి గారు, కామెంటుకు ధన్యవాదాలు.

ఈమెను పెళ్ళి చేసుకోవడానికి అతను ముందుకు రావడం అభినందనీయమే. అంతకు ముందే పెళ్ళయిన స్త్రీని, తనది కాని బిడ్డతో సహా, ప్రేమించగలిగేంత విశాలంగా మగవారు ఆలోచించాలి అనుకోవడం పురుషుల మీద ఏదో వత్తిడి తీసుకొచ్చినట్లు అనిపించింది.

ఒకవేళ అదే పరిస్థితిలో నేనుంటే అని ఆలోచిస్తే , పెళ్ళయిన పురుషుడిని అతని పిల్లలతో సహా ఆమోదించగల విశాలభావాలు నాలో లేవు. అందుకనేనేమో ఎంత మభ్యపెట్టుకున్నా, అతనిది త్యాగమే నాకు అనిపించింది. నా అభిప్రాయం తప్పు కావొచ్చు.

అంతటి విశాల హృదయులు ఉండివుండొచ్చు.

Pavani చెప్పారు...

ప్రస్తుతం ఇండియా చట్టాల ప్రకారం విద్య భర్తని భ్రస్టు పట్తించడం అతి తేలిక. నిజానికి అతను కోర్ట్ల చుట్టూ తిరగటానికీ ఈమె మరో పెళ్ళి చేసుకుని కొత్త జీవతం ప్రారంబించడానికే అవకాశాలెక్కువ. ముఖ్యంగా విద్యాధికురాలైన విద్య లాంటి విషయంలో. అలా చెయ్యలేదంటే నిజమైన త్యాగధని ఈకధలో విద్య మాత్రమే. మిగిలిన వారు జస్ట్ వాళ్ళ పేర్లు ఎవైతే వాళ్ళు.

Raja Prathigadapa చెప్పారు...

@chandu s garu:katha mariyu comments chadivanu...kadupubba navvinchey kathalu rasey mee nunchi ilanti katha ravatam valla pathakulu konchem gajibiji ki lonayyaru ani anukunttunna....

pothey..starting lo ammayi abortion katha asalu main kathaki sambhandham lekunda undi...

chivaraga..Chalam gari rachanalaku daggaraga undi mee katha...rating ki atheethamaina katha..so bagundi balenidi aprasthutham..this is a philosophy

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి