continued from అతడు-ఆమె -3
విజయాల్ని చవి చూస్తోన్న అతని చూపుల్లోని ఆత్మవిశ్వాసం అడుగుల్లో కూడా వినిపిస్తోంది. నిల్చున్న చోటినుండి భవిష్యత్తు చూశాడు. అన్నీ ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. తన చుట్టూ వాతావరణం అంతా ప్రత్యేకంగా ఉండాలి. ఆమె పై ఓ నిర్ణయానికొచ్చాడు.
సూర్యుడు సాయం సంధ్య కు రంగులద్ది వెళ్తున్నాడు. ఆకాశం నిండా ఎన్నో రంగులు. ఏ ప్రత్యేకతా లేని లేత రంగు చీరలో , ఆమె కూడా ఆకాశం లో ఓ రంగులా కలిసిపోయి ఉంది. ఆమె నిల్చోవడం లో ఎప్పుడూ లేని నెమ్మది. ఆమె పరిస్థితి తెలిసినట్లు , గాలి కూడా నిశ్శబ్దంగా వీస్తోంది, ఆమె జుట్టుని అల్లరి పెట్టకుండా.
కూర్చోమని ఆమె అనలేదు.
ఆమె అనలేదని అతను కూర్చోలేదు.
“వచ్చిన వాళ్ళకు మంచి నీళ్ళు కూడా ఇచ్చేది లేదా?”
“మంచినీళ్ళకోసం ఇన్ని మెట్లెక్కి రావాలా రాజూ?”
“ఇదిగో, ఈ వెటకారాలే..” అని ఏదో అనబోయి ఆగి .” సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.”
“రాజూ, నేను కూడా నీతో ఒకటి చెప్పాలి.”
“ఎవరిదో ఇల్లో వాకిలో చక్కబెట్టే పని వచ్చిందంటావు అంతేగా. నువు మొదలెడితే నన్ను మాట్లాడనీయవు. నీ డబ్బు వీలైనంత త్వరలో రెండు మూడు ఇన్స్టాల్ మెంట్స్ లో తీర్చేస్తాను.” అంటూ మొదటి విడత చెక్ ఆమెకు ఇచ్చాడు.
ఆమె అందుకోలేదు.
“అంతా ఒకే సారి ఇస్తేనే తీసుకుంటాను.” ఎన్వెలప్ అందుకోకుండా అంది.
“ఇచ్చినప్పుడు తీసుకో. తర్వాత నేను తీర్చకపోతే నీకే నష్టం. “
“పర్లేదు. నువ్వు తిరిగి ఇస్తావని , నేనివ్వలేదు.”
“మనిద్దరికీ చాలా గొడవలుగా ఉంటోంది. మన ఫ్రీక్వెన్సీలు అస్సలు కలవవు.”
“గొడవలా, ఏం గొడవలు?” గుర్తుతెచ్చుకోబోయింది. “ఆ మాత్రం ..అందరు భార్యాభర్తల మధ్యా ఉంటాయిగా రాజూ.”
“ ఉండవు. అందరూ భర్తల్ని ఎంతో బాగా చూసుకుంటారు. నీకసలు నేనంటే గౌరవం లేదు. ప్రేమ లేదు. తిన్నానో తినలేదో పట్టించుకోవు. ఇంటి మీద, భర్త మీద శ్రద్ధ తక్కువ.”
“నీ కంప్లైంట్స్ అన్నీ ఓ పేపర్ మీద టైప్ చేసి ఇవ్వు. తీరికగా చదువుకుంటా. ముఖ్యమైన వాళ్ళ ఇల్లు డిజైన్ చేస్తున్నాను. చాల పనుంది. తర్వాత మాట్లాడుకుందాం.”
“ఊళ్ళో వాళ్ళ ఇళ్ళు ముఖ్యం. నీ కాపురం కూలిపోయినా నీకు పట్టదు.”
చివరి మాటల్లో వందన వినిపించింది.
“వందన గారి చిలక బాగానే మాట్లాడుతోందే..”
“మేడం ను ఒక్క మాటంటే ఊరుకోను.” ఆవేశంగా అన్నాడు.
అతనితో వాదన అనవసరమనిపించింది.
“సరే విషయమేంటో చెప్పు.”
“ఎప్పుడూ సున్నితంగా ఉండవు. ఎప్పుడు చూసినా మగరాయుడిలా ఆ స్కూటీ మీద ఇల్లు పట్టకుండా తిరుగుతావు. అందం మీద శ్రద్ధ లేదు.
" రాజూ. నా ఇష్టమొచ్చినట్లు నేనుంటాను. అలంకారం చేసుకోవాలా వద్దా అనేది నా స్వంత విషయం. ఫిజికల్ అప్పియరన్స్ గురించి మాట్లాడొద్దు."
“అందరూ భర్తనెలా చూసుకుంటున్నారో చూసి కూడా నేర్చుకోవు.”
“సరే రాజూ, I accept that. నాకలాంటివి తెలియదు.”
“తెలియకపోతే పెళ్ళెందుకు చేసుకున్నావు?”
“తెలియక చేసుకున్నాను.”
“ఇదిగో ఈ అతితెలివే నీ కొంప ముంచుతోంది.”
“ఇంతకీ ఏమంటావు రాజూ.”
“నాకూ, నీకూ పడదు. విడిపోదాం.”
“విడిగానే ఉంటున్నాంగా రాజూ, , ఇంకేం విడిపోదాం? వంట్లో బాలేదా ?”
దగ్గరగా వచ్చి నుదిటిపై చెయ్యి పెట్టబోయింది.
తోసేశాడు. “ఐ హేట్ యువర్ బిహేవియర్.”
అతని కంఠంలో తీవ్రత పసిగట్టింది.
దూరంగా నిల్చుంది.
ఎన్నో కంప్లైంట్లు, అవీ ,ఇవీ గుర్తున్నవన్నీ చెప్పాడు.
“ఇవన్నీ సరే, నీకేం కావాలి?”
“మనిద్దరం విడిపోదాం. డివోర్స్ తీసుకుందాం.”
జరుగుతున్న సంఘటనలు కొన్నింటిని, అతని ధోరణిని కలిపి, మైండ్ చకచకా కేలిక్యులేషన్ మొదలెట్టింది. త్వరగానే వచ్చింది జవాబు. ఇంకా త్వరగా సరైన నిర్ణయాలు తీసుకోవడం ఆమె ప్రత్యేకతని ఆమెతో పనిచేసే వారు అంటూ ఉంటారు.
ఆమె వినిపించుకోలేదేమోనని మళ్ళీ అన్నాడు.
“డివోర్స్ తీసుకుందాం.”
“ఓస్. దానికింత గోలెందుకు. ఆ మాటేదే ముందే చెప్తే ఓకే అనేదాన్నిగదా. నామీద బురద జల్లితే కానీ విడాకుల విత్తనం మొలకెత్తదా?”
“అంటే నీకేం పర్వాలేదా? నీకేమీ బాధ లేదా?”
“ గ్రో అప్ రాజూ, నువ్వు విడిపోతానంటే నేను దొర్లి ఏడుస్తాననుకోవడం టూ మచ్. నీకింత ఆశావాదం పనికి రాదు. “
“అంటే నేను వేరే పెళ్ళి చేసుకుంటే…”
“ఆ డెకరేషన్ గోల మళ్ళీ నాకు పెట్టకు, నాకస్సలు ఖాళీ లేదు. “
ఆమె నిర్లక్ష్యం అతనికి చెంప చెళ్ళుమనిపిస్తోంది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
“ఎంత కావాలో చెప్పు.”
“ఏంటీ..ఎంత …”
“అదే భరణం. ఎంత కావాలో చెప్పు అరేంజ్ చేస్తా..”
“నీకెంత కావాలో చెప్పు. నేనూ అరేంజ్ చేస్తా!”
“ఇదిగో.. ఈ తలబిరుసుతనమే నిన్నిక్కడి వరకూ తెచ్చింది.”
“నేనున్నచోటే ఉన్నాను రాజూ. ఇక్కడికి వచ్చిందీ, ఎక్కడికో పోతోంది నువ్వే.”
“ఎప్పుడో తప్పకుండా పశ్చాత్తాప పడతావు.”
“థాంక్స్ ఫర్ ది డబ్బింగ్ రాజూ, నా డైలాగ్ కూడా నువ్వే చెప్పావు. ఇంక పోయిరా. “
అతను వెళ్ళిన తర్వాత సంధ్య లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని, నైట్ సూట్ వేసుకుంది. విప్పిన చీర తీసి మడతలు పెట్టి అల్మైరా లో అన్నింటికన్నా అడుగున పెట్టింది.
******
చట్ట ప్రకారం సంధ్యతో విడిపోడానికి, నందనతో పెళ్ళి కి కొంత టైం పట్టింది. భాస్కర్ వ్యతిరేకించినా, వందన మాత్రం తల్లిదండ్రులను ఒప్పించడంలో, పెళ్ళి జరగడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. సంధ్య మళ్ళీ రాజు జీవితంలోకు అడుగు పెట్టకూడదన్న షరతుతో పెళ్ళి అయింది.
తనలాంటి భర్త దొరికినందుకు నందన జీవితాంతం సంతోషంగా ఉండాలి. నందనకు కష్టమనేది ఎరగకుండా చూసుకోవాలి. తనను దూరం చేసుకున్నందుకు సంధ్య కుమిలిపోవాలి. ఆ కసి తో ఎదురుగా ఉన్న లక్ష్యం మీద దృష్టి పెట్టాడు. అతనికి ప్రతి మెట్టులోనూ విజయం. విజయానికి తగ్గ సంపద.
భాస్కర్ , రాజూ ఇద్దరూ కలిసే బిజినెస్ చేస్తున్నా, నిర్ణయాలన్నీ రాజే తీసుకునే వాడు. మొదట్లో భాస్కర్ అంతగా పట్టించుకోలేదు కానీ, మెల్లగా అతనక్కడ ఎందుకు పనిచేస్తున్నాడూ, ఏం చేస్తున్నాడో అతనికే తెలియకుండా ఉంది.
రాజుకు, భాస్కర్ పట్ల అభిమానమున్నా, అతన్ని అమాయకుడైన పెద్దన్నయ్యలా భావించి అన్ని నిర్ణయాలు తనే తీసుకునేవాడు. తమ కింద పని చేసే వారి ముందు రాజు మాత్రమే కనిపించేవాడు.
రాజు బిజినెస్ లో పాటించే షార్ట్ కట్ పద్ధతులకు రాజీపడుతూ, భాస్కర్, అతనితో కలిసి నడవలేకపోయాడు. కొన్నాళ్ళకు, రాజు మాత్రమే యజమాని అని కింద పనివాళ్ళు భావిస్తున్నారని తెలిసిన తర్వాత అతనక్కడ ఇమడలేనని తెలుసుకున్నాడు. దాంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టాడు.
అతనా ఆలోచనలలో ఉండగా రాజు రహస్యంగా తీసుకున్న నిర్ణయం అతన్ని బాధించింది. అది , వందన గ్రూప్ ఆఫ్ హోటల్స్ విస్తరిస్తూ, రెండవ హోటల్ కొనడం . నిజానికి , వందన పుట్టిన రోజు సందర్భంగా, భాస్కర్ కు ఆ హోటల్ మీద అన్ని అధికారాలు ఇచ్చి వారిద్దరినీ సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాడు రాజు.
వందన పుట్టినరోజు కు కొన్ని రోజుల ముందు , తామిద్దరి మధ్యా, స్నేహం నిలబడాలనే కోరికతోనే బిజినెస్ నుండి తప్పుకుంటున్నట్లు , బిజినెస్ లో తన బాధ్యతలు, హక్కులూ అన్నీ రాజు పేరిట బదిలీ చేస్తూ ఒక లెటర్ వ్రాసి భాస్కర్ వెళ్ళిపోయాడు.
*******
నందనతో జీవితం మొదలైంది. అందరి లాంటి ఆడపిల్ల కాదని తొందర్లోనే తెలిసింది. ఆమెకు చాలా అరుదుగా కోపం వస్తుంది. ఒక వేళ కోపం వస్తే , మొదట ఆమె చిరునవ్వు నవ్వుతుంది. ఆమెకూ ఆవేశానికీ ఆమడ దూరం.
భర్తతో ఆమె ఎప్పుడూ వాదించదు. విభేదించదు. చిరునవ్వుతో, మెత్తని మాటతో ఆమెకు కావలిసినది చేయించుకోగలదు. ఎదురుగా నిలబడి ప్రతిఘటించడం లాంటి తెలివి తక్కువ పనులు చేయదు.
నందన తో జీవితం, అందమైన ఓడలో సముద్రం మీద ఏ కుదుపులూ లేని ప్రయాణం లాంటిది. ప్రయాణం లో కుదుపులే కాదు. వేరే మనుషులూ , చెట్టూ చేమా ఏవీ ఎప్పటికీ కనబడవని, తెలిసిన ప్రయాణం.
తోడుగా రాజకుమారి మాత్రమే. వట్టి రాజకుమారి కాదు. ప్రేమ చూపే రాజకుమారి. నందన ప్రేమించదు, కానీ ప్రేమ చూపించ గలదు. అది కూడా ఎక్కువ మోతాదులో. దాహానికి మంచినీళ్ళడిగితే పాయసం ఇచ్చేంత. జీవితాంతం మంచినీళ్ళకు బదులుగా పాయసం తాగడానికి సిద్ధపడ్డాడతను. ఆమెను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు.
చెల్లెలితో పోలిస్తే , వందన అందగత్తే కాదు. పైగా అమాయకురాలు కూడా.
ఆలోచనలు ముగిసే సరికి టైం ఎంతైందో చూశాడు. రాత్రి మూడైంది. ఇంతవరకూ ఎన్నో ఇంటర్యూలిచ్చాడు. ఏ ఇంటర్వ్యూ కూడా గడిచిపోయిన విషయాల్ని ఇంతలా గుర్తుకు తీసుకు రాలేదు అనుకుంటూ ఎప్పటికో తెల్లవారు జామున నిద్రపోయాడు.
*****
ఓ వారం తర్వాత , ఉదయం బ్రేక్ ఫాస్ట్ టేబిల్ దగ్గర అతనికి ఫోన్ ఇచ్చింది సెక్రెటరీ
"సర్ ఫోన్"
అవతల భాను.
"గుడ్ మార్నింగ్ "
జ్యూస్ తాగుతూ " యెస్ భాను, చెప్పండి"
"సర్, మీరా, నేను సెక్రెటరీకి ఫోన్ చేశాను"
ఒక వేళ భాను ఫోన్ చేస్తే వెంటనే తనకే ఇవ్వమని సెక్రెటరీకి అతనే చెప్పాడు.
"సెక్రెటరీకా, ఇంకా నాకోసమే చేసావనుకున్నాను. "
అటునుండి నవ్వు. " సర్, మీ అప్పాయింట్ కోసమని ఫోన్ చేశాను"
మూడు రోజులకు ఫోన్ చేస్తానంది.
“మూడు రోజుల తర్వాతంటే ఇప్పుడేనా?” అడిగాడు.
“సర్, నాకు చిన్న సర్జరీ జరిగింది. రావడానికి కుదర్లేదు.”
తినడం ఆపి, “ఏమైంది?”
“అపెండిసైటిస్ సర్. ఇప్పుడంతా బానే ఉంది. సర్, నేను బాగానే ఉన్నాను. ఈ రోజు ఇంటికెళ్ళమన్నారు కూడా .”
“ఏ హాస్పిటల్?”
*****
దారిలో వెళ్తుంటే భాను ఉన్న హాస్పిటల్ కనిపించింది. ఒక సారి ఆ అమ్మాయిని పలకరిస్తే అన్న ఆలోచన అప్పటికప్పుడు తట్టి, కారు ఆ హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళమన్నాడు.
కాసేపటికి ఆమె ఉన్న హాస్పిటల్ రూం తలుపు చప్పుడైంది.
తలుపు తీయగానే అతన్ని చూసి, మొదట నమ్మలేనట్లు చూసింది భాను. తర్వాత తేరుకుని “రండి సర్, లోపలికి రండి” అంటూ లోపలికి దారితీసింది.
“ఎలా ఉన్నారిపుడు?” ఆమెను పరామర్శించాడు.
ఆమె అతన్ని కూర్చోమని, హాస్పిటల్ వాతావరణం అతనికి సౌకర్యంగా లేదేమోనని కంగారు పడింది. లేచి ఎయిర్ కండిషనర్ స్విచ్ వేసింది.
“పర్లేదు భానూ. మీరు కూర్చోండి. నాకేం మర్యాదలవసరం లేదు. “
ఆమె సామాన్లన్నీ పేక్ చేసి ఉన్నాయి.
“డిస్ చార్జ్ చేశారా?”
“అవును సర్”
“మీతో ఎవరూ లేరా, ఒంటరిగా ఉన్నారే?"
" కారు పార్కింగ్ లోంచి బయటకు తీసుకుని వస్తానని అమ్మ ఇప్పుడే వెళ్ళింది.."
నొప్పిగా ఉందా, మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్ కు రావాలి లాంటి ప్రశ్నలడిగాడు.
ఇంతలో ఆమె ఫోన్ మోగింది. "అమ్మా, వచ్చేస్తున్నాను. ఒక్క నిముషం"
వీల్ ఛెయిర్ వచ్చింది ఆమె కోసం. అతను లేచి నిల్చున్నాడు.
"మీరు నాకోసం ఇలా వస్తారని అనుకోలేదు. థాంక్యూ సర్,"
"పర్లేదు, చూద్దామని వచ్చాను అంతే."
“సర్, మీ ఇంటర్వ్యూ సిడి చూపించాలి. ఎప్పుడు తీసుకురమ్మంటారు.”
“ముందు కోలుకోండి. మీకెలా అనిపిస్తే అలా edit చేసెయ్యండి. I think you are a better judge”
ఆమె మొహమాటంగా చిరునవ్వు నవ్వింది. వీల్ చెయిర్ లో కూర్చోబెట్టారు హాస్పిటల్ స్టాఫ్.
వంగి భుజం తట్టి "టేక్ కేర్" అన్నాడు.
‘ఆ అమ్మాయి నాకిష్టం’ మనసు అతనితో చెప్పింది. చిరునవ్వు నవ్వాడు. నాక్కూడా..అన్నాడు. అప్పుడప్పుడు అతనితో అతనే మాట్లాడుకుంటుంటాడు.
ఆమె కార్లో ఎక్కే వరకూ చూద్దామని నిలబడ్డాడు.
“థాంక్యూ సర్, బై” అంటూ ఆమె తన కారు దగ్గరకు వెళ్ళింది. . డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కారు దిగి వచ్చి, భానుని కార్లో జాగ్రత్తగా కూర్చోబెడుతోంది.
ఆమెకూ భానుకూ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అతన్నెవరో గట్టిగా కుదిపినట్లయింది. ఆమె ఎవరో కాదు.
సంధ్య.
భాను ...అవును సంధ్యలా ఉంది. అందుకే బాగా తెలిసినట్లు..
సిబ్బంది ద్వారా అతని రాక గురించి, తెలుసుకున్న హాస్పిటల్ CEO వచ్చాడు.
వస్తున్నట్లు ముందు ఓ కబురు చేస్తే బాగుండేది కదా, అంటూ ,అతన్ని మర్యాదగా లోపలకు తీసుకెళ్ళారు. హాస్పిటల్ CEO తో ఏదో మాట్లాడుతున్నాడు గానీ, ఆలోచనలు సునామీలాగా చుట్టేస్తున్నాయి. వాళ్ల దగ్గర సెలవు తీసుకుని బయటకొచ్చాడు..
అతను ఆలోచనల్లో ఉండగానే అతని కారొచ్చి ఆగింది. ఎవరో తలుపు తీశారు. యాంత్రికంగా కారెక్కాడు.
అంటే భాను, సంధ్య కూతురా?
గుండెల్లో విపరీతమైన అలజడి.
సెక్రెటరీ తర్వాత ప్రోగ్రాం ఎక్కడో ఏమిటో వివరిస్తోంది.
సంధ్య పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నందు వల్లే తనంతగా ఉద్వేగానికి లోనవుతోంది. సంధ్య కూతురా, అంటే సంధ్య మళ్ళీ పెళ్ళిచేసుకుందా?
‘ఏం తను పెళ్ళి చేసుకోలేదూ , ఆమె కూడా' లోపల్నుండి వచ్చిన సమాధానానికి గుండెల్లో చల్లదనం వ్యాపించింది. మగ మనసులో మంట వ్యాపించింది. భాను తండ్రి ఎవరో….
వళ్ళంతా వేడెక్కింది. కళ్ళల్లో కమ్ముకుంటున్న ఎరుపు మేఘాలు .
తనకన్నీ విజయాలే అని విర్ర వీగాడు. విధి ఈ రోజు, సంధ్య కూతుర్ని చూపెట్టి ఎంత దెబ్బ కొట్టింది . నేను ఆమెకు చేసిన ద్రోహానికి, ఇలా సమాధానం దొరికిందా.
మారుతున్న భావాలను, మండుతున్న మనసుని మౌనంతో కప్పి ఉంచాడు. అప్పటికీ దాని సెగలు అతన్ని కాలుస్తూనే ఉన్నాయి.
తర్వాతి ప్రోగ్రాం ఎక్కడో, ఏమిటో సెక్రెటరీ చెప్పబోయింది.
"కేన్సిల్ చెయ్యండి"
ఆమెకు అర్థం కాలేదు. ఈ ప్రోగ్రాం తర్వాత స్కెడ్యూల్ వివరించబోయింది.
“అన్నింటినీ కేన్సిల్ చెయ్యండి.”
ఆమె ఇంకేదో చెప్పబోయింది.
“Miss, Learn to obey my commands” మెత్తగా చెప్పాడు.
“సారీ సర్.”
మొబైల్ లో మెసేజ్ వచ్చిన సౌండ్. భార్య నుండి.’
తన ఫ్రెండ్స్ తో కలిసి, సింగపూర్ , మలేషియా కు షాపింగ్ కు వెళుతున్నాననీ , ఓ వారంలో వచ్చేస్తాననీ, తనని మిస్ కావొద్దనీ’
.
డ్రైవర్ తో వూరికి దూరంగా ఉన్న అతని గెస్ట్ హౌస్ కు కారుని పోనివ్వమన్నాడు.
రోజంతా ఆలోచించాడు.
మనసు గదిలో సభ్యత, నాగరికతకు చోటులోని ఓ చోటు కెళ్ళి ఆలోచిస్తున్నాడు. విధిని ఓడించలేక, ఓటమిని ఒప్పుకోలేక ఆవేశంతో రగిలిపోయాడు.
అన్నీ ఇచ్చినట్లే ఇచ్చి, విధి తనని దెబ్బ కొట్టిన తీరుకు తట్టుకోలేకపోతున్నాడు.
*******
ఆ వొక్క రోజు సెలవు తీసుకున్నందుకు నాలుగైదు రోజుల పాటు ఊపిరాడకుండా పని చేయాల్సి వచ్చింది.
మళ్ళీ గెస్ట్ హౌస్ కు చేరాడు. పని లేకపోతే, ఆలోచనలు అతని తలలో చేరి అతనితో ఆడుకుంటున్నాయి.
ద్రోహానికి తగ్గ దౌర్భాగాన్నీ అంట గట్టింది.
బిజినెస్ లో ఎన్నో కుట్రలు కుతంత్రాలు అవలీల గా చేసి ప్రత్యర్థులను ఓడించేవాడు.
ఎవరూ లేని ఓ చోట తన తప్పు ఒప్పుకున్నాడు. పైకి కనిపించేదంతా ఎంత అబద్ధం. తనూ, తన కీర్తి, ఐశ్వర్యం, ఆత్మవిశ్వాసం అవసరానికి పనికి రాని అస్త్రాలుగా, తను దెబ్బ తిన్న యోధుడిగా నిస్సహాయంగా పడి ఉన్నట్లు తోచింది.
కానీ విచిత్రంగా భాను మీద ఇష్టం పోవడం లేదు. ఆమె అంటే ఇంకా అదే భావన. ఆమెను తలచుకోగానే సంతోషం, ఉత్సాహం, జీవితం మీద ఆశ కలుగుతున్నాయి.
మధ్యాహ్నపు ఎండ తగ్గుతోంది. స్నానం చేసి బయటకెళ్దామనుకున్నాడు. ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఎవరై ఉంటారు భాను కు తండ్రి. ఎంత అదృష్టవంతుడు. ముచ్చటైన కూతురు. తనకు లేని భాగ్యం అతనెవరికో ... విసుగ్గా మొహం మీద నీళ్ళు చల్లు కుని అద్దంలోకి చూశాడు. ప్రతిబింబం నవ్వింది.
అవును.
'భాను నాకూతురై ఉండొచ్చుకదా. ఆమెకెంత వయసు ఉంటుంది. షుమారు ఇరవై మూడో నాలుగో. తనూ సంధ్యా విడిపోయి ఎన్నేళ్ళైంది.'
హడావుడిగా బయటికెళ్ళి, బాత్ రోబ్ తోనే హాల్లో టేబిల్ ముందు కూర్చున్నాడు. నోట్ బుక్ మీద లెక్కలు వేశాడు.
అవును తాము విడిపోయిన సంవత్సరం ..' అవును సరిపోతోంది. బహుశా, భాను నా బిడ్డేనేమో..'
సంతోషం లోపల్నుండి ఎగసి పడింది. చేతిలో పెన్ను పైకి గాల్లోకి విసిరేసి పట్టుకున్నాడు.
స్నానం నింపాదిగా కాకుండా, హడావుడిగా చేసి బయటికొచ్చాడు. చేతికందిన బట్టలు వేసుకుని కార్లో కూర్చున్నాడు. కార్లో వినిపించే ముఖేష్ విషాదం అతని లో ఉత్సాహం నింపుతోంది. సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసి భానుకు చేశాడు.
"ఎలా ఉన్నావు భానూ?"
ఏక వచనాన్ని గుర్తించింది.
"థాంక్యూ సర్, బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు?"
"భాను , ఎక్కడున్నావు?"
"ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ గా ఉంది అంటే అమ్మ ఇప్పుడే బయటకు తీసుకు వచ్చింది. కాఫీ షాప్ లో కూర్చున్నాం"
“నేను రావొచ్చా? “
“సర్, మీరా? ఇక్కడికి?”
“నాకేమీ తోచడం లేదు భానూ, కెన్ ఐ జాయిన్ యు ?” పేరంటానికెళ్ళే తల్లితో తనూ వస్తానని పేచీపెట్టే పిల్లవాడిలా అడిగాడు.
ఒక్క క్షణం సంకోచించి, “రండి సర్” అంటూ అక్కడికి ఎలా రావాలో చెప్పింది. .
అతనో గొప్ప మనిషి అయినా సరే, తన మీద పెరుగుతున్న ఇంట్రెస్ట్ గమనించింది. ఎందుకు తనను కలవడానికి ఆసక్తి చూపిస్తున్నాడో భానుకు అర్థం కాలేదు. ఎవరైనా దగ్గరవడానికి ప్రయత్నిస్తుంటే, కలిగే సహజమైన భయమే ఆమెకూ కలిగింది. ఈయన ఏం ఆశిస్తున్నాడు అని కాసేపు ఆలోచించింది. ఏది ఏమైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అనుకుంది.
“అమ్మా, మనకో గెస్ట్ వస్తున్నారు ఇప్పుడు.”
“ఎవరూ?”
“చెప్తే నమ్మలేవు, కాసేపట్లో చూస్తావుగా, ఆయనో సెలెబ్రిటీ. బట్, ఎందుకో నేనంటే ఇష్టం.”
*****
కాఫీ షాపు లోపల పెద్ద వాల్యూం లో పాటలు వస్తున్నాయి. షాపుకు ఓ పక్కన గార్డెన్ ఉంది. పచ్చటి లాన్ పక్కనే ఒక పూల్. అక్కడ కూడా మార్బుల్ తో చేసిన టేబిల్స్ ఉన్నాయి. పూల్ పక్కన, ఒక టేబిల్ దగ్గర కూర్చుని ఉన్నారు. సాయంత్రమైనా వెలుగు బాగానే ఉండడం తో సంధ్య తన వెంట తెచ్చుకున్న బుక్ చదువుకుంటోంది. భాను మనుషుల్ని చూస్తూ, అప్పుడప్పుడు మొబైల్ లో గేం ఆడుకుంటోంది. .
కొంత సేపటికి ఆ షాపులోపలికి వచ్చి చుట్టూ చూశాడతను. ఎప్పటిలాగే పాంట్ జేబుల్లో రెండు చేతులూ పెట్టుకుని ఉన్నాడు. అతనికి చలిగా ఉన్నట్లుంది. నేవీ బ్లూ స్వెట్టర్ వేసుకుని వచ్చాడు. అతను వీళ్ళ టేబిల్ దగ్గరకు రాగానే భాను లేచి నిల్చుని
“అమ్మా, సర్ గురించే నేనిందాక చెప్పింది. నీకు తెలిసే ఉంటుంది. , మా అమ్మ, R&B ఆర్కిటెక్ట్స్ మా అమ్మదే.”
ఇద్దర్నీ ఒకరికొకరికి పరిచయం చేసింది.
అతన్ని చూసి చదువుతున్న పుస్తకం మూసింది సంధ్య.
లోపలి భావాలు పైకి కనిపించకుండా ప్రవర్తించడం, గాలి పీల్చడం కన్నా ముఖ్యమనుకునే సమాజంలో బ్రతుకుతున్నారు కాబట్టి, ఇద్దరూ , అదే మొదటి పరిచయమైనట్లు , ఒకరినొకరు విష్ చేసుకున్నారు.
కూర్చోండి అతనికి సీట్ చూపించి, అతను కూర్చున్న తర్వాత,
“ఏం తీసుకుంటారు.” అడిగింది.
భాను వంక చూసి “వాటర్, జస్ట్ వాటర్” అన్నాడు.
సంధ్య బాటిల్ నుండి నీరు గ్లాసులోకి వొంపి అతని ముందుంచింది.
అక్కడున్న ముగ్గురిలో ఎవరికీ ఆసక్తి లేకపోయినా , వెదర్ గురించి, ట్రాఫిక్ గురించి కాసేపు మాట్లాడుకున్నారు.
“సర్, మీరొచ్చారు కదా, కార్లో ఇంటర్వ్యూ సీడీ ఉంది. తీసుకుని వస్తాను.” అంటూ భాను బయటకు వెళ్ళింది.
సంధ్యను చూసి 'చాలా మారిపోయింది కానీ వయసు దగ్గరికి రాలేదు' అనుకున్నాడు . స్వేచ్ఛగా ఎగిరే జుట్టు ఒద్దిక నేర్చుకున్నట్లుంది. తెల్లటి కాటన్ చీరకు నల్లటి చిన్న టెంపుల్ బోర్డర్ . మెడలో కానీ, చేతులకు గానీ ఎలాంటి నగలూ లేవు. ఆమె, మడత నలగని చీర, అంతే! సన్నబడిందేమో. పొడుగ్గా కనిపించింది.
ఇద్దరికీ మాట్లాడుకోవడానికి మాటలే దొరకలేదు.
“బాగున్నారా?” తనే మాట్లాడింది చిరునవ్వుతో.
పక్కింటి పెద్దమనిషి మార్కెట్ లో కనిపిస్తే పలకరించినట్లు చాలా మామూలుగా!
“ఊ..”
నువ్వు అనబోయాడు. మీరు అనలేకపోయాడు.
“హౌ ఆర్ యు?” ఇంగ్లీషు ఆదుకుంది.
“బాగున్నాను. ”
ఇండియా లో ఎన్నాళ్ళుండేది, ఎప్పుడు వెళ్ళిపోయేది అడిగింది.
అతను ఆమె పని ఎలా ఉందో ఏమిటో వివరాలు కనుక్కున్నాడు.
ఆ తర్వాత కాసేపు గడ్డకట్టిన నిశ్శబ్దం.
ధైర్యం చేశాడు.
“భాను నెప్పుడైనా చూడాలనుకుంటే, నేను కలుసుకోవచ్చా?”
“తప్పకుండా!” ఈ విషయంలో ఆమెకు కోపమొస్తుందని, అనుకున్నాడు. ఆమె చాలా సాధారణంగా ఒప్పుకోవడంతో ఆశ్చర్య పడ్డాడు.
మొబైల్ కు మెసేజ్ వస్తే చూసుకుంది. భాను ఎప్పుడు వస్తుందో అన్నట్లు అటూ ఇటూ చూసింది.
“సంధ్యా, వెళ్ళిపోవాలా? కొంచం మాట్లాడాలి. పర్లేదా?”
మొబైల్ బేగ్ లో వేసి, జిప్ లాగేసి “చెప్పండి.” అంది.
కింది స్థాయి ఉద్యోగికి బాధలు చెప్పుకునేందుకు టైం ఇచ్చినట్లుంది ఆమె ధోరణి.
కొద్ది సేపు మౌనంగా ఉండి ,
“నన్ను క్షమించు సంధ్యా. నాతో అసలు మాట్లాడతావని అనుకోలేదు.”
“క్షమాపణలు ఎందుకు. కలిసి నడవలేకపోయాము. అంతే! ఇద్దరి స్వభావాలు ఒకటి కానంత మాత్రాన ని ద్వేషించాల్సిన అవసరమేముంది.”
“నేను ఎంతో బాధపెట్టి ఉంటాను. నామీద కోపం లేదా?”
“లేదు. మీరు నన్నేమీ బాధపెట్టలేదు.ఏదైనా ఆశించి, డిజప్పాయింట్ అయితేనే కదా కదా కోపం. I am self- sufficient. మీ విషయాన్ని నేను తొందరగానే పక్కన పెట్టేశాను.”
“నువ్వు ఆ టైం లో సహాయం చేశావు, నేను మోసం చేశానని అనిపించలేదా?”
“ చేసిన వాళ్ళు సహాయమన్న విషయం మర్చిపోవాలి. మర్చిపోయాను. మీరు గుర్తుపెట్టుకున్నారు . థాంక్స్”.
“ఇదివరకెప్పుడూ నన్ను మీరు అనేదానివి కాదు.”
“అప్పుడు ..చిన్నతనం. నాకు కొన్ని మర్యాదలు తెలియవు. I am sorry” అని నవ్వింది.
“పెళ్ళి చేసుకోలేదా?”
“అదేం? చేసుకున్నా కదా?” మీకు తెలుసు కదా అన్నట్లు అడిగింది.
“అదికాదు” కాసేపు ఆగి సంకోచంగా “ఆ తర్వాత…”
“తర్వాత…No.. I din’t want to experiment again.”
“ అంటే , భాను….. మన పాపేనా?” వేగంగా వచ్చింది ప్రశ్న
“కాదు.” స్థిరంగా అంది .
.. To be continued.
విజయాల్ని చవి చూస్తోన్న అతని చూపుల్లోని ఆత్మవిశ్వాసం అడుగుల్లో కూడా వినిపిస్తోంది. నిల్చున్న చోటినుండి భవిష్యత్తు చూశాడు. అన్నీ ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. తన చుట్టూ వాతావరణం అంతా ప్రత్యేకంగా ఉండాలి. ఆమె పై ఓ నిర్ణయానికొచ్చాడు.
నందనతో జీవితం మొదలైంది. అందరి లాంటి ఆడపిల్ల కాదని తొందర్లోనే తెలిసింది. ఆమెకు చాలా అరుదుగా కోపం వస్తుంది. ఒక వేళ కోపం వస్తే , మొదట ఆమె చిరునవ్వు నవ్వుతుంది. ఆమెకూ ఆవేశానికీ ఆమడ దూరం.
తోడుగా రాజకుమారి మాత్రమే. వట్టి రాజకుమారి కాదు. ప్రేమ చూపే రాజకుమారి. నందన ప్రేమించదు, కానీ ప్రేమ చూపించ గలదు. అది కూడా ఎక్కువ మోతాదులో. దాహానికి మంచినీళ్ళడిగితే పాయసం ఇచ్చేంత. జీవితాంతం మంచినీళ్ళకు బదులుగా పాయసం తాగడానికి సిద్ధపడ్డాడతను. ఆమెను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు.
.
డ్రైవర్ తో వూరికి దూరంగా ఉన్న అతని గెస్ట్ హౌస్ కు కారుని పోనివ్వమన్నాడు.
రోజంతా ఆలోచించాడు.
మళ్ళీ గెస్ట్ హౌస్ కు చేరాడు. పని లేకపోతే, ఆలోచనలు అతని తలలో చేరి అతనితో ఆడుకుంటున్నాయి.
విధి
శ్రమకు తగ్గ అదృష్టాన్నిచ్చింది.ఎవరూ లేని ఓ చోట తన తప్పు ఒప్పుకున్నాడు. పైకి కనిపించేదంతా ఎంత అబద్ధం. తనూ, తన కీర్తి, ఐశ్వర్యం, ఆత్మవిశ్వాసం అవసరానికి పనికి రాని అస్త్రాలుగా, తను దెబ్బ తిన్న యోధుడిగా నిస్సహాయంగా పడి ఉన్నట్లు తోచింది.
హడావుడిగా బయటికెళ్ళి, బాత్ రోబ్ తోనే హాల్లో టేబిల్ ముందు కూర్చున్నాడు. నోట్ బుక్ మీద లెక్కలు వేశాడు.
స్నానం నింపాదిగా కాకుండా, హడావుడిగా చేసి బయటికొచ్చాడు. చేతికందిన బట్టలు వేసుకుని కార్లో కూర్చున్నాడు. కార్లో వినిపించే ముఖేష్ విషాదం అతని లో ఉత్సాహం నింపుతోంది. సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసి భానుకు చేశాడు.
కాఫీ షాపు లోపల పెద్ద వాల్యూం లో పాటలు వస్తున్నాయి. షాపుకు ఓ పక్కన గార్డెన్ ఉంది. పచ్చటి లాన్ పక్కనే ఒక పూల్. అక్కడ కూడా మార్బుల్ తో చేసిన టేబిల్స్ ఉన్నాయి. పూల్ పక్కన, ఒక టేబిల్ దగ్గర కూర్చుని ఉన్నారు. సాయంత్రమైనా వెలుగు బాగానే ఉండడం తో సంధ్య తన వెంట తెచ్చుకున్న బుక్ చదువుకుంటోంది. భాను మనుషుల్ని చూస్తూ, అప్పుడప్పుడు మొబైల్ లో గేం ఆడుకుంటోంది. .
“కాదు.” స్థిరంగా అంది .
.. To be continued.
13 comments:
"దాహానికి మంచినీళ్ళడిగితే పాయసం ఇచ్చేంత"
ఇక్కడ త్రివిక్రమ్ గుర్తొచ్చాడండీ,నువ్వే నువ్వే సినిమాలో ఐస్ క్రీం అడిగితే పార్లర్ కొనిచ్చేంత అన్న డైలాగ్ లో లా
మెలికలున్నా అర్ధం కావడానికి ఇబ్బందిలేకుండా రాస్తున్నారు భలే
చాలా బాగుందండి. రాజు సంధ్యతో డివోర్స్ విషయం చెప్పటానికి వచ్చినపుడు సంధ్య పంచ్ డైలాగులైతే సూపర్.
ఆత్మస్థైర్యం వున్న మరో అమ్మాయి. కథ ఊహించని మలుపులతో సాగిపోతోంది. తరువాత.....
చాలా బాగుందండీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్... సంధ్య పాత్ర చాలా బాగుంది.
అబ్బా., సరిగ్గా సస్పెన్స్ దగ్గర ఆపారు, ఆ ఒక్క ప్రశ్నకీ సమాధానమిచ్చాక ఆపచ్చుగా! కథ చాలా బాగుంది..
బై ద వే, సంధ్య పాత్ర వెరైటీ గా బాగుంది..నిజ జీవితం లో అలాంటి పాత్రని ఎప్పుడూ చూడలేదు..!
ఇంటరెస్టింగ్...నెక్స్ట్ పార్ట్ కోసం నేనూ వెయిటింగ్ ..(రాధిక నాని )
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ...... నందన కంటే వందన అమాయకురాలు అంటే మీ నందన ఎలా ఉండేదో ........
ఆ డెకరేషన్ గోల మళ్ళీ నాకు పెట్టకు, నాకస్సలు ఖాళీ లేదు.>> \M/
మన పాప కాదు... నా పాప.>>
ఇదే నెక్శ్ట్ పార్ట్ ఫస్ట్ డైలాగ్ అని రాక్షస గెస్సు ;)
yeppudu rastaru andi next part????waiting here...I read all these parts for almost 3 to 4 times..I just love the way u writing andi..
Raj, nuvvu serial wraayadam modalettachchu...fully qualified ani certificate nenu ichchesaa...
“హౌ ఆర్ యు?” ఇంగ్లీషు ఆదుకుంది.
“ చేసిన వాళ్ళు సహాయమన్న విషయం మర్చిపోవాలి. మర్చిపోయాను. మీరు గుర్తుపెట్టుకున్నారు . థాంక్స్""
మాటల్లేవ్. మీరు కేకన్నరండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి