19, మార్చి 2012, సోమవారం

TAKE A BREAK       
      TAKE A BREAK 

    కొన్ని నెలల క్రితం మొదలెట్టిన ఈ బ్లాగు ఒక ఇష్టమైన వ్యసనం లా మారిందివృత్తి లో టైము బాగా లాగేస్తూ, ఒక అర్ధం చెప్పింది. (బ్లాగు - టైం బాగా లాగేసేది.) 
  పని లో కొన్ని అదనపు బాధ్యతలు తోడయినందువల్లబ్లాగు లో వ్రాయడం మరికొన్ని నెలల వరకు కుదరని పరిస్థితి కనపడుతోంది
 ఈ బ్లాగు కు కారణమైన వారు చాలా గౌరవనీయులు. ఈ వ్రాత వ్యసనం లో ఉన్న ఆనందం రుచి చూపించినందుకు కృతఙ్ఞత తెలియజేసుకుంటున్నాను.

  ఇప్పుడు నువ్వు రాయక పోతే ఏవిటమ్మా సైలెంట్ గా ఉండు, దానికీ ప్రకటన ఎందుకూ అని మీకనిపించొచ్చు. బ్లాగు పెట్టడానికి కారణమైన శ్రేయోభిలాషులకూ, దీని వల్ల పరిచయమైన స్నేహితులకూ ఒక ముక్క చెప్పాలికదా..అదే.. 

కృతఙ్ఞతలు.

    వ్యసనం మానడం అంత తేలిక కాదుగనక పొరపాటున ఎప్పుడైనా ఒక పోస్ట్ పెడితే మొన్న బ్రేక్ అన్నావు, అప్పుడే మాట బ్రేక్ చేసావే అని చిరాకు పడకండి.

14 comments:

సిరిసిరిమువ్వ చెప్పారు...

Have a nice break..

Sravya Vattikuti చెప్పారు...

:( నాకు నచ్చలేదు ఈ పోస్టు :X

కొత్తావకాయ చెప్పారు...

సమయాభావం అన్నారు.. అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆశ మానవసహజం కదా.. మీ వ్యసనం మిమ్మల్ని వదలకూడదని ఆశపడుతున్నాం. :)

ఉష చెప్పారు...

బ్లాగింగు నుండి విశ్రాంతి ఒక రకంగా మంచిది. కొన్నాళ్ళు నచ్చినట్టు వుండి తిరిగి బ్లాగింగుకి వస్తారని ఆశిస్తాను. మీ బ్లాగులో ఇదే నా తొలి వ్యాఖ్య. కానీ, కొన్ని మునుపే చదివి ఉన్నాను, సరదా పడ్డాను కూడా. నిజానికి మీ అమ్మగారిని గూర్చి జీవని లో చదివి ఇంకా చాలా సంతోషపడ్డాను.

పోతే, మీరున్న ఈ స్థితికి నేను 3 సార్లు వచ్చి - దాన్ని మానేజ్ చేసాకనే - ఇవాళ్టి స్థాయికి వచ్చాను, (అంటే ఎంత వరకు బ్లాగింగ్ సబబు అన్న దానిపై అవగాహనకు). మీ ప్రకటనలో బ్లాగింగ్ పట్ల మక్కువనే కనబరిచారు.

మీరన్న "సమయాభావం" ఒకటే కాదు, అనుభవం మీద చెప్తున్నానిది -

బలహీనత - అదివున్న వ్యక్తికే నచ్చపోవచ్చు. ఎదుటివారికీ నచ్చకపోవచ్చు. కానీ దాన్ని తొలగించుకోలేకపోవచ్చు.

వ్యసనం - మొదట్లో ఆనందాన్ని ఇస్తుందేమో కానీ పోగా పోగా నలిబిలిచేస్తుంది.

ఇవి సూక్షంగా వీటిపట్ల నా అభిప్రాయం. బ్లాగింగ్ ని కేవలం అభిరుచి పాత్రలో ఇమడ్చలేము. అది పైకి ఉబికి ఈ 2 రూపాలకీ నిచ్చెన వేస్తుంది.

నేను బ్లాగింగు మానేయడానికి/తగ్గించటానికి ఉన్న కారణాల్లో మరొకటి; బ్లాగర్లతో దగ్గరితనం, చనువు పెరిగిపోతూ లేని మొహమాటాలు మొదలయ్యాయి. ఇష్టమున్నా లేకపోయినా తప్పక చెయ్యాల్సొచ్చే కొన్ని పనులు. అంతర్జాలం లో తిరిగేదే ఒకరకమైన ఊహాలోకపు అనుభూతికోసం. నిర్మొహమాటమైన మనిషిని బయటపెట్టుకోవడం కోసం. అది నాకు దూరమైపోతున్నందుకు వదిలేయాలనిపించింది.

మీ ఈ విరామం లో బ్లాగింగ్ ని ఎలా రీఅలైన్ చేసుకోవాలో ఆలోచించి వస్తారని ఆశిస్తూ.

Chitajichan చెప్పారు...

nenu morning coffee time lo chadive blogs lo meedi no. 1
meeru ila brk teesukunte... naku coffee cheedu ayipotundi..

manchi aani muthyalu miss ayipotaamemo anipistundi..

Asta la Vista..

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

Well said. Take your own time to write further stories and write ups. What all we write need not be published but can be stored and release one by one when we are hard pressed for time.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

"...ఈ బ్లాగు కు కారణమైన వాళ్ళను తిట్టుకోబోయాను..."


ME!!!

Zilebi చెప్పారు...

హమ్మయ్య ! ఒక బ్లాగు తగ్గె చదవడానికి !

:))

జిలేబి.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడంతా బ్రేక్ ల సీజన్ నడుస్తున్నట్లుంది. మొన్న నెవరో అన్నట్లు, పెళ్ళిళ్ళ మార్కెట్లో అమ్మాయి హవా నడుస్తోందన్నట్లు.మరో మాట, ఈ వ్యసనం తొందరగా వదలదు. వైరాగ్యలు గురించి చెప్పేను ఒకప్పుడు. ఈ బ్లాగు వైరాగ్యం కూడా అటువంటిదే. త్వరలో తిరిగొచ్చేస్తారు, అది నా ప్రగాఢ నమ్మకం, కాదు నిశ్చితాభిప్రాయం.

సుభ/subha చెప్పారు...

In this break have so many kitkats anDii ;);)..But don't take too much gap. All the best.

sridharjatla చెప్పారు...

i feel very sad to read this post. This is the first post of yours that i did not like

రాజ్ కుమార్ చెప్పారు...

తొందరగా వచ్చెయ్యండీ ఓ... రెండు మూడు రోజుల్లో... ;) ;)
హేవ్ ఎ నైస్ బ్రేక్.. ః౦

ఆ.సౌమ్య చెప్పారు...

అబ్బే...మీ వ్యవహారం నాకేమీ నచ్చలేదండీ :(
సరే, తొందరగా వచ్చేయండి....ఎదురు చూస్తూ ఉంటాము.

Narayanaswamy S. చెప్పారు...

బ్రేక్ తీసుకోండి గానీ రాయడం మానెయ్యొద్దు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి