continued from..
అతడు-ఆమె -2
రాజు, భాస్కర్, పెట్టబోయే హోటల్ బిజినెస్ గురించి చర్చించుకునేందుకు ప్రతి ఆది వారం కలిసేవాళ్ళు. ఆ మీటింగ్స్ లో సంధ్య ఉండేది కాదు. ఆమె స్వంత ప్రాజెక్ట్ లు చూసుకోవడానికి ఆమెకు ఆదివారమంతా సరిపోయేది.
అని నవ్వాడు.
చూస్తున్నాడు.
గాలికి ఎగిరే జుట్టు సవరించుకుంటూ పరుగున ఇంటి తలుపు తీసి లోపలికెళ్ళి వంట మొదలెట్టింది.ఓ అరగంటకు వంట పూర్తి అయింది.
కొన్నాళ్ళకు మౌనం వీడి వందనతో మొరపెట్టుకొన్నాడు. ఆ బాధలో వెలువడే వాక్యాలన్నింటికీ మొదలొక ‘మేడం’, చివర్నొక ‘మేడం’ తో అలంకరించాడు.
గౌరవం లేదు
కోపం
అహంకారం
ఎప్పుడూ వేళాకోళం
రాజు సంసారాన్ని చక్కదిద్దే బాధ్యత తన మీద వేసుకుంది.
“పని లో ఉండి కుదర్లేదు. మీరు ఇల్లు చక్కగా సర్దుకుంటారు. నాకెంతో నచ్చుతుంది.” చెప్పింది
రియాక్ట్ అయి ఏదో అనబోతున్న సంధ్యను ఆపేసి,
“అదేమీ కొత్త కాదు సంధ్యా, ఎప్పుడూ జరిగేదే, కాకపోతే, వారం రోజుల్లో పైనుండి ఇన్స్పెక్షన్ టీం వస్తోంది. ఆ టైం కు మనీ రీప్లేస్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. నా సేవింగ్స్ కూడా బిజినెస్ లోనే పెట్టాను. ”
"అలా అయితే సేల్ కే పెట్టండి సర్"
కొంచం ఆగి “నువ్వేమీ అనుకోకపోతే పెద్దవాడిగా ఒక్క మాట చెప్తాను. ఎమోషనల్ అయి తొందరపడుతున్నావేమో... ఆలోచించు. పెద్దనిర్ణయం"
******
అబ్బ చాలా బాగుంది అనుకున్నారు మగవాళ్ళిద్దరూ.
ఇంటి కప్పు పైనుండి వర్షం ధారలుగా పడుతోంది. అప్పుడప్పుడు కొన్ని ముత్యాలు వీళ్ళిద్దరిపైన కూడా పడుతోన్నాయి.
సంధ్యను దగ్గరకు తీసుకుని బుగ్గల పక్కగా ఉన్న ఉంగరాల జుట్టు సవరిస్తూ.. “సారీ” అన్నాడు.
అన్ని సౌకర్యాలున్న కంపెనీ వాళ్ళిచ్చిన ఇల్లు వదిలి, ఇలా పెంట్ హౌజ్ కు మారడంతో వందన ఇమడలేక ఇబ్బంది పడుతోంది. పనివాళ్ళు ,వంటవాళ్ళు లేరు.
ఫ్రెండ్స్ ను ఈ చిన్న ఇంటికి ఆహ్వానించలేకపోతోంది. పార్టీలు లేవు. ఊపిరాడనట్లుంది అక్కడ. దానికి తోడు భాస్కర్ ఇదివరకులా వందనతో సరదాగా మాట్లాడింది లేదు. భాస్కర్ ఇంటికి రాగానే తనతో కూర్చుని కబుర్లాడుతాడని ఎంతో ఎదురుచూస్తుంది. కానీ అతను అలిసిపోయి వచ్చి పడుకుంటాడు. ఎవరికి వారులా తయారయారు.
వందన కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
హోటల్ ప్రారంభోత్సవానికి ముందే, రాజు, భాస్కర్ ఇద్దరూ ఒకే చోట ఉండేందుకు వీలుగా పెద్ద ఇల్లొకటి అద్దెకు తీసుకున్నారు. దాని ముస్తాబులు కూడా పూర్తి అయ్యాక, వందనకు కబురు చేశాడు భాస్కర్.
పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ విడిగా ఉన్నది లేదు. ఇన్ని రోజులు వందన లేకుండా గడిపినందుకు అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఆలోచించింది. ఆలోచనలు ఓ దరికి వచ్చే సరికి అర్థమూ వచ్చేసింది.
అందమైన రోజా పువ్వులాంటి వందన.
పూలని పూలలాగే చూసుకోవాలి. బరువులూ, బాధ్యతలూ మోపకూడదు.
వందన అతని వేపు చిలిపిగా చూసి, "దొంగా అంతా తొందరే." అని చెంప మీద కొట్టింది.
"అహ .. అదికాదు" అని సరిచేయబోయి ఆగిపోయాడు. ఆమె అలా అర్థం చేసుకుంటేనే క్షేమం అనిపించి.
******
ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులందరూ, రాజునీ, భాస్కర్ నూ తోడల్లుళ్ళు అనుకున్నారు. ఆ మాటలకు, రాజు ముసిముసిగా నవ్వుతూ సంతోషంగా ఇబ్బంది పడ్డాడు.
సెలెబ్రిటీల హడావుడి, వాళ్లతో వచ్చిన పరివారజనం, చూసేందుకు వచ్చిన పురజనం తో బాగా రద్దీ ఏర్పడింది.
రాజుకు పెళ్ళైన సంగతి తెలియని ఆయన, నందనను అతనికిస్తే బాగుంటుందనీ, అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారనీ మనసులో అనుకున్నాడు.
ఉదయం మొదలెట్టిన పని, రాత్రికి తప్ప ఆపలేనంత హడావుడిలో పడింది సంధ్య. ఆమెకు ఎప్పుడైనా హోటల్ ఓపెనింగ్ గుర్తొస్తూ ఉంటుంది. మనసెందుకో విచారమని పిస్తుంది. మళ్ళీ వెంటనే పనిలో పడిపోతోంది.
ఇలాంటి విషయాల్లో, ప్రకృతి ఏనాడూ అశ్రద్ధ చూపదు. వారిద్దరూ దగ్గరవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
బయటికొచ్చి నిల్చుంది. సాయంత్రం రాత్రి కాబోతోంది. రాజు మెట్లెక్కి వస్తున్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది.
....to be continued
8 comments:
మా గుండె కూడానండీ....:)
nenu roju vachhi choosukuni veltunnanu... next part kosam..
so happy to see this part..
mee blog ee madhya ne choosanu... chala bavundi...
I really appreciate the way you design your heroines charecter's....
somebody ought to tell the world that maturity in women is beautiful.. not stupidness..
waiting for your next part :) :)
Wow ! Interesting !మలుపులు అర్ధం అవుతున్నాయి అనే అనిపిస్తుంది ! Waiting for next part !
మీ సీరియల్ లో నెక్స్ట్ పార్ట్ గురించి ఊహించుకొని, మా గెస్ లు దారుణంగా దెబ్బ తినేసిన సంధర్భాలు బోల్డు కాబట్టీ...అలాంటి ప్రయత్నాలేమ్ చెయ్యకుండా తరువాతి భాగం కోసం ఎదురు చూస్తూ ఉన్నానండీ.
అద్భుతః
బాగుందండి. అయితే, అక్కడక్కకా సంధ్యవైపునుంచి స్టోరీ చెబుతున్నట్లుగా ఉంది. ఉదా.కు ఆఖరి అధ్యాయంలోని మొదటి వాక్యం..."ఓ రోజు సాయంత్రం పనిచేసుకుంటుంటే భాస్కర్ వచ్చాడు".
ఈ పార్టులో స్టోరీని సీరియస్సుగా నడిపించినట్టున్నారు. మొత్తానికి కాసేపు వందనను ఆకాశం నుండి తోసి నేలమీద పడేసినట్టున్నారు. వందన కేరెక్టర్ని ఇంకాసేపు సరదాగా కష్టపెట్టి ఏడిపించుంటే, తిను ఎంతలా ఫీలయ్యేదో, యు నో అంటూ, అరరే, మేం సూపర్ కామెడీ మిస్. వందన + నందన = ఆక్రందన :( ఇప్పటిదాకా సంధ్య ఒక్కరే డిగ్నిఫైడ్ గా ఉన్నారు. సంధ్య జీవితాన్ని సల్లంగ చూడండి. బాగుందండి.
మీరు రాసే కథను ముందుగానే ఊహిస్తున్నామనే భ్రమతో తరువాతి భాగాన్ని మొదలు పెట్టడం.. వెంటనే నిరాశకు గురవ్వడం సహజమైపోయి.. ఊహించడమే మానేశాం! కేవలం ఎదురుచూడడమే మిగిలింది.
మీ కథ కొంత వరకు అర్ధం అవుతూంది. కాని రాజు పాత్ర చిత్రణలోఈ భాగం లో ఎక్కడొ కొంచం వెలితి కనిపిస్తున్నాది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి